Tuesday, 19 November 2024

TTD #TTDevasthanams----ఇటీవల జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలిలో సభ్యులతో చర్చించి తీసుకున్న నిర్ణయాలు

ఇటీవల జరిగిన  టీటీడీ ధర్మకర్తల  మండలిలో సభ్యులతో చర్చించి తీసుకున్న నిర్ణయాలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో సామాన్యభక్తులు త్వరగా ( గంటల వ్యవధిలో) శ్రీవారి దర్శనభాగ్యం కల్పించాలని బోర్డు కీలక నిర్ణయం

టీటీడీలో పని చేస్తున్న అన్యమత ఉద్యోగులను విఆర్ఎస్ లేదా ప్రభుత్వ సంస్థలకు బదిలీ చేయాలని నిర్ణయం

యేళ్ళ తరబడి చెత్తతో పేరుకుపోయిన డంపింగ్ యార్డ్ లో చెత్తను మరో 3 నెలల్లో తొలగిస్తాం

తిరుపతిలో ప్రస్తుతం
శ్రీనివాససేతు గా ఉన్న ఫ్లై ఓవర్ కు మునుపటి పేరు గరుడవారధి గా మారుస్తూ నిర్ణయం

తిరుమలలో రాజకీయ వ్యాఖ్యలు పూర్తిగా నిషేధిస్తూ సంచలన నిర్ణయం

రాజకీయ వ్యాఖ్యలు చేసినవారిపై కేసులు పెట్టాలని నిర్ణయం

శ్రీవాణి ట్రస్ట్ పై వస్తున్న అపోహాలు దృష్ట్యా ...ట్రస్ట్ పేరుని రద్దు చేసి టీటీడీ మెయిన్ ఆకౌంట్ ద్వారా లావాదేవీలు జరపడం 

తిరుపతి స్థానికులకు ప్రతినెల మొదటి మంగళవారం శ్రీవారి దర్శనభాగ్యం

టూరిజం దర్శనం టిక్కెట్లు కోటా పూర్తిగా రద్దు 

విశాఖ శారదా పీఠం నిర్మాణం పూర్తిగా నిభందనలకు వ్యతిరేకంగా జరిగిందని గుర్తించాం

విశాఖ శారదా మఠం వెనక్కు తీసుకోవాలని నిర్ణయం...లీజు రద్దు చేసి స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయం

అలిపిరి జూపార్క్ రోడ్డులో గతంలో దేవలోక్ కోసం కేటాయించిన‌ భూమిని....ముంతాజ్ హోటల్స్ సంస్థకు గత ప్రభుత్వం కేటాయించి భక్తుల మనోభావాలు దెబ్బతీసింది కావునా భూమి లీజు రద్దు చేస్తున్నాం

ఆలయంలో ప్రసాదాలు తయారు చేసే పొటు లలో వర్షాలు కురిసినప్పుడు లీకేజ్ ఎక్కువగా ఉంటుంది

లీకేజ్ వల్ల ప్రసాదాలు తయారీ కష్టంగా మారింది...దీంతో లీకేజ్ ని అరికట్టి మరమ్మత్తులు చేయాలని నిర్ణయం

#TTD #TTDevasthanams

No comments:

Post a Comment