Saturday, 29 November 2025

భారతదేశ ఆధునిక పౌల్ట్రీ రంగానికి పితామహులలో ఒకరు, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ వ్యవస్థాపకులు, శ్రీనివాస ఫారమ్స్ అధినేత శ్రీ చిట్టూరి జగపతి రావు గారి మరణ వార్త ఎంతో విచారానికి గురి చేసింది. 6,000 కోళ్లతో ప్రారంభించి, దేశానికి 'ప్రొటీన్ సెక్యూరిటీ'ని అందించడంలో, 142.8 బిలియన్ గుడ్ల ను ఉత్పత్తి చేయడంలో, ఆరు మిలియన్లకు పైగా ఉద్యోగాలను సృష్టించడంలో ఆయన కృషి చిరస్మరణీయం.

భారతదేశ ఆధునిక పౌల్ట్రీ రంగానికి పితామహులలో ఒకరు, నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ వ్యవస్థాపకులు, శ్రీనివాస ఫారమ్స్ అధినేత  శ్రీ చిట్టూరి జగపతి రావు  గారి మరణ వార్త ఎంతో విచారానికి గురి చేసింది. 
6,000 కోళ్లతో ప్రారంభించి, దేశానికి 'ప్రొటీన్ సెక్యూరిటీ'ని అందించడంలో, 142.8 బిలియన్ గుడ్ల ను ఉత్పత్తి చేయడంలో, ఆరు మిలియన్లకు పైగా ఉద్యోగాలను సృష్టించడంలో ఆయన కృషి చిరస్మరణీయం. 

ఆయన శాస్త్రీయ దృక్పథం, సామాజిక బాధ్యత ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. నేషనల్ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ (NECC) ని స్థాపించడం ద్వారా ఆయన దేశంలో వేలమంది మంది రైతులకు రక్షణ కల్పించారు. దేశంలో కోళ్ల పరిశ్రమ అభివృద్ధికి నిరుపమానమైన కృషి చేశారు.

వారి దార్శనికత తో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమయ్యింది అనడంలో సందేహం లేదు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఒక ముఖ్యమైన రంగంగా పౌల్ట్రీ రంగాన్ని అభివృద్ధి చేయడంలో, రైతులకు నికరమైన ఆదాయాన్ని సముపార్జించి పెట్టడంలో ఆయన వెన్నుదన్నుగా నిలవడం దేశానికి గర్వ కారణం.

 2023లో 'ఇంటర్నేషనల్ ఎగ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు పొందిన మొదటి ఆసియా వ్యక్తి ఆయన.
ఆయన  సంస్థాగత నిర్మాణ కృషి, సామాజిక సేవ దేశానికి ఎప్పటికీ మార్గదర్శకం. IPJA లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్, పౌల్ట్రీ లెజెండ్ వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులు సాధించి దేశ పౌల్ట్రీ రంగానికి గర్వకారణంగా నిలిచారు. 

ఇటువంటి మహోన్నత వ్యక్తి మరణం బాధాకరం. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని వారి నివాసానికి వెళ్లి వారి భౌతిక కాయానికి నివాళులు అర్పించాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఓం శాంతి!

No comments:

Post a Comment