నేలే ఆవిరౌతుందంటే నమ్మాలా
నింగికి ఆయువు తీరిందంటే నమ్మాలా
దైవానికి మరణం ఉంటుందంటే నమ్మాలా
అది జరగబోదు అని, జగరనీవ్వనని
వస్తున్నా బాబా వస్తున్నా
ఆ మృత్యువు రాకను ఆపేయాలని వస్తున్నా
మీ బదులుగా నేనే బలి అవుతానని వస్తున్నా
బాబా వస్తున్నావస్తున్నా బాబా వస్తున్నా
బాబా మిమ్మల్ని చూడకుండా
మీ చూపుకు నోచుకోకుండా ఎలా బ్రతకటం బాబా
బాబా ఈ నిజాన్ని ఎలా భరించాలి
ఇక మా బాధల్ని ఎవరితో చెప్పుకోవాలి బాబా
భక్తులు మీరు మీ భక్తికి బానిస నేను
సూర్యచంద్రులు, చుక్కలు నేనై కనపడుతుంటాను
మిమ్ము కనిపెడుతున్నాను
బాబా నేను మీ భారం మోస్తుంటాను
సమాధి నుండే సమాధి నుండే గమనిస్తాను
సహాయం అడిగితే కదిలొస్తాను
పిలిస్తే పలుకుతాను పిలిస్తే పలుకుతాను
పిలిస్తే పలుకుతాను
బాబా బాబా బాబా
వస్తున్నా బాబా వస్తున్నా బాబా
నీ బదువుగా నేనే బలిఅవుతానని వస్తున్నా
బాబా వస్తున్నా వస్తున్నా బాబా వస్తున్నా
మీ భక్తుల ఇంట్లో లేదు అనేది మాటే వినపడదని మీరే చెప్పారు బాబా
మాకిప్పుడు వెలుగు లేదు నీడ లేదు అసలు మా బ్రతుక్కి అర్థమే లేదు
మీరు లేనిలోటు ఎలా తీరాలి బాబా ఎలా తీరాలి
నిర్మలమైన మనసుతో నిశ్చలమైన భక్తితో
నా రూపాన్నే తలవండి మీ లోపల కొలువవుతాను
నా నామాన్నే పలకండి మీ లోపం తొలగిస్తాను
నా హారతి దర్శించండి, మీ ఆపద ఆపేస్తాను
నా విభూది ధరియించండి, మీ వేదన నాదంటాను
నా జ్యోతులు వెలిగించండి మీ మనసులు వెలిగిస్తాను
నా చరితను పఠించండి మిము చరితార్థులను చేస్తాను
మరణ శయ్య కాదిది శరణు కోరినవారి కరుణ శయ్య
సమాధి కాదిది, కష్టాల తొలగించు సన్నిధి
జ్ఞాన సిరిలందించు పెన్నిధి
శాంతి సౌఖ్యాలనొసగే షిరిడీ షిరిడీ
శాంతి సౌఖ్యాలనొసగే షిరిడీ
No comments:
Post a Comment