దోహా వేదికగా జరుగుతున్న 9వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు ప్రారంభం తెలుగు భాషాభిమానులందరికీ ఆనందకరమైన ఘట్టం. ప్రపంచం నలుమూలల నుంచి ఈ సదస్సుకు విచ్చేసిన తెలుగు భాషాభిమానులకు, సాహితీ వేత్తలకు, కవులకు, రచయితలకు, వివిధ రంగాల ప్రముఖులకు నా హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
తెలుగు భాషా సంస్కృతుల వెలుగులను విస్తృతంగా ప్రచారం చేయడంలో ఈ సదస్సు కీలకమైన పాత్ర పోషించనుందని నేను విశ్వసిస్తున్నాను. తెలుగు గడ్డకు దూరంగా నివసిస్తున్నా, తెలుగు భాషపై ప్రేమతో, సాహిత్యంపై అభిమానం కలిగించి, ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన వంగూరి ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ వంగూరి చిట్టెన్ రాజు గారికి, ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు శ్రీ భాగవతుల వెంకప్ప గారికి, అలాగే కార్యక్రమ నిర్వహణ బృందానికి నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.
ఈ సదస్సు తెలుగు భాష, సాహిత్యాల వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడమే కాకుండా, భాషాభిమానులందరిని ఒక వేదికపైకి తీసుకురావడంలో విజయం సాధిస్తుందనేది నా ఆకాంక్ష. భవిష్యత్తులో తెలుగు భాషాభివృద్ధికి మరిన్ని కార్యక్రమాలు జరగాలని ఆశిస్తూ, అందరికీ మరోమారు శుభాకాంక్షలు!
తెలుగు భాష అభివృద్ధే మా లక్ష్యం.
జయము తెలుగుకి, జయము సాహిత్యానికి!
No comments:
Post a Comment