Sunday, 3 December 2023

శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా..శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా..

శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా..
శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా..

శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకూ.. అలమేలుమంగకు అలుక రానీయకూ
శ్రీదేవి వంకకు చిలిపిగా చూడకూ.. అలమేలుమంగకు అలుక రానీయకూ
ముద్దుసతులీద్దరిని ఇరువైపులాజేర్చి.. ముద్దుసతులీద్దరిని ఇరువైపులాజేర్చి..
మురిపించి లాలించి..మూచ్చటల తేల్చి.. శేషశైలావాస శ్రీవెంకటేశా..

పట్టు పానుపుపైన పవళించర స్వామి..
పట్టు పానుపుపైన పవళించర స్వామి.. భక్తులందరు నిన్ను ప్రస్తుతించి పాడ.. 
చిరునగవులొలుకుచూ.. నిదురించు నీ మోము..
చిరునగవులొలుకుచూ.. నిదురించు నీ మోము.. కరువుదీర కాంచి తరియించుమూ మేము.

శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా..
శేషశైలావాస శ్రీవెంకటేశా.. శయనించు మా అయ్య శ్రీచిద్విలాసా..

ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతిఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి

ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి

పతిదేవుని మురిపించే వలపుల వీణ
జీవితమే పండించే నవ్వుల వాన
కష్టసుఖాలలో తోడూ నీడగా
తల్లిని మరిపించే యిల్లాలి ఆదరణ
కష్టసుఖాలలో తోడూ నీడగా
తల్లిని మరిపించే యిల్లాలి ఆదరణ
మగువేగా మగవానికి మధుర భావనా

ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి

సేవలతో అత్తమామ సంతసించగా
పదిమందిని ఆదరించు కల్పవల్లిగా
సేవలతో అత్తమామ సంతసించగా
పదిమందిని ఆదరించు కల్పవల్లిగా
తనయుని వీరునిగా పెంచే తల్లిగా
సతియే గృహసీమను గాచె దేవతగా
తనయుని వీరునిగా పెంచే తల్లిగా
సతియే గృహసీమను గాచె దేవతగా
సృష్టించెను దేవుడు తనకుమాళిగ

ఆలయాన వెలిసిన ఆ దేవుని రీతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి
ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి

అదిగో .... నవలోకంవెలసే ....మనకోసంఅహహహ ఆహహ

ఆ ఆ ఆ ఆ ....ఆ ఆ ఆ ఆ .... ఆ ఆ ఆ ఆ
అదిగో .... నవలోకం
వెలసే ....మనకోసం
అహహహ ఆహహ

ఒహోహోహో ఒహోహో
ఊహూహూహూ ఊహూహూ
అదిగో .. నవలోకం... వెలసే ... మనకోసం
అదిగో .. నవలోకం... వెలసే ... మనకోసం

నీలి ..నీలి ..మేఘాల లీనమై
ప్రియా .. నీవు నేను తొలి ప్రేమకు ప్రాణమై
నీలి ..నీలి ..మేఘాల లీనమై
ప్రియా .. నీవు నేను తొలి ప్రేమకు ప్రాణమై
దూర ..దూర .. తీరాలకు సాగుదాం..
సాగి దోర వలపు సీ .మలో.. ఆగుదాం
దూర ..దూర .. తీరాలకు సాగుదాం..
సాగి దోర వలపు సీ .మలో.. ఆగుదాం
ఎచట సుఖముందో..
ఎచట సుధ గలదో

అచట మనముందామా ..ఆ ..ఆ..
అదిగో .. నవలోకం... వెలసే ... మనకోసం

పారిజాత సుమదళాల పానుపూ
మనకు పరచినాడు చెరకు వింటి వేలుపూ
పారిజాత సుమదళాల పానుపూ
మనకు పరచినాడు చెరకు వింటి వేలుపూ
ఫలించే కోటి మురిపాలు ముద్దులూ
మన ప్రణయానికి లేవు సుమా హద్దులూ
ఫలించే కోటి మురిపాలు ముద్దులూ
మన ప్రణయానికి లేవు సుమా హద్దులూ
ఎచట హృదయాలు

ఎపుడూ విడిపోవో
అచట మనముందామా ..ఆ..ఆ..ఆ.ఆ.
అదిగో .. నవలోకం... వెలసే ... మనకోసం
అదిగో .. నవలోకం... వెలసే ... మనకోసం

నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము

వాగర్ధా వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే

జగత: పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ

పార్వతీప రమేశ్వరౌ


నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము

అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము

భావములో ఆ భంగిమలో ఆ గానములో ఆ గమకములో ఆ

భావములో భంగిమలో గానములో గమకములో

ఆంగీకమౌ తపమీ గతి సేయగ నాద వినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము

అభినయవేదము సభకనువాదము సలుపు పరమ పదము ఆ ఆ ఆ

నీనిమదనీని మదనిసనీ రిసనిదనీ మగమదాద గమామ రిగస


కైలాసాన కార్తీకాన శివరూపం

ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం

కైలాసాన కార్తీకాన శివరూపం

ప్రమిదే లేని ప్రమధాలోక హిమదీపం

నవరస నటనం

దని సరి సనిస

జతియుత గమనం

దని సరి సనిస

నవరస నటనం జతియుత గమనం 

సుతగిరి చరణం సురనుతి పయనం

భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం

భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం

తపనుని కిరణం తామస హరణం

తపనుని కిరణం తామస హరణం

శివుని నయన త్రయలాస్యం

ధిరన ధిరన నన తకిట తకిట ధిమి ధిరన ధిరన నన నాట్యం

ధిరన ధిరన నన తకిట తకిట ధిమి ధిరన ధిరన నన లాస్యం

నమక చమక సహజం జం

నటప్రకృతీ పాదజం జం

నర్తనమే శివకవచం చం

నటరాజ పాద సుమరజం జం

ధిర నన ధిర నన

ధిర నన

ధిర నన ధిర ధిర ధిర ధిర ధిర ధిర ధిర ధిర


నాదవినోదము నాట్యవిలాసము పరమ సుఖము పరము

అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము

గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన గోధూళి ఎర్రన ఎందువలన ......

గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన 
గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన 
గోధూళి ఎర్రన ఎందువలన ......

తెల్లావు కడుపుల్లో కర్రావులుండవా..ఎందుకుండవ్ 
కర్రావు కడుపున ఎర్రావు పుట్టదా.. ఏమో 
 తెల్లావు కడుపుల్లో కర్రావులుండవాకర్రావు కడుపున ఎర్రావు పుట్టదా
గోపయ్య ఆడున్నా గోపెమ్మ ఈడున్నా గోధూళి కుంకుమై గోపెమ్మకంటదా 
ఆ పొద్దు పొడిచేనా.. ఈ పొద్దు గడిచేనా.. 
ఎందువలనా అంటే అందువలన ఎందువలనా అంటే దైవఘటన 
గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన 
గోధూళి ఎర్రన ఎందువలన

పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలు.. పాపం 
అల్లన మోవికి తాకితే గేయాలు.. హా హా హ 
పిల్లనగ్రోవికి నిలువెల్ల గాయాలుఅల్లన మోవికి తాకితే గేయాలు
ఆ మురళి మూగైనా ఆ పెదవి మోడైనా ఆ గుండెగొంతులో ఈ పాట నిండదా 
ఈ కడిమి పూసేనా.. ఆ కలిమి చూసేనా.. 
ఎందువలనా అంటే అందువలన ఎందువలనా అంటే దైవఘటన 
గోవుల్లు తెల్లన గోపయ్య నల్లన గోధూళి ఎర్రన ఎందువలన
గోధూళి ఎర్రన ఎందువలన 

అయ్యా నేను చదివి బాగు పడతాఓరయ్య నేను చదివి బాగు పడతా పుస్తకాలు చదివి నేను మన బతుకులు మారుస్త అయ్యా నేను చదివి బాగు పడతాఓరయ్య నేను చదివి బాగు పడతా

అయ్యా నేను చదివి బాగు పడతా
ఓరయ్య నేను చదివి బాగు పడతా 
పుస్తకాలు చదివి నేను మన బతుకులు మారుస్త అయ్యా నేను చదివి బాగు పడతా
ఓరయ్య నేను చదివి బాగు పడతా

అమ్మమ్మ నీయమ్మ కొంప నాది తీస్తవెంది, 
చదువు బూతం పడితే నువ్వు సంక నాకి పోతావు
బి ఏ , ఎం ఏ , చదివినోల్లె బికర్లయ్యి తిరుగుతుండ్రు చదువు గోల నీకొద్దురో , 
కొడుకా చావు బతుకు మనకోద్దురా ,
ఒరేయ్ ఒరేయ్ చదువు గోల నీకొద్దురో , 
కొడుకా చావు బతుకు మనకోద్దురా

ఆ డాకటేరు కొడుకులాగా డాబు దూబు ఉంటాను,
ప్లీడరు గారి కొడుకు లాగ నెక్కు టై కడతాను , 
ఎస్ ఐ గారి కొడుకు లాగ సైక్లెక్కి బడికేలత , అయ్యా నేను చదివి బాగు పడతా
ఓరయ్య నేను చదివి బాగు పడతా

మతి బోయిన్దేటి నీకు మారాజుల బిడ్డలు వాళ్ళు ,
వాళ్ళతోటి పోలికేటి అడుక్కునే నా కొడకా,
పని పాట లేనోల్లకి చదువే ఓ పెద్ద పని ,
చదువు గిదువు అన్నావంటే సెంప పగలగొడతాను ,
చదువు గోల మనకొద్దురో , 
కొడుకా చావు బతుకు మనకోద్దురా ,

దండించకు ఓరయ్య దండం బెదతా నీకు,
వీదుల్లో బడులున్నాయి, ఇస్కూలు బడులున్నాయి ,
పంతుల్ల కాళ్ళు మొక్కి చదువు బిక్ష పెట్టమంట ,
అయ్యా నేను చదివి బాగు పడతా
ఓరయ్య నేను చదివి బాగు పడతా ,
ఈదుల్లో బడుల్లోన పందులు తొంగుటున్నాయి, అందుల్లో పంతుళ్ళు తేక తురారాలాడి,
ప్రివేటులు చదివితేనే పాసు చేత్తమంతండ్రు, చదువుకునే రోజులేల్లి, చదువులు కొనే రోజులోచ్చే, చదువు గోల మనకొద్దురో , 
కొడుకా చావు బతుకు మనకోద్దురా ,

డబ్బు గోల నీకెందుకు , ఆ బాదలు నేబడత, గవర్నమెంట్ చదువంట గరిబొల్ల చదువంట,అనాదొడి బిడ్డనని ,
హాటల్లో జేరత ,పుస్థలు బట్టలు ఉత్తినే ఇత్తరంట ,
అయ్యా నేను చదివి బాగు పడతా
ఓరయ్య నేను చదివి బాగు పడతా ,

నమ్మకురా ఆ మాట నంజ కొడకా చేదిబోతావు, అనాదోల్ల పుత్తకాలు అస్సలు లేదంటారు ,
షాపు లోన పుత్తకాలు చాటు మాటు గమ్ముతుండ్రు , 
పసి పిల్లల కంచం లో పాసి కూడు పెడుతుండ్రు , కొటాల నాయకులు వాటాలు పన్చుకునీ...
హాట్టళ్ళ సొమ్ము నంత ఓటర్లకు పంపుతుండ్రు, చదువు గోల మనకొద్దురో , 
కొడుకా చావు బతుకు మనకోద్దురా ,

కట్టమైన నట్టమైన కాన్వెంటుకు పంపించు , ఇంగిలీషు చదివి నేను ఇంజినీరునై వత్త,
ఈ రిచ్చ బతుకు నీకెందుకు , కారు నీకు కొని దెత్త ,
అయ్యా నేను చదివి బాగు పడతా
ఓరయ్య నేను చదివి బాగు పడతా ,

నీ కాన్వెంటు చదువుకి కరుతాయి నా కండలు,
ఇంజినీరు చదువుకి ఇంకుతాది నా నెత్తురు ,
నువ్వు కారు గొనేలోపు నేను కాటి కెళ్ళి బోతాను,
చదువు గోల మనకొద్దురో , 
కొడుకా చావు బతుకు మనకోద్దురా ,

ఫై చదువులు చాదుకొని పట్టాని పట్టుకొని , మధ్యవర్తి మంతిరికి లంచాలు కట్టుకొని,
ఆదోరకని పనులకు ఆపీసులు తిరిగి తిరిగి విసిగిపోయి చివరకి ఈ కప్పులు కడిగే కంటే,
ముందు గానే ఈ పనులు ముచ్చటగా చేసుకోర,
చదువు గోల మనకొద్దురో , 
కొడుకా చావు బతుకు మనకోద్దురా ,
చదువు గోల మనకొద్దురో , 
కొడుకా చావు బతుకు మనకోద్దురా

గోపాలా.. ఆ.. నందగోపాలా.. ఆ.. ఆ..

గోపాలా.. ఆ.. నందగోపాలా.. ఆ.. ఆ..

ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ
యెదురు చూతురా గోపాలా
ఎంత పిలచినా... ఎంత వేడినా..యీ నాటికి దయరాదేల
ఎంత పిలచినా... ఎంత వేడినా..యీ నాటికి దయరాదేల
గోపాలా.. నంద గోపాలా..
గోపాలా.. నంద గోపాలా.. 

చరణం 1 :

వీనుల విందుగ వేణుగానము.. విని తరింపగా వేచితిరా
ఆ.. ఆ.. ఆ.. ఆ..
వీనుల విందుగ వేణుగానము.. విని తరింపగా వేచితిరా
వేచి వేచి యీ వెన్నముద్దవలె కరగిపోయెరా.. నా బ్రతుకు
కరగిపోయెరా.. నా బ్రతుకు

ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ.. యెదురు చూతురా గోపాలా
ఎంత పిలచినా... ఎంత వేడినా.. యీ నాటికి దయరాదేల
గోపాలా.. నంద గోపాలా..
గోపాలా.. నంద గోపాలా.. 

చరణం 2 :

వెన్న మీగడలు జున్ను పాలకు.. యేమి కొరతరా.. మన యింట..
ఆ.. ఆ.. ఆ.. ఆ...
వెన్న మీగడలు జున్ను పాలకు.. యేమి కొరతరా.. మన యింట

పాలను ముచ్చలి పరుల చేతిలో.. దెబ్బలు తినకురా.. కన్నయ్యా
పాలను ముచ్చలి పరుల చేతిలో.. దెబ్బలు తినకురా.. కన్నయ్యా
యీ తల్లి హృదయము ఓర్వలేదయా..


ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ.. యెదురు చూతురా గోపాలా
ఎంత పిలచినా... ఎంత వేడినా.. యీ నాటికి దయరాదేల
గోపాలా.. నంద గోపాలా..
గోపాలా.. నంద గోపాలా..
గోపాలా.. నంద గోపాలా..
గోపాలా.. నంద గోపాలా..