Sunday 26 May 2024

ఐదురోజుల పెళ్లి అమ్మంటి పెళ్లితొలిచూపు లే లేని తెలుగింటి పెళ్లివరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లివధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి

ఐదురోజుల పెళ్లి అమ్మంటి పెళ్లి
తొలిచూపు లే లేని తెలుగింటి పెళ్లి
వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి
వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి

ఆకాశ పందిళ్లు భూలోక సందళ్ళు
శ్రీరస్తు పెళ్లిళ్లు శుభమస్తు నూరేళ్లు

తుమ్మెద లాడే గుమ్మాల జడలో
హంసలు ఊడే అమ్మలా నడలో
నగలకు కందే మగువల మేడలో
పడుచు కళ్లకే గుండెల దాడలో

ఆరలమ్మ కోవెల ముందు పసుపు లాటతో ధ్వజారోహణం
కల్యాణానికి అంకురార్పణం పడతులు కట్టే పచ్చ తోరణం

ఇందరింథుల చేయి సుందరుడే హాయి తలకు పూసే చేయి తలుపులొక్కవే
నలుగు పెట్టిన కొద్దికి అలిగింది వయసు వయసు అలిగిన కొద్దీ వెలిగింది మనసు

మగపెళ్లి వారట ఈమని వారట పెళ్లి కి తరలి వస్తున్నారట
కాఫీలు ఎరుగరట ఉపములు ఎరగరట వీరికి సద్దన్నామే ఘనమౌ
వీరి గొప్పలు చెప్పా తరమ
బ్యాండ్ మేళం రాగారట డోలు సన్నాయి ఎరగరట వీరికి భోగ మేళం ఘనమౌ
వీరి గొప్పలు చెప్పా తరమ
మగపెళ్లి వారట ఈమని వారట పెళ్లి కి తరలి వస్తున్నారట

ఇమ్మని కట్నం కోరి మే అడగలేదు ఇప్పటికైనా ఏప్ఏ బిఏ చెప్పించండి
చెన్నపట్నం స్టాండ్ అద్దం కావాల్మాకు దానికి తగిన పందిరి మంచం ఇప్పించండి
పానుపురు కండ్ల జోడు కావాల్మాకు దానికి తగిన రిస్ట్ వాచ్ ఇప్పించండి
ఇమ్మని కట్నం కోరి మే అడగలేదు ఇప్పటికైనా ఏప్ఏ బిఏ చెప్పించండి

నచ్చే అచే గర్ల్ ఫ్రెండ్ ఎక్కడ

అది లబో దిగొ గాబో జబ్బో మ్యారేజ్ లవ్ మ్యారేజ్
అది హనీ మూన్ అవ్వంగనే డామేజీ
ఎవరికీ వారే యమునా తీరే ప్యాకేజీ తోక పీకేజి
అది ఆటో ఇటో అయ్యిదంటే దారేది – కృష్ణ బ్యారేజీ

ఆకాశ పందిళ్లు భూలోక సందళ్ళు శ్రీరస్తు పెళ్లిళ్లు శుభమస్తు నూరేళ్లు

ఐదురోజుల పెళ్లి అమ్మంటి పెళ్లి
తొలిచూపు లే లేని తెలుగింటి పెళ్లి
వరుడు కోరిన పెళ్లి రామయ్య పెళ్లి
వధువు ఎవరో కాదు సీతమ్మ తల్లి

చేదు కాదోయి తమలకు ముక్క అందులో వెయ్యి సిరిపోగా సిక్కా
సున్నమేసావో నీ నూరు పొక్క పక్కు మంటది మా ఇంటి సుక్క
పచ్చ కర్పూర తాంబూలమిచ్చాక యెక్క మాచోయి కొమల్లె పక్క

పంచుకోవచ్చు మా పాల సుక్క పండుకోవచ్చు సై అంటే సక్కా
తెల్లవారాక నీ బుగ్గ సుక్క గుమ్మా కేరకల గురుతైనా లక్క
కరిగిన నా పోదు ఏ బంధమాల్లోడో నిండు నూరేళ్ళదీ జంట అక్క

నిన్ను దీవించిన ఆడ బిడ్డ నూరు దివి సీమ లో నంది గెడ్డ
ఆడ పంతుళ్ళ లక్షింతలడ్డా మంచి శకునాలు మే ఇంట సెడ్డ
మమ్ము కనిపెట్టు మా రాసా బిడ్డ

తట్టలో కూర్చుండ బెట్టిన వధువునా గుమ్మడి పువ్వు లో కులికేనొకటి
నడిమంచు ముత్యమా మన వధువు రత్నమా

No comments:

Post a Comment