పిల్లల మీద వంశ ప్రభావం ఉంటుందా- అంటే ఉంటుందనే చెప్పాలి. శారీరకంగా, తెలివితేటలపరంగా అయితేనేం, కళాభిరుచులయితేనేం- పెద్దల పోలికలు పిల్లలకు రావడం మనకు తెలిసిన విషయమే కదా. ఇది చాలా వరకూ జీన్స్ ప్రభావమే అని “మెండెల్ ” థియరీ చెబుతుంది.
మా నాన్నగారి తండ్రి, కోనసీమలో లెక్కల మాస్టారు. చాలా అద్భుతంగా లెక్కలు చెప్పేవారట. చిన్నప్పుడే ఆయన చనిపోతే, మా నాన్నగారు తల్లితో చిన్న పాకలో ఉంటూ, దయాత్ముల ఇళ్లలో వారాలు చేసుకుంటూ గ్రాడ్యుయేట్ అయ్యారుట. ఎనభై సంవత్సరాల క్రితం మాట ఇది. మా తండ్రిగారి ప్రభావం మా మీద చాలా ఉంది. ఆయన జీవితం కొంతవరకూ “విజయానికి అయిదు మెట్లు” లో కనపడుతుంది.
బస్తర్ లో పుట్టి రాయలసీమలో పని చేసిన మా తాతగారు (అమ్మ తండ్రి) కవి..! వారు సీస పద్యాలు ఆశువుగా చెప్పేవారట.
లెక్కలు, సాహిత్యం- ఈ రెండిటి కాంబినేషను "వెన్నెల్లో ఆడపిల్ల"లో కనబడుతుంది.
మరి 'పండిత పుత్ర ...' అని నానుడి ఎందుకు వచ్చింది? నాకు సరిగ్గా తెలియదు. ఎక్కడో వారసత్వ క్రమంలో ఒక 'క్రోమోజోమ్' తప్పు దారి పట్టి ఉండవచ్చు. కానీ ఆ పొరపాటు ఎక్కువగా జరిగేది ‘బ్యాడ్ పెంపకం’ వల్లనే అని నా నమ్మకం.
No comments:
Post a Comment