Saturday, 15 March 2025

అమరావతిలో వెంకటపాలెంలో టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన శ్రీ శ్రీనివాస కళ్యాణం విశేషభరితంగా ముగిసింది. రాష్ట్ర గవర్నర్ గౌ|| శ్రీ ఎస్. అబ్దుల్ నజీర్ గారు, ముఖ్యమంత్రి గౌ|| శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సతీసమేతంగా హాజరై, ఈ పవిత్ర కార్యక్రమంలో పాల్గొన్నారు.

అతిథులు ధ్వజస్థంభం, గరుడాళ్వార్ల వద్ద నమస్కారం చేసి అనంతరం శ్రీవారి సన్నిధికి చేరుకున్నారు. వేదపండితులు వేద ఆశీర్వచనాలు, అర్చన, హారతులు నిర్వహించి, తీర్ధ ప్రసాదాన్ని అందించారు. కళ్యాణ క్రతువు ప్రారంభమైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం చంద్రబాబు గారు శాస్త్రోక్తంగా స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం వేదపండితులు సీఎం గారికి ఆశీర్వచనం చేసి శ్రీవారి ప్రసాదాన్ని అందజేశారు.

ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, టీటీడీ ఈవో శ్రీ జె. శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, టీటీడీ బోర్డు సభ్యులు హాజరయ్యారు. అమరావతిలో తొలిసారిగా టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించిన కళ్యాణోత్సవం కావడంతో రాజధాని పరిసర గ్రామాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దాదాపు 30,000 మంది భక్తులకు శ్రీ వేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని టీటీడీ అందజేసింది.

ఈ మహోత్సవం ఆధ్యాత్మిక వైభవాన్ని, భక్తిశ్రద్ధలను పెంపొందించే విధంగా అత్యంత భక్తిపరమైన వాతావరణంలో, గరుడగంభీరంగా సాగింది. శ్రీ వేంకటేశ్వరస్వామి కటాక్షంతో భక్తులకు సకల సంపదలు, శాంతి, ఐశ్వర్యాలు ప్రసాదించగలుగునుగాక!

No comments:

Post a Comment