శాస్త్రీయ సంగీతం నేర్చుకుని భుక్తి కోసం, బ్రతకడం కోసం మాత్రమే కాకుండా భక్తిగా భగవంతుడి సేవకోసం విద్యని అంకితం చేసిన మహనీయులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు.
అన్నమయ్య వరప్రసాద్ అని అందరూ పిలవడం తన అదృష్టం గా భావించిన ఆయన "పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు "అని పాడుతుంటే అమ్మవారు చేతిలో తలంబ్రాల బియ్యం తో సిగ్గుపడుతూ కనిపిస్తుంది మనో నేత్రం తో మనం చూడగలిగితే..
ఆయన "వినరో భాగ్యము విష్ణు కథ.".అని పాడుతుంటే ఆ స్వామి చిరునవ్వుతో వింటున్నట్టే వుంటుంది..ఆ చిరునవ్వు మనం వినగలిగితే..
తన యుక్త వయసు నుండి చరమాంకం వరకూ భక్తి ,సంగీతం తో అనునిత్యం గడపడం సామాన్యుడికి అసాధ్యం ..ఆ కలియుగ దైవం వేంకటేశ్వరుడి కృప కి పూర్తిగా అర్హులు గరిమెళ్ల వారికి ఇదే శిరోధార్యం.
వందల అన్నమయ్య కీర్తనలకు స్వరకల్పన.అన్నమయ్య ప్రాజెక్ట్ లో కీలక భాధ్యత,టిటిడి చేసినో ఎన్నో దైవ కార్యక్రమాల్లో భాగస్వామ్యం...
వేల భక్తి సంగీత కచేరీలలో సగర్వంగా సంగీత సేవ.తానే స్వరపరిచిన ఆంజనేయ కృతి ,బోలెడన్ని పాటల విజ్ఞాన గని ,పుస్తకాలు ..ఒకటని కాదు..ఒక వ్యక్తి తన జీవితం లో ప్రతీ క్షణాన్ని సద్వినియోగం చేస్తూ భక్తిగా ఉంటూ ఈ జీవితాన్ని ఇచ్చిన గురువులకి ,తల్లితండ్రులకు ,స్వామి సేవకి సంసారిగా ఉంటూ చక్కగా సమర్పణ చేసిన గొప్ప వ్యక్తి..
ఆయన చేసే కచేరీలలో తప్పనిసరిగా 90 శాతం ఏదో ఒక సమయంలో చూసుకుని బ్రహ్మ మొక్కటే.. కీర్తన పాడేవారు...
ఆయన హృద్యం గా పాడుతుంటే కళ్ళలో నీళ్ళు తిరిగేవి...
రక్త సంబంధం లేదు,బంధుత్వం లేదు ..అయినా ఇంతటి వ్యక్తి లేరు అనగానే ...ఆయన భక్తి కి మెచ్చి భూమి మీదేనా ఎప్పుడూ ... రావయ్యా.. వచ్చి స్వర్గం లో నీ కీర్తనలు పాడు అని స్వామి దగ్గరుండి తీసుకెళ్లినట్టే అనుకున్నా..
......
నిండార రాజు నిద్రించు నిద్రయు నొకటె
అంటనే బంటునిద్ర అదియు నొకటె
మెండైన బ్రాహ్మణుడు మెట్టుభూమి యొకటే🙏🙏
చండాలుడుండేటి సరిభూమి యొకటే🙏🙏
No comments:
Post a Comment