కొమ్మలో కొమ్మనై.. నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా.. హా.. ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఆకులో ఆకునై.. పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై.. నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా.. హా.. ఎటులైనా ఇచటనే ఆగిపోనా
చరణం 1:
గలగలని వీచు చిరుగాలిలో కెరటమై
గలగలని వీచు చిరుగాలిలో కెరటమై
జలజలని పారు సెల పాటలో తేటినై
పగడాల చిగురాకు తెరచాటు చేటినై
పరువంపు విడిచేడే చిన్నారి సిగ్గునై
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా
చరణం 2:
తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
తరులెక్కి ఎలనీలి గిరినెక్కి మెలమెల్ల
చదలెక్కి జలదంపు నీలంపు నిగ్గునై
ఆకలా.. దాహమా.. చింతలా.. వంతలా
ఈ కరణి వెర్రినై ఏకతమా తిరుగాడా
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా..
ఈ అడవి దాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా..
ఆకులో ఆకునై.. పూవులో పూవునై
కొమ్మలో కొమ్మనై.. నును లేతరెమ్మనై
ఈ అడవి దాగిపోనా.. హా.. ఎటులైనా ఇచటనే ఆగిపోనా...
ఎటులైనా ఇచటనే ఆగిపోనా
No comments:
Post a Comment