సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి గారి తండ్రి గారు
శివ శక్తి దత్తా గారు ఇక లేరు ! నివాళులు... శ్రద్దాంజలి!!
🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿
ప్రముఖ గీత రచయిత మరియు రచయిత శివ శక్తి దత్తా గారు 92 సంవత్సరాల వయసులో జూలై 7, 2025న హైదరాబాద్‌లోని మణికొండలోని తన స్వగృహంలో వృద్ధాప్య సంబంధిత వ్యాధుల కారణంగా మరణించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ఇంట్లో… విషాదం చోటుచేసుకుంది.
......
"కోడూరి శివశక్తి దత్తా తెలుగు సినిమా గీత రచయిత.
తెలుగు సినిమాల్లో సంస్కృత పాటలు రాయడం ద్వారా ఆయన గుర్తింపు పొందారు. ఆయన ప్రముఖ సినీ రచయిత వి. విజయేంద్ర ప్రసాద్‌కు సోదరుడు అవుతాడు. సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణికి తండ్రి. దర్శకుడు ఎస్. ఎస్. రాజమౌళికి పెద్దనాన్న అవుతాడు. శివశక్తి దత్తా సై, ఛత్రపతి, రాజన్న, బాహుబలిః ది బిగినింగ్, బాహుబలి 2, ఆర్ఆర్ఆర్, హనుమాన్ వంటి వివిధ సినిమాలకు పాటలు రాశారు. బాహుబలి చిత్రంలో మమతల తల్లి, ఛత్రపతి చిత్రంలో ""అగ్ని స్ఖలన"", ""మన్నేలా తింటివిరా"" రాజన్న సినిమాలో అమ్మా అవని వంటి సూపర్ హిట్ పాటలు రాశారు.
.......
సినిమాలకు అతీతంగా గౌరవనీయమైన సాహిత్యవేత్త అయిన దత్తా రచనలు సాంస్కృతిక గొప్పతనానికి మరియు తాత్విక లోతుకు ప్రసిద్ధి చెందాయి. ఆయన మరణం తెలుగు చలనచిత్ర ప్రపంచాన్ని తీవ్రంగా కదిలించింది, సోషల్ మీడియాలో అనేకమంది ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
......
శివశక్తి దత్తా అసలు పేరు కోడూరి సుబ్బారావు.
చిన్నతనంలోనే కళలపై విపరీతమైన ఆసక్తితో ముంబైకి వెళ్లి జె. జె కాలేజ్ అఫ్ ఫైన్ ఆర్ట్స్ చేరారు. అక్కడ చిత్రకళపై ప్రావీణ్యం సాధించారు. అనంతరం 'కమలేశ్' అనే కలం
పేరుతో చిత్రకారుడిగా కొంతకాలం పనిచేసాడు. కానీ అక్కడే ఆగిపోలేదు. సంగీతం పట్ల మక్కువతో గిటార్, సితార్, హార్మోనియం వంటి వాద్యాలను నేర్చుకున్నారు.అలా శివశక్తి దత్త సినీరంగంలో ప్రవేశించిన అనంతరం తన సోదరుడు విజయేంద్ర ప్రసాద్ తో కలిసి పనిచేయడం ప్రారంభించారు. 1988లో విడుదలైన 'జానకి రాముడు' సినిమా ద్వారా శివశక్తి దత్తా రచయితగా మంచి గుర్తింపు పొందారు. ఆపై ఆయన రచించిన పాటలు, స్క్రీన్ప్లేలు తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నాయి.
......
కవితా లోతు మరియు శాస్త్రీయ నైపుణ్యానికి పేరుగాంచిన
దత్తా గారు తెలుగు సినిమాకు శాశ్వత కృషి చేశారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్, మగధీర, రాజన్న, శ్రీ రామదాసు వంటి మైలురాయి చిత్రాలకు ఆయన చిరస్మరణీయమైన సాహిత్యం రాశారు, తరచుగా ఆయన కుమారుడు మరియు సోదరుడు దర్శకుడు కె. రాఘవేంద్రరావుతో కలిసి పనిచేశారు. “మమతల తల్లి,” “రామం రాఘవం,” మరియు “నల్ల నల్లని కళ్ళ” వంటి పాటలు ఆయన భాషపై పట్టును మరియు పురాణాలను భావోద్వేగాలతో మిళితం చేసే సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ఆయన 2007లో చంద్రహాస్ చిత్రానికి కూడా దర్శకత్వం వహించారు.
......
తన చివరి సంవత్సరాల్లో, దత్తా రాజమౌళి నిర్మించిన చిత్రాలకు పాటలు రాశారు . వాటిలో రెండు బాహుబలి సినిమాలు మరియు RRR ఉన్నాయి. అతను సై మరియు ఛత్రపతి చిత్రాలకు కూడా రాశారు. అతను పాటలు రాసిన చివరి చిత్రాలలో హనుమాన్లిలో ఒకటి. అతను సంస్కృతంలో బాగా ప్రావీణ్యం కలిగి ఉండటం వలన, చాలా మంది చిత్రనిర్మాతలు నిర్దిష్ట సాహిత్యం కోసం అతనిని ఇష్టపడేవారు.
......
శివశక్తి దత్త గారు రచించిన కొన్ని ప్రముఖ పాటలు....
బాహుబలి: (మమతల తల్లి), (ధీవర) బాహుబలి 2:
(సాహోరే బాహుబలి),ఆర్ఆర్ఆర్: (రామం రాఘవమ్), హనుమాన్ (అంజనాద్రి థీమ్ సాంగ్), సై (నల్ల నల్లని కళ్ళ పిల్ల), చత్రపతి: (మన్నేల తింటివిరా),రాజన్న: (అమ్మ అవని) ఈ పాటలు ఒక్కొక్కటీ గుండెను తాకే భావోద్వేగాలను కలిగించాయి. శివశక్తి దత్తా తన పదాలకు ప్రాణం పోసే శైలితో, పాటలను ఒక ప్రత్యేక స్థాయికి తీసుకెళ్లారు.
.....
శివశక్తి దత్తా అంటే సినిమా రచయితగా, దర్శకునిగానే చాలామందికి తెలుసు. జానకి రాముడు, నారి నారి నడుమ మురారి, జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి ఎన్నో సినిమాలకు కథా విభాగంలో పని చేసినవారు దత్తా. 'అర్థాంగి', 'చంద్రహాస్'లాంటి సినిమాలు డెరైక్ట్ కూడా చేశారు.
.......
శివశక్తి దత్తా పొయిట్రీ రాస్తారు. స్టోరీలు అల్లుతారు. మ్యూజిక్లో మేటి. పెయింటింగ్లో కింగ్. 'గంగావతారం' అనే కావ్యానికి కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ నుంచి ప్రశంసలందు కోవడం మాటలా మరి! 'యువ' మాసపత్రికలో ఆయన రాసిన 'హంస మంజీరాలు' సీరియల్ అప్పట్లో సూపర్హీట్. తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, సంస్కృతం, ఇంగ్లిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలరు. పాట్లాడగలరు. హార్మోనియం,
🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿🌺🌿
No comments:
Post a Comment