Thursday, 14 December 2023

కరుణా సాగర ప్రేమ స్వరూప రాక్షకుడా

కరుణా సాగర ప్రేమ స్వరూప రాక్షకుడా

మా బాధలు మాప ఏతెంచావ సాధకుడా

నీ బోధలు మాకు వెలుగుదివ్వెలు పావనుడా(2)

1.చూపులేని గాయాన్ని చీకటి కాయాన్ని

దేవస్తుత నీ స్పర్శ పావనం చేసింది

నా మోము దీపాలు నీ మహిమచే వెలిగే

వెలిగిన నేత్రాలు వేల్పుడా నిను గాంచే

పరవశ మొందాయి ఓ ప్రభువా

జన్మం తరియించే నా పశుడా

ప్రార్ధన చేకొనుమా పరిశుద్ధ తేజుడా(కరుణా)

2.నేరమే లేకున్నా ఊరు తరిమేసింది

రూపమే శాపమై దోషిగా నిలిపింది

మా దీన గతిని చూసి దేవలోకం నుండి ఏతెంచినావయ్యావెలుచుక్కోలే నీవు

రోగ పీడనచేత వాడిన తనువుల ప్రేమతో నిమిరావు బాధలను మాపావు

విలపించే మా యెడల కురిపించినావు కరుణ(కరుణ)

3.మంచు కురిసి మెరిసే మందార పువ్వువో

చూడ సుందరమైన పరిజాతానివో ఎగిసేటి జలపాత వెన్నెల నవ్వువో

ప్రతినిత్యం వెలిగేటి ప్రభాత భానునివో

నింగిలో నీలాన కెంపువో నేలపై పొంగే జలాధారవో

No comments:

Post a Comment