Sunday, 16 November 2025

నమాతా పితా నైవబంధుర్నమిత్రానమే ద్వేషరాగౌనమే లోభమోహౌ…

నమాతా పితా నైవ
బంధుర్నమిత్రా
నమే ద్వేషరాగౌ
నమే లోభమోహౌ…

న పుణ్యం న పాపం
న సౌఖ్యం న దు:ఖం
చిదానందరూప:
శివోహం శివోహం..

తల్లి ఏది? తండ్రి ఏడి?
అడ్డు తగిలే బంధమేదీ?

మమతలేవీ? మాయలేవీ?
మనసుపొరల మసకలేవీ?

నీ ఇల్లు నీ వాళ్ళు
నీదంటూ ఈ చింత
సుంతైన లేని ఈ నేల పై నడయాడు ఋషివో
కృషితో నాస్తి దుర్భిక్షమని లోకాన్ని శాసించు
మనిషివో.. ఋషివో.. రాజర్షివో..
 ఎవరివో.. నీవెవరివో.. నీవెవరివో.. ఎవరివో

న మంత్రో న తీర్ధం
న యజ్ఞా: న వేదం
న ధర్మో నచార్ధో
న మోక్ష : న కామం

న మృత్యుర్నశంకా
న మే జాతి భేదం
చిదానందరూప:
శివోహం శివోహం..

జాగృతములో జాగు ఏదీ? రాత్రి ఏదీ? పగలు ఏదీ?
కార్యదీక్షా బద్ధుడవుగా.. అలుపు ఏదీ? దిగులు ఏదీ?

ఉఛ్వాస నిశ్వాసముల ప్రాణయాగాన్ని 
ఉర్వీజనోద్ధరణకై  చేయు రాజయోగిీ..
కదనరంగాన కర్మయోగీ

అహం నిర్వికల్పో
నిరాకర రూపో
విభుర్వ్యాప్య సర్వత్ర
సర్వేంద్రియాణాం

న తేజో నవాయుర్ణ
భూమి ర్న వ్యోమం
.చిదానందరూప:
శివోహం శివోహం..

నిర్వసన, వాసాన్న సంక్షేమ 
స్వాప్నికుడు ఇతడు..
నిష్క్రియా ప్రచ్ఛన్న సంగ్రామ 
శ్రామికుడు ఇతడు..
నిరత సంఘశ్రేయ సంధాన 
భావుకుడు ఇతడు..

మహానాయకుడు ఇతడు..
మహానాయకుడు ఇతడు..

నమాతా పితా నైవ
బంధుర్నమిత్రా
నమే ద్వేషరాగౌ
నమే లోభమోహౌ…

న పుణ్యం న పాపం
న సౌఖ్యం న దు:ఖం
చిదానందరూప:
శివోహం శివోహం..

న మంత్రో న తీర్ధం
న యజ్ఞా: న వేదం
న ధర్మో నచార్ధో
న మోక్ష : న కామం

న మృత్యుర్నశంకా
న మే జాతి భేదం
చిదానందరూప:
శివోహం శివోహం..

అహం నిర్వికల్పో
నిరాకర రూపో
విభుర్వ్యాప్య సర్వత్ర
సర్వేంద్రియాణాం

న తేజో నవాయుర్ణ
భూమి ర్న వ్యోమం
.చిదానందరూప:
శివోహం శివోహం..

No comments:

Post a Comment