నిను చూసిందెవరమ్మా
వెళ్లే నీ దారి
అది ఎవరికి తెలుసమ్మా
రూపమే ఉండని
ఊపిరే నువ్వని
ఎన్నడూ ఆగని
పయనమే నీదని
గాలి చిరుగాలి
నిను చూసిందెవరమ్మా
వెళ్లే నీ దారి
అది ఎవరికి తెలుసమ్మా
కనురెప్ప మూసి ఉన్నా
నిదరొప్పుకోను అన్నా
నిను నిలువరించేనా
ఓ స్వప్నమా
అమవాసలెన్నైనా
గ్రహణాలు ఏవైనా
నీ కలను దోచేనా
ఓ చంద్రమా
తన ఒడిలో ఉన్నది
రాయో రత్నమో
పోల్చదు నేలమ్మా
ఉలి గాయం
చెయ్యకపోతే ఈ శిల
శిల్పం కాదమ్మా
మేలుకో మిత్రమా
గుండెలో జ్వాలలే
జ్యోతిగా మారగా
చీకటే దారిగా
వేకువే చేరదా
గాలి చిరుగాలి
నిను చూసిందెవరమ్మా
వెళ్లే నీ దారి
అది ఎవరికి తెలుసమ్మా
చలి కంచె కాపున్నా
పొగమంచు పొమ్మన్నా
నీ రాక ఆపేనా
వాసంతమా
ఏ కొండ రాళ్ళైనా
ఏ కోన ముల్లైనా
బెదిరేన నీ వానా
ఆషాడమా
మొలకెత్తే పచ్చని
ఆశే నీలో
ఉంటె చాలు సుమా
కలకాలం నిన్ను
అనచదు మన్ను
ఎదిగే విత్తనామా
సాగిపో నేస్తమా
నిత్యమూ తోడుగా
నమ్మకం ఉందిగా
ఓరిమే సాక్షిగా
ఓటమే ఓడగా
గాలి చిరుగాలి
నిను చూసిందెవరమ్మా
వెళ్లే నీ దారి
అది ఎవరికి తెలుసమ్మా
రూపమే ఉండని
ఊపిరే నువ్వని
ఎన్నడూ ఆగని
పయనమే నీదని
No comments:
Post a Comment