Deva devam bhaje :-
మధురాతి మధురమైన శ్రీరామనామ నంకీర్తన వినిపిస్తున్నారు
అన్నమాచార్యులవారు. గీర్వాణిలో ఆనందరస సిద్ధిని కలిగించే కీర్తన ఇది. శ్రీరాముడు రావణాసురవైరి, కాని శ్రీరామునికి వైరిభావం లేదు. ఆయన దుష్టశిక్షణ కోసమే వానిని సంహరించాడు.
నీలజీమూత సన్నిభుడట. భూలల నాధిపుడట. పరమనారాయణుడట. శంకరార్పిత జనక చాప దళనుడట. లాలిత విభీషణుడట. వేరెవ్వరూ రామచంద్రునికి ఇట్లా కీర్తించలేదు “తాలాహి నగహరం” అంటే ఏమిటో
చెప్పగలరా? ప్రయత్నించండి...
----------------------------------------------------------
Keerthana :-
దేవ దేవం భజే దివ్యప్రభావం
రావణాసురవైరి రఘుపుంగవం
రాజవరశేఖరం రవికులసుధాకరం
ఆజానుబాహు నీలాభ్రకాయం
రాజారి కోదండ రాజ దీక్షాగురుం
రాజీవలోచనం రామచంద్రం
నీలజీమూత సన్నిభశరీరం
ఘనవిశాలవక్షం విమల జలజనాభం
తాలాహినగహరం ధర్మసంస్థాపనం
భూలలనాధిపం భోగిశయనం
పంకజాసనవినుత పరమనారాయణం
శంకరార్జిత జనక చాపదళనం
లంకా విశోషణం లాలితవిభీషణం
వెంకటేశం సాధు విబుధ వినుతం
Sri Tallapaka Annamacharya Sankeerthana
Ganam: K.Thilakavathi, G.Sri Sai Sindhu, K.M.Samhitha,
V.Pallavi
Violin: K.Subrahmanya Raju
Mridangam: K.Karthikeya Adi Narayana Sharma
Bhavam: Sri Amaravadi Subrahmanya Deekshitulu garu.
(శ్రీ అమరవాది సుబ్రహ్మణ్య దీక్షితులు గారు )
Courtesy : DD Sapthagiri
----------------------------------------------------------
భావామృతం :
దేవదేవుడైన ఓ శ్రీరామచంద్రా! దివ్యమైన ప్రభావము కల వాడివి.
రఘుపుంగవుడివి. (రఘువంశమున జన్మించిన శ్రేష్టుడవు). రావణాసుర వైరివి.
(రావణునికి శత్రువుడవు). అట్టి నిన్ను భజించెదను.
తండ్రీ! నీవు రాజవరశేఖరుడవు (శ్రేష్టమైన రాజుల కెల్ల ఉన్నతుడవు).
రఘువంశమునకు సుధాకరుడవు (చందమామవు). ఆజానుబాహుడవు (మోకాళ్లను తాకు చేతులు కలవాడవు). నీలాబ్జ కాయుడవు (నల్లని తామర పూవు వర్ణమున్న శరీరం కలవాడవు). దుష్టశిక్షణ అనే రాజదీక్షతో (విశిష్టమైన దీక్షతో) ఎప్పుడూ కోదండమనే వింటిని ధరించియున్న గురుడవు (రక్షకుడవు). రాజీవలోచనుడవు (పద్మనేత్రుడవు). అట్టి శ్రీరామచంద్రా! నీకు నమస్కరించెదను.
శ్రీరామా! నీవు నీలజీమాత సన్నిభ (నల్లని మేఘము వలె మెరియు) శరీరం
కలవాడవు. ఘనమైన విశాల వక్ష స్థలము కలవాడవు . పద్మనాభుడైన శ్రీహరివి.
“తాలాహి నగహరుడవు” (ఇక్కడ “నగ తాల కు అన్వయించుకొని 'తాలనగము'అంటే “తాటిచెట్టు అని 'అహి” అంటే “సర్పము” కాబట్టి 'తాలాహి నగహరుడు” అంటే తాటి చెట్టు రూపంతో వున్న అసురుని సర్పము రూపంలో వున్న అసురుని హరించినచో బలరాముడ్దై ధర్మ సంస్థాపనకు అవతరించినవాడవు. భూకాంతాకాంతుడవు. (చక్రవర్తివి అని కూడా చెప్పవచ్చును). భోగిశయనం (నాగేంద్రుడైన ఆదిశేషునిపై పవ్వళించియుండే ఆదిమూర్తివి).
ప్రభూ! నీవు పంకజాసన వినుత పరమ నారాయణుడవు (బ్రహ్మచే క్రీర్తింపబడు
శ్రీమన్నారాయణుడవు). శంకరార్చిత, జనక చాపదళనం (అని విడతీసి అర్ధం
చెప్పుకోవాలి. ) శంకరునిచే అర్చించబడువాడవు, జనకుని వద్దనున్న శివధనస్సును భేదించినవాడవు. లంకను దహించినవాడవు. లాలితవిభీషణం (విభీషణుని బుజ్జగించిన వాడవు). సాధువిబుధ వినుతుడవు (సాథువులైన బుద్ధిమంతులచే కీర్తింప బడువాడవు). శ్రీవేంకటేశ్వరుడవు నీవే. ఓ మవానుభావా! నీకు నమస్మరించెదను.
----------------------------------------------------------
#దేవ_దేవం_భజే #devotional #telugusongs #BhaktiSongs #SriRamaNavami_2024 #శ్రీరామ_నవమి_2024
#Deva_devam_bhaje #dd_songs #Tallapaka #Annamacharya
#జై_శ్రీరామ్ #ஜெய்_ஸ்ரீராம் #Jai_ShriRam #जय_श्री_राम
No comments:
Post a Comment