Wednesday, 10 December 2025

శ్రీ విశ్వరూపాయ నమశ్శివాయ. లక్ష్మీదేవి కటాక్షం అతి తేలిగ్గా లభించాలి అంటే శ్రీనివాస విద్య అని ఒక ప్రయోగం ఉంది భీ. నేను ఎప్పుడో ఒక ఉపన్యాసంలో చెప్పా. అప్పటి నుంచి కొన్ని వందల మంది నన్ను అడిగారు ఆ ప్రయోగం ఎలా చేయాలి చెప్పండి అని. ఒక పూజారి ఒకాయన అండి చాలా

శ్రీ విశ్వరూపాయ నమశ్శివాయ. లక్ష్మీదేవి కటాక్షం అతి తేలిగ్గా లభించాలి అంటే శ్రీనివాస విద్య అని ఒక ప్రయోగం ఉంది భీ. నేను ఎప్పుడో ఒక ఉపన్యాసంలో చెప్పా. అప్పటి నుంచి కొన్ని వందల మంది నన్ను అడిగారు ఆ ప్రయోగం ఎలా చేయాలి చెప్పండి అని. ఒక పూజారి ఒకాయన అండి చాలా ఘోరంగా ఉంది పరిస్థితి ఏదైనా మంత్రం చెప్పండి అమ్మవారి కటాక్షం కలగడానికి అన్నారు. అనేసరికి నాకు వెంటనే ఆలోచన వచ్చి శ్రీనివాస విద్య ఆయనకు చెప్పా. చెప్పేసరికి ఆయన ఆ ప్రయోగం చేస్తే అద్భుతమైన ఫలితం దొరికింది. అది ఏమిటి అనేది నేను వివరాలు గోప్యత కోసం ఇక్కడ చెప్పను గానీ చాలా అద్భుతంగా చాలా విచిత్రంగా ఆయనకు లక్ష్మీ కటాక్షం లభించింది. అందుకని ఈ విద్య అందరికీ నేర్పిస్తే ఉపయోగపడుతుంది కదా ఇలాంటి కష్ట సమయాల్లోనూ అనిపించింది అన్నమాట. దాని కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇంతకీ ఈ వీడియోలో మీకు మూడు విషయాలు చెప్తా. మొట్టమొదటిది అసలు ఈ శ్రీనివాస విద్య వెనకాల కథ ఏమిటి ఎవరైనా ప్రయోగించారా ఎలా పనిచేసింది? రెండోది దాని తాలూకు మంత్రాలు ఏమిటి? మూడోది అసలు ఆ ప్రయోగం ఎలా చేయాలి? శ్రావణమాసం వస్తుంది కదా మీరు అప్పుడు గాని చేయగలిగితే అమోఘమైన ఫలితం వస్తుంది మీకు. అందుకే ఇప్పుడు చెప్పడం అన్నమాట. ఇంతకీ ఈ విద్యని గతంలో ఎవరైనా ప్రయోగించారా అంటే దీనికి సంబంధించి మన చరిత్రలో 1368 లో ఢిల్లీ సుల్తానులు వచ్చి దక్షిణ భారతదేశాన్ని దాదాపుగా జయించేసారు. అప్పుడు హోయసల సామ్రాజ్యం చాలా అద్భుతంగా ఉండేది పాపం వాళ్ళను కూడా జయించి అక్కడ అందరినీ చంపిసి మారణకాండ సాగించి చివరికి అక్కడ సైన్యాధిపతులు మహా పరాక్రమవంతులైన అన్నదమ్ములు ఇద్దరు ఉండేవారు మనకు చరిత్రలో తెలుసు కదా. వాళ్ళిద్దరిని బంధించి తీసుకుపోయి వాళ్లకి ఒక షరతు పెట్టారు మీరు మహమ్మదీయ మతంలోకి మారిపోతారా లేకపోతే మిమ్మల్ని చంపేయమంటారా? అంటే వాళ్లలో అన్నయ్య అన్నారు నేను చనిపోయినా పర్వాలేదు నేను మా మతం మాత్రం మారను అని. అంటే అప్పుడు తమ్ముడు చెప్పారు అన్నయ్య మనకి విలువైన ప్రాణం ఎందుకు పోగొట్టుకోవడం మనం ఈనాడు అలా మతంలోకి మారిపోయినా సరే మన హృదయంలో మన సనాతన ధర్మము మన వైభవం ఉన్నాయి కదా. అందుకని అది అలాగే ఉంచుకో ఊరికే ప్రాణం ఎందుకు వదిలేయడం ఈ ప్రాణాన్ని దేశానికి ఉపయోగించొచ్చు కదా అని చెప్తే సరే అయితేను అని చెప్పి అటు ఢిల్లీ సుల్తాన్ తో చెప్పి వాళ్ళిద్దరు మతం మారిపోయారు. మారిపోయాక సుల్తాన్ ఏం చేస్తాడు వాళ్ళని తీసుకొచ్చి హోయసల సామ్రాజ్యానికి అధిపతుల కింద చేసేసి ఇక్కడ ఉంచుతారు కర్ణాటకలో. ఉంచితే వాళ్ళిద్దరు రాజ్యాన్ని పాలిస్తూ ఉంటారు కానీ లోపల ఆ బాధ ఉంటుంది అయ్యో సనాతన ధర్మంలో పుట్టిన వాళ్ళం ఎంత గొప్ప ధర్మం ఒక మ్లేచ్చుడికి భయపడి మతం మారిపోవాల్సి వచ్చిందని చాలా బాధపడి రోజు ఏడుస్తూ అమ్మవారిని ప్రార్థిస్తూ ఉంటారు రహస్యంగా. అప్పుడు వాళ్ళ దగ్గరికి విద్యారణ్య స్వామి వచ్చారు ఆయన శృంగేరి 12వ పీఠాధిపతి మనందరికీ తెలుసు కదా. వచ్చి మీరిద్దరూ బాధపడకండి మీ ఆవేదన చూసి భువనేశ్వరీ దేవి నన్ను మీ దగ్గరికి పంపించింది నన్ను. మీ ఆవేదన నేను తీరుస్తాను ఉండండి అని చెప్పి అప్పుడు వాళ్ళిద్దరిని మళ్ళీ సనాతన ధర్మంలోకి మార్పించారు మతాన్ని. నా యోగ శక్తితో మీ చేత ఒక గొప్ప సామ్రాజ్యాన్ని స్థాపింపజేస్తాను చెప్తే సామ్రాజ్యాన్ని స్థాపించటం అంటే మాటలా స్వామి. ఎంత ధనం కావాలి ఎంత సంపద కావాలి అంటే ఆయన ఏమి పర్వాలేదు ధర్మ కార్యం కోసం కోరుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహించి తీరుతుంది. మనం ముగ్గురం కలిసి ఒక ప్రయోగం చేద్దాం. అది మంత్ర శాస్త్రంలో ఉంది. ఆ ప్రయోగం గాని శ్రద్ధతో చేయగలిగితే కనకవర్షం కురిపిస్తుంది అమ్మవారు అనుమానం లేదు 30 రోజుల పాటు చేయాలి చేద్దాం పదండి అన్నారు. అని చెప్పి అప్పుడు విద్యారణ్య స్వామి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి ఈ ప్రయోగం చేశారు కనకవర్షం కురిసింది అక్కడ. హరిహరరాయలు బుక్కరాయలు ఆశ్చర్యపోయారు అయ్యబాబోయ్ మంత్రానికి ఇంత శక్తి ఉందా అని. ఈ విద్యను గాని సరిగ్గా ప్రయోగించగలిగితే శ్రద్ధగా చేయగలిగితే మూడు తరాల పాటు ధనధాన్య సమృద్ధి కలుగుతుంది అని మంత్ర శాస్త్రంలో చెప్పారు. ఇంతకీ ఏమిటండీ ఈ విద్య? ఎవరైనా వేదం నేర్చుకోవడం మొదలు పెట్టగానే మొట్టమొదటి నేర్చుకునే రెండు సూక్తాలు ఏమిటి చెప్పండి? పురుష సూక్తం శ్రీ సూక్తం అంతే కదా. ఆ రెండిటికీ ఒక సంబంధం ఉంది. పురుష సూక్తం విష్ణుమూర్తికి సంబంధించింది. శ్రీ సూక్తం లక్ష్మీదేవికి సంబంధించింది అంతే కదా. ఆ రెండిటినీ కలిపి అనుసంధానం చేయగలిగితే దాన్ని శ్రీనివాస విద్య అంటారు అన్నమాట. అది కూడా ఆ రెండిటికీ ఎంత సంబంధం అంటే మీరు చూడండి పురుష సూక్తంలో మొట్టమొదటి అక్షరం ఏమిటి? స. శ్రీ సూక్తంలో హ. హ గుణించంలోనే ఉంటుంది కదా. ఇప్పుడు చూడండి మనం ఊపిరి తీసుకుంటున్నా సరే స హ అదే కదా మన ఊపిరిలో రెండు కలిపి నాదం ఇస్తే ఏమవుతుంది సోహం అవుతుంది అంతే కదా. పురుష సూక్తం శ్రీ సూక్తం వీడతీయలేనంత అవినాభావ సంబంధం అన్నమాట. ఆ రెండు కలిపి ప్రయోగిస్తే అఖండమైన ఐశ్వర్యము అలాగే ఆకర్షణ వస్తుంది అని మంత్ర శాస్త్రంలో చెప్పారు. ఇప్పుడు ఈ ప్రయోగంలో మంత్రాలు ఏమిటి అనేది చూద్దాం. శ్రీనివాస విద్యలో రెండు భాగాలు ఉన్నాయి. మొట్టమొదటి భాగం పాడ్యమి రోజు మొదలుపెట్టి అంటే ఏదైనా ఒక నెలలో మొట్టమొదటి రోజు ఈ విద్య మొదలుపెట్టాలి అన్నమాట. ఏ నెలైనా పర్వాలేదు శ్రావణ మాసం అయితే మహోత్కృష్టమైనది. మొదలుపెట్టి మొట్టమొదటి రోజు ఏమి చేయాలంటే శుక్ల పక్షంలో చేయాల్సిన ప్రొసీజర్ ఏమిటి అనేది చెప్తా. ప్రతిరోజు శ్రీ సూక్తంలో మొట్టమొదటి మంత్రం అంటే హిరణ్యవర్ణామ్ హరిణీం సువర్ణరజతస్రజామ్ చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోహ అని ఉంది కదా. ఆ మొట్టమొదటి మంత్రాన్ని వెంటనే పురుష సూక్తంలో మొట్టమొదటి మంత్రం. సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్ సభూమిమ్ విశ్వతో వృత్వా అత్యతిష్ఠద్దశాన్గుళమ్ అని మొట్టమొదటి మంత్రం ఉంది కదా ఆ రెండు. తర్వాత శ్రీ సూక్తంలో రెండో మంత్రం పురుష సూక్తంలో రెండోది శ్రీ సూక్తం మూడు పురుష సూక్తం మూడు. అలాగా 15 మంత్రాల పాటు చదవాలి అన్నమాట. అంటే శ్రీ సూక్తంలో ఆఖరి మంత్రం ఏంటి? తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీం మనపగామినీం అని ఉంటుంది కదా 15వ మంత్రం. అది చదివి పురుష సూక్తంలో 15వ మంత్రం ఏమిటి అంటే నాభ్యా ఆసీదంతరిక్షం అని ఉన్నాయి కదా. అలాగా మొట్టమొదట శ్రీ సూక్త మంత్రం తర్వాత పురుష సూక్త మంత్రం అలా 15 మంత్రాలు ఒక రోజు చదవాలి. చదివి ఇదంతా అయిపోయిన తర్వాత నారాయణ కవచం చదవాలి. ఇది 15 రోజుల పాటు చేయాలి ఈ ప్రక్రియ. మీకు తెలుసు కదా శ్రీ సూక్తం చదవడానికి 15 మంత్రాలు ఒక నాలుగు నిమిషాలు పురుష సూక్తం చదవడానికి ఒక ఐదారు నిమిషాలు పడుతుంది. అంటే మొత్తం ప్రక్రియ చేయడానికి నారాయణ కవచంతో కలిపి ఒక 20 నిమిషాలు పడుతుంది. తర్వాత కృష్ణ పక్షంలో ఏం చేయాలంటే సరిగ్గా దీనికి ఆపోజిట్ అన్నమాట. అంటే మొట్టమొదట పురుష సూక్తం మంత్రం తర్వాత శ్రీ సూక్తం మంత్రం. పురుష సూక్తం రెండో మంత్రం శ్రీ సూక్తం రెండో మంత్రం అలాగా పురుష సూక్తంలో నాభ్యాసిదంతరిక్షం వరకు శ్రీ సూక్తంలో 15వ మంత్రం. అలా అనుసంధానం చేసి అది ఇంకొక 15 రోజులు చదవాలి. ఇదిగో ఇక్కడ చూపిస్తున్నాను కదా మీకు ఇది చూశారంటే మీకు తేలిగ్గా అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ మంత్రం ఎలా ప్రయోగం చేయాలో చెప్తాను. ప్రతిరోజు ఉదయం స్నానం చేసేటప్పుడు బిల్వదళాలు వేసి కాచిన నీటితో స్నానం చేసి లేకపోతే చన్నీళ్ళైనా అందులో బిల్వదళాలు వేసుకుని స్నానం చేసి తర్వాత ఈ ప్రయోగాన్ని హోమంతో కలిపి చేసి ఆ హోమంలో మారేడు చెట్టు పుల్లలు ఉంటాయి కదా అవి తీసుకొచ్చి హోమంలో వేసి ఒక్కొక్క మంత్రం చదవాలి అంటే ప్రతిరోజు 30 పుల్లలు అవసరం అవుతాయి అన్నమాట. అలా హోమం చేస్తూ చదివి తర్వాత బిల్వదళాలతో శ్రీ చక్రానికి అర్చన చేసి అలాగనే పాయసం వండి లక్ష్మీదేవికి నివేదన చేయాలి. ఇదంతా మనం చేయలేము అనుకోండి మధ్యమమైన ప్రక్రియ ఉంది ఇంకొకటి. అదేమిటి అంటే మీకు పురుష సూక్తం శ్రీ సూక్తం వస్తే గనుక చక్కగా అమ్మవారి ముందు కూర్చుని అంటే లక్ష్మీనారాయణుల ఫోటో పెట్టుకుని కూర్చుని ఇద్దరిని కలిపే అనుసంధానం చేయాలి. కూర్చుని అప్పుడు ఆ రెండు సూక్తాలు కలిపి చదవండి ఇందాక నేను చెప్పినట్టే మామూలుగా చదివినా హోమం చేయకపోయినా కూడా పనిచేస్తుంది ఈ ప్రయోగం. అంటే ఏవండీ మాకు అవన్నీ కుదరవండి ఇప్పుడేమి చేయాలండి అంటే సరే అయితే ఒక పని చేయి అమ్మవారికి ధనం పెట్టి శ్రావణ మాసంలో ఇలా పాడ్యమి నుంచి మొదలుపెట్టి 30 రోజులు మిగతా నియమాలన్నీ అంటే ఆహారంలో తామసికమైన ఆహారం తీసుకోకుండా ఉండటం అలాంటివన్నీ చేస్తూ ప్రతిరోజు ఉదయం ఆరింటికి సాయంత్రం ఆరింటికి కనకధారా స్తోత్రం చదువు. శంకరాచార్యుల వారి అమోఘమైన మేధస్సు ఏమిటి అంటే కనకధారా స్తోత్రంలోనే ఈ శ్రీనివాస విద్య తీసుకొచ్చి పెట్టారు. చూడండి అందులో మీరు ఏ శ్లోకం తీసుకున్నా విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిపే ఉంటారు ప్రతి శ్లోకంలోనూ. అందుకే శంకరాచార్యుల వారు చదివితే కనకధారా కోస్తం. శ్రీనివాస విద్య అంటే మాత్రం ఇప్పటిదాకా మనం నేర్చుకున్న స్తోత్రాలు లాంటిదో లేకపోతే మనం చేసే పూజలు లాంటిదో కాదు. మనం చేసే పూజలు స్తోత్రాలు ఇవన్నీ కూడా పౌరాణికమైనవి అవి ఎలాగైనా ఎవరైనా చేసుకోవచ్చు. కానీ శ్రీనివాస విద్య వేద పాఠం అది. పురుష సూక్తం శ్రీ సూక్తం కలిపి ఉన్నాయి కదా. అందువల్ల వేదం కాబట్టి దానికి కొన్ని నియమాలు ఉంటాయి. మీకు వేదం, అగ్నిహోత్రం, వైదిక సంప్రదాయం ఇలాంటివి అలవాటు ఉండి మీకు చేయడం బాగా వస్తే కనుక చెప్పాను కదా ఆ పద్ధతిలో చేయండి అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది. నాకు వేదం స్వరంతో చక్కగా చదవడం వచ్చు నేను గురువుగారి దగ్గర నేర్చుకున్నా కానీ నాకు హోమాలు అలాంటివి చేయడం రాదు అప్పుడేం చేయాలి? చక్కగా శ్రీనివాస విద్య చదువుకోండి. ఎలా చదవాలి అనే ఆడియో మా అడ్మిన్ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాడు. అది పెట్టుకుని చక్కగా చదువుకోండి మీకు వేదం వచ్చు కాబట్టి తేలిగ్గా చదివేచ్చు. నాకు వేదాం ఇవి ఏవి రావండి కానీ నేను చాలా సాత్వికమైన వైదికమైన మార్గాన్ని అవలంబిస్తూ ఉంటాం. శుద్ధ సాత్విక ఆహారం తింటాం మా ఇంట్లో పూజ అవన్నీ ఉన్నాయి కానీ నాకు వేదం చదవడం రాదు అప్పుడు ఏం చేయాలి అంటే ప్రతిరోజు పొద్దున్నే స్నానం చేసి వచ్చి జస్ట్ ఆడియోలు పెట్టుకుని వినండి చాలు. విన్నా సరే ఆ కాంబినేషన్ పురుష సూక్తం శ్రీ సూక్తం కాంబినేషన్ చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఈ వీడియో కింద దాని లింకులు అవన్నీ ఉన్నాయి చూసుకోండి. కానీ గుర్తుపెట్టుకోండి ఇది వేద పాఠం కాబట్టి ఎవరు చేయాలన్నా నియమాలు పాటించాలి సాత్విక ఆహారం తీసుకోవాలి అటువంటి నియమాలు పాటించాలి తప్ప మామూలుగా చేయకూడదు. వేదమునా పుస్తకాలు చూసేసి చదివేయకూడదు ఇప్పుడు శ్రీనివాస విద్య పిడిఎఫ్ పెట్టుకు చదవకండి. గురువు దగ్గర నేర్చుకోండి ఎందుకంటే వేదానికి స్వరం అనేది ఉంటుంది. వేదంలో అక్షరాలు మారినా స్వరం మారినా సరే దాని అర్థము దాని శక్తి మొత్తం మారిపోతాయి. అందుకని గురువు దగ్గర నేర్చుకునేటప్పుడు చేయండి. ఇంకా మామూలుగా అందరూ అడుగుతున్న కొన్ని ప్రశ్నలు ఏమిటంటే ఇది శ్రావణ మాసంలో చేయాలా అండి లేకపోతే ఏ మాసంలో అయినా చేయొచ్చు? ఏ మాసంలో అయినా చేయొచ్చు పాడ్యమి నుంచి మొదలుపెట్టి అమావాస్య వరకు మొత్తం ఒక దీక్ష లాగా చేయాలి. కాకపోతే శ్రావణ మాసం అంటే అమ్మవారి లక్ష్మీదేవి శక్తి మనకి చాలా ప్రసన్నంగా అందుబాటులో ఉంటుంది. అందుకని అప్పుడు చేస్తే తొందరగా ఫలిస్తుంది జనానికి. మరి అలా అయితే ఒకవేళ శుక్ల పక్షంలోనో కృష్ణ పక్షంలోనో 15 రోజులు లేకపోతే నెల 30 రోజులు లేకపోతే అంటే దీనికి 30 రోజులు దీక్ష అని కాదు పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఎన్ని రోజులు ఉంటాయి తిధుల ప్రకారం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు చేయండి సరిపోతుంది. ఇంకా ఆఖరి ప్రశ్న అందరూ అడుగుతుంది ఆడవాళ్ళకి ఇబ్బంది వస్తుంది కదండీ మరి 30 రోజులు అంటే ఎలా చేస్తారు అని. అందుకే శ్రీనివాస విద్య భార్యాభర్త కలిసి చేయడం ఉత్తమమైన మార్గం. అలా దీక్షలా చేస్తే కనుక భార్యకి అడ్డు వచ్చిన ఆమె వెలుపల ఉంటుంది భర్త కంటిన్యూ చేస్తాడు ఆ పూజని ఐదో రోజు స్నానం అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ పూజలో ఆవిడ కూడా జాయిన్ అవుతుంది. అది మార్గం. అందుకని వీటిలో ఏదో ఒక ప్రయోగం చేసి మీకు ఏ ఆర్థికమైన సమస్యలు ఉన్నా సరే వాటి నుంచి బయటపడి లక్ష్మీదేవి కటాక్షం.

No comments:

Post a Comment