రాజాధి రాజా యోగి రాజా
పరబ్రహ్మ శ్రీ సచిదానందా
సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
నీ పాదముల ప్రహవించిన గంగ యమునా
మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ
సాయీ నీ పాదముల ప్రహవించిన గంగ యమునా
మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ
ఏ క్షేత్రమైన తీర్థమైన నీవేగా
ఏ జీవమైన భావమైన నీవేగా
నీవు లేని చోటు లేదు సాయి
ఈ జగమే నీ ద్వారకామాయి
సాయీ నీ పాదముల ప్రహవించిన గంగ యమునా
మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ
మనుజులలో దైవం నువ్వు
కోసల రాముడివై కనిపించావు
గురి తప్పని భక్తి ని పెంచావు
మారుతీ గ అగుపించావు
భక్త సులభుడవై కరుణించావు
భోళా శంకరుడిగ దర్శనం ఇచ్చావు
ముక్కోటి దైవాలు ఒక్కటైనా నీవు
ఏకమనేకమ్ముగ విస్తరించినావు
నీవు లేని చోటు లేదు సాయి
ఈ జగమే నీ ద్వారకామాయి
నీవు లేని చోటు లేదు సాయి
ఈ జగమే నీ ద్వారకామాయి
సాయీ నీ పాదముల ప్రహవించిన గంగ యమునా
మా పాలిట ప్రసరించిన ప్రేమ కరుణ
ఆరడుగుల దేహము కావు
భక్తుల అనుభూతికి ఆకృతి నీవు
అందరికి సమ్మతమే నీవు
మతమన్నదే లేదన్నావు
అన్ని జీవులలో కొలువైనావు
ఆత్మ పరమాత్మలు ఒకటేనన్నావు
అణురేణు బ్రహ్మాండ విశ్వమూర్తి నీవు
సృస్తి విలాసముకే సూత్రధారి నీవు
నీవు లేని చోటు లేదు సాయి
ఈ జగమే నీ ద్వారకామాయి
No comments:
Post a Comment