Monday, 1 April 2024

చిరుగు నిక్కరేసి వేణువూదుతుండగా




Search Her


మీసాల గోపాల రా రా రార
నా బాల గోపాల రా రా రార

మీసాల గోపాల రా రా రార
నా బాల గోపాల రా రా రార

నీకు చిన్ననాటి చెమ్మ చెక్క
గుర్తు ఉన్నదా
జామ చెట్టు కింద పిల్లి మొగ్గ
గుర్తు ఉన్నదా
చిరుగు నిక్కరేసి వేణువూదుతుండగా
ఉప్పనల్లే కారే ముక్కు గంగ
గుర్తు ఉన్నదా

హే మీసాల గోపాల రా రా రార
నా బాల గోపాల రా రా

మర్రి చెట్టు గట్టు మీద
జామపండు కోసుకొచ్చి
కలిసి తిన్నాము గుర్తుందా హోయి

మిరప తోట కంచె కాడ
చెవిని పట్టి తోటమాలి
తిప్పినాడు నొప్పి పోయిందా హా

ఓహోహో చిక్కు చిక్కు పుల్ల అంటూ
ఇసుకలో ఇల్లే కట్టాములే
అః చల్ చల్ గుర్రమంటూ
ఆటలో ఏళ్లే మరిచాములే

గురుతుంది కదా ఆ పొదుపు కధ
జొన్న చేలో చెప్పుకున్నది
దోబూచి కధ బాగుంది కదా
అని ఊరు వాడ మెచ్చుకున్నది

మీసాల గోపాలం రానే వచ్చాడే
నా బాల గోపాల రా రా

కాళ్ళ గజ్జ కంకాళమ్మ
ఏళ్ళు ముంచుకొచ్చేనని
బుల్లి గౌను కధ మరిచేనా

హా వీరి వీరి గుమ్మడిపండు
వేగు చుక్క వెలగపండు
గిల్లి కజ్జాలు మొదలైనా హొహోయి

ఓహోహో ఒప్పుల కుప్ప అంటూ
మధ్యలో వదిలేసి పోమాకే
గూడు గూడు గుంజం అంటూ
గుండెలో గూడె కట్టుకుంటా

కల కాదు ప్రియా ఇది నిజము అని
నువ్వు గిచ్చి గిచ్చి చెప్పవమ్మా
కలిసాము మనం కల కాదు నిజం
అని ఒట్టు పెట్టి చెప్పెనమ్మా

అహేయ్ మీసాల గోపాలం రానే వచ్చాడే
నా బాల గోపాల రా రా రార

నాటి చెమ్మ చెక్క పిల్లి మొగ్గ
గుర్తు ఉన్నదే
పంట చేలా మధ్య పప్పు చెక్క
గుర్తు ఉన్నదే
తొర్రి పళ్ళ బుజ్జి పిల్ల పరుగు తీయక
కాకి రెట్ట పడ్డ పుల్ల పిలక
గుర్తు ఉన్నదే

No comments:

Post a Comment