Friday 4 October 2024

ఓంకారం సకలకళా శ్రీకారం

ఓంకారం సకలకళా శ్రీకారం

చతుర్వేద సాకారం

చైతన్య సుధాపూరం

జ్ఞాన కమల కాసారం



ధ్యాన పరిమళాసారం

మధుర భక్తి సింధూరం

మహా భక్త మందారం

భవ భేరీ భాండారం



హృదయ శంఖ హుంకారం

ధర్మ ధనుష్టంకారం

జగత్ విజయ ఝంకారం

అద్వైత ప్రాకారం భజేహం



అండాకారాండ పిండ భాస్వత్

బ్రహ్మాండ భాండ నాదలయత్

బ్రహ్మ్యాత్మక నవ్య జీవనాధారం

వర్ణ రహిత వర్గమధిత

లలిత లలిత భావ లులిత భాగ్య

రజిత భోగ్య మహిత వసుధైక కుటిరం



కామితార్ధ బందురం

కళ్యాణ కందరం

సద్గుణైక మందిరం

సకలలోక సుందరం

పుణ్య వర్ణ పుష్కరం

దురిత కర్మ దుష్కరం



శుభకరం సుధాకరం

సురుచిరం సుదీపరం

భవకరం భవాకరం

త్రిఅక్షరం అక్షరం భజేహం




మాధవ మాయా మయ బహు

కఠిన వికట కంటక పద సంసార

కానన సుఖ యాన శకట విహారం



అష్టాక్షరీ ప్రహృష్ట పంచాక్షరీ విశిష్ట

మహా మంత్ర యంత్ర తంత్ర

మహిమాలయ గోపురం



ఘనగంభీరాంబరం

జంబూ భూభంబరం

నిర్మల యుగ నిర్గరం

నిరుపమాన నిర్జరం

మధుర భోగి కుంజరం

పరమ యోగి భంజరం

ఉత్తరం నిరుత్తరం మనుత్తరం

మహత్తరం మహాకరం మహాంకురం

తత్త్వమసీ తత్పరం

తధితరాత్త మోహరం

మృత్యోర్మమృతత్వకరం

అజరం అమరం

'మ' కారం 'ఉ' కారం 'అ' కారం

ఓం కారం అద్వైత ప్రాకారం 


No comments:

Post a Comment