Monday 26 August 2024

హెయ్ బొంగరాలంటి కల్లు తిప్పిందిఉంగరాలున్న జుట్టు తిప్పిందిగింగిరలెట్టే నడుమొంపుల్లో నన్నే తిప్పిందిఅమ్మో .. బాపు గారి బొమ్మోఓలమ్మో.. మల్లెపూల కొమ్మోరబ్బరు గాజుల రంగు తీసిందిబుగ్గల అంచున ఎరుపు రాసిందిరిబ్బను కట్టిన గాలిపటంలా నన్నెగరేసిందీఅమ్మో.. దాని చూపు దుమ్మోఓలమ్మో... ఓల్డుమంకు రమ్మ్మోపగడాలా పెదవుల్తో పడగొట్టిందీ పిల్లాకత్తులులేని యుద్ధం చేసి నన్నే గెలిచిందిఏకంగా యెదపైనే నర్తించిందీఅబ్బ నట్యంలోని ముద్దర చూసి నిద్దర రాలేపోయిందిఅమ్మో.. బాపు గారి బొమ్మోహేహేహే ఓలమ్మో .. మల్లెపూల కొమ్మోచరణం 1:మొన్న మేడ మీద బట్టలారేస్తూకూనిరాగమేదొ తీసేస్తూపిడికెడి ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్లానిన్న కాఫీ గ్లాసు చేతికందిస్తూ నాజూకైన వేల్లు తాకిస్తూమెత్తని మత్తుల విధ్యుత్తీగై వొత్తిడి పెంచిందే మల్లా... హైకూరలో వేసే పోపు నా ఊహల్లో వేసేసిందిఓరగా చూసే చూపు నావైపే అంపిస్తుందిపూలలో గుచ్చే దారం నా గుండెల్లో గుచ్చేసిందిచీర చెంగు చివరంచుల్లో నన్నే బందీ చేసిందిపొద్దుపొద్దున్నే హల్లో అంటుందీపొద్దుపోతె చాలు కల్లోకొస్తుందిపొద్దస్తమానం పొయినంత దూరం గుర్తొస్తుంటుందీఅమ్మో.. బాపు గారి బొమ్మోహేహేహే ఓలమ్మో .. మల్లెపూల కొమ్మోచరణం 2:ఏ మాయా లొకంలోనో నన్ను మెల్లగ తోసేసిందితలుపులు మూసిందీ తాలం పోగొట్టేసిందీ..ఆ మబ్బుల అంచులదాక నా మనసుని మోసేసిందిచప్పుడు లేకుండా నిచ్చన పక్కకు లాగిందితిన్నగా గుండెను పట్టి గుప్పిట పెట్టీ మూసేసిందిఅందమే గంధపు గాలై మళ్ళీ ఊపిరి పోసిందితియ్యనీ ముచ్చటలెన్నో ఆలొచనలో అచ్చేసిందిప్రేమనే కల్లద్దాలు చుపులకే తగిలించిందీపూసల దేశపు రాజకుమారీఅశలు రేపిన అందాల పోరిపూసల దండలు నన్నే గుచ్చి మెడలో వేసిందీఅమ్మో.. బాపు గారి బొమ్మోహేహేహే ఓలమ్మో .. మల్లెపూల కొమ్మో

హెయ్ బొంగరాలంటి కల్లు తిప్పింది
ఉంగరాలున్న జుట్టు తిప్పింది
గింగిరలెట్టే నడుమొంపుల్లో నన్నే తిప్పింది
అమ్మో .. బాపు గారి బొమ్మో
ఓలమ్మో.. మల్లెపూల కొమ్మో
రబ్బరు గాజుల రంగు తీసింది
బుగ్గల అంచున ఎరుపు రాసింది
రిబ్బను కట్టిన గాలిపటంలా నన్నెగరేసిందీ
అమ్మో.. దాని చూపు దుమ్మో
ఓలమ్మో... ఓల్డుమంకు రమ్మ్మో
పగడాలా పెదవుల్తో పడగొట్టిందీ పిల్లా
కత్తులులేని యుద్ధం చేసి నన్నే గెలిచింది
ఏకంగా యెదపైనే నర్తించిందీ
అబ్బ నట్యంలోని ముద్దర చూసి నిద్దర రాలేపోయింది
అమ్మో.. బాపు గారి బొమ్మో
హేహేహే ఓలమ్మో .. మల్లెపూల కొమ్మో

చరణం 1:

మొన్న మేడ మీద బట్టలారేస్తూ
కూనిరాగమేదొ తీసేస్తూ
పిడికెడి ప్రాణం పిండేసేలా పల్లవి పాడిందే పిల్లా
నిన్న కాఫీ గ్లాసు చేతికందిస్తూ నాజూకైన వేల్లు తాకిస్తూ
మెత్తని మత్తుల విధ్యుత్తీగై వొత్తిడి పెంచిందే మల్లా... హై
కూరలో వేసే పోపు నా ఊహల్లో వేసేసింది
ఓరగా చూసే చూపు నావైపే అంపిస్తుంది
పూలలో గుచ్చే దారం నా గుండెల్లో గుచ్చేసింది
చీర చెంగు చివరంచుల్లో నన్నే బందీ చేసింది
పొద్దుపొద్దున్నే హల్లో అంటుందీ
పొద్దుపోతె చాలు కల్లోకొస్తుంది
పొద్దస్తమానం పొయినంత దూరం గుర్తొస్తుంటుందీ
అమ్మో.. బాపు గారి బొమ్మో
హేహేహే ఓలమ్మో .. మల్లెపూల కొమ్మో

చరణం 2:

ఏ మాయా లొకంలోనో నన్ను మెల్లగ తోసేసింది
తలుపులు మూసిందీ తాలం పోగొట్టేసిందీ..
ఆ మబ్బుల అంచులదాక నా మనసుని మోసేసింది
చప్పుడు లేకుండా నిచ్చన పక్కకు లాగింది
తిన్నగా గుండెను పట్టి గుప్పిట పెట్టీ మూసేసింది
అందమే గంధపు గాలై మళ్ళీ ఊపిరి పోసింది
తియ్యనీ ముచ్చటలెన్నో ఆలొచనలో అచ్చేసింది
ప్రేమనే కల్లద్దాలు చుపులకే తగిలించిందీ
పూసల దేశపు రాజకుమారీ
అశలు రేపిన అందాల పోరి
పూసల దండలు నన్నే గుచ్చి మెడలో వేసిందీ
అమ్మో.. బాపు గారి బొమ్మో
హేహేహే ఓలమ్మో .. మల్లెపూల కొమ్మో

నీ జతగా నేనుండాలినీ యెదలో నేనిండాలినీ కథగా నెనే మారాలినీ నీడై నే నడవాలినీ నిజమై నే నిలవాలినీ ఊపిరి నేనే కావాలినాకే తెలియని నను చూపించినీకై పుట్టాననిపించినీ దాక నను రప్పించావే..నీ సంతోషం నాకందించినా పేరుకి అర్ధం మార్చినేనంటె నువ్వనిపించావేఅ..నీ జతగా నేనుండాలినీ యెదలో నేనిండాలినీ కథగా నేనే మారాలినీ నీడై నే నడవాలినీ నిజమై నే నిలవాలినీ ఊపిరి నేనే కావాలి చరణం 1:కల్లోకొస్థావనుకున్నా తెల్లార్లు చూస్థూ కుర్చున్నరాలేదే జాడైనా లేదేరెప్పల బయటే నేనున్నా అవి మూస్తే వద్దామనుకున్నపడుకొవేం పైగా తిడతావేంలొకంలో లెనట్టే మైకంలో నేనుంటె వదిలేస్తావా నన్నిలానీలోకం నాకంటే ఇంకేదొ ఉందంటె నమ్మే మాటలనీ జతగా నేనుండాలినీ యెదలో నేనిండాలినీ కథగా నేనే మారాలిచరణం 2:తెలిసీ తెలియక వాలింది నీ నడుమొంపుల్లో నలిగింది నా చూపుఎం చేస్తాం చెప్పుతోచని తొందర పుడుతుంది తెగ తుంటరిగా నను నెడుతుందినీ వైపు నీదె ఆ తప్పునువ్వంటే నువ్వంటు ఎవేవో అనుకుంటు విడిగా ఉందలేముగదూరంగా పొమ్మంటూ దూరాన్నే తరిమేస్తు ఒకటవ్వాలిగానీ జతగా నేనుండాలినీ యెదలో నేనిండాలినీ కథగా నేనే మారాలినీ నీడై నే నడవాలినీ నిజమై నే నిలవాలినీ ఊపిరి నేనే కావాలి

నీ జతగా నేనుండాలి
నీ యెదలో నేనిండాలి
నీ కథగా నెనే మారాలి
నీ నీడై నే నడవాలి
నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి
నాకే తెలియని నను చూపించి
నీకై పుట్టాననిపించి
నీ దాక నను రప్పించావే..
నీ సంతోషం నాకందించి
నా పేరుకి అర్ధం మార్చి
నేనంటె నువ్వనిపించావేఅ..

నీ జతగా నేనుండాలి
నీ యెదలో నేనిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి
నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి 

చరణం 1:

కల్లోకొస్థావనుకున్నా తెల్లార్లు చూస్థూ కుర్చున్న
రాలేదే జాడైనా లేదే
రెప్పల బయటే నేనున్నా అవి మూస్తే వద్దామనుకున్న
పడుకొవేం పైగా తిడతావేం
లొకంలో లెనట్టే మైకంలో నేనుంటె వదిలేస్తావా నన్నిలా
నీలోకం నాకంటే ఇంకేదొ ఉందంటె నమ్మే మాటల

నీ జతగా నేనుండాలి
నీ యెదలో నేనిండాలి
నీ కథగా నేనే మారాలి

చరణం 2:

తెలిసీ తెలియక వాలింది నీ నడుమొంపుల్లో నలిగింది నా చూపు
ఎం చేస్తాం చెప్పు
తోచని తొందర పుడుతుంది తెగ తుంటరిగా నను నెడుతుంది
నీ వైపు నీదె ఆ తప్పు
నువ్వంటే నువ్వంటు ఎవేవో అనుకుంటు విడిగా ఉందలేముగ
దూరంగా పొమ్మంటూ దూరాన్నే తరిమేస్తు ఒకటవ్వాలిగా

నీ జతగా నేనుండాలి
నీ యెదలో నేనిండాలి
నీ కథగా నేనే మారాలి
నీ నీడై నే నడవాలి
నీ నిజమై నే నిలవాలి
నీ ఊపిరి నేనే కావాలి

మిర్చి మిర్చి మిర్చి మిర్చిమిర్చి లాంటి కుర్రాడేమిర్చి మిర్చి మిర్చి మిర్చిఎ మిర మిర మీసం తిప్పిమిసైల్ అల్లె దూకాడెమిర్చి మిర్చి మిర్చి మిర్చిమిర్చి లాంటి కుర్రాడేఏయ్ మిర మిర మీసం తిప్పిమిసైల్ అల్లె దూకాడెఆ నిప్పుకు మల్లె నికారసైన ఆకారంఅడుగెట్టిన చోట అదిరిపోద్ది గుడారంఅబ్బ ఇప్పుడికన్నా మొదలవుతది యవ్వారంఇది చెప్పుడు చలు దుమ్మొ దుమ్మొ దుమ్మారంమిర్చి మిర్చి మిర్చి మిర్చిమిర్చి లాంటి కుర్రాడెమిర్చి మిర్చి మిర్చి మిర్చిఆ మిర్చి మిర్చి మిర్చి మిర్చిమిర్చి లాంటి కుర్రాడెఆ ఎక్కడెక్కడ బైలెల్లాడొ బంగారంగుండెలు తట్టి మోగిస్తాడు అలారంయె దిక్కులు ముట్టి పుట్టిస్తాడొ కల్లోలంఎన్ని లెక్కలు వెసి ఎవ్వరం మాత్రం చెప్పగలంమిర్చి మిర్చి మిర్చిమిర్చి మిర్చి మిర్చి

మిర్చి మిర్చి మిర్చి మిర్చి
మిర్చి లాంటి కుర్రాడే
మిర్చి మిర్చి మిర్చి మిర్చి
ఎ మిర మిర మీసం తిప్పి
మిసైల్ అల్లె దూకాడె

మిర్చి మిర్చి మిర్చి మిర్చి
మిర్చి లాంటి కుర్రాడే
ఏయ్ మిర మిర మీసం తిప్పి
మిసైల్ అల్లె దూకాడె

ఆ నిప్పుకు మల్లె నికారసైన ఆకారం
అడుగెట్టిన చోట అదిరిపోద్ది గుడారం
అబ్బ ఇప్పుడికన్నా మొదలవుతది యవ్వారం
ఇది చెప్పుడు చలు దుమ్మొ దుమ్మొ దుమ్మారం

మిర్చి మిర్చి మిర్చి మిర్చి
మిర్చి లాంటి కుర్రాడె
మిర్చి మిర్చి మిర్చి మిర్చి
ఆ మిర్చి మిర్చి మిర్చి మిర్చి
మిర్చి లాంటి కుర్రాడె

ఆ ఎక్కడెక్కడ బైలెల్లాడొ బంగారం
గుండెలు తట్టి మోగిస్తాడు అలారం
యె దిక్కులు ముట్టి పుట్టిస్తాడొ కల్లోలం
ఎన్ని లెక్కలు వెసి ఎవ్వరం మాత్రం చెప్పగలం

మిర్చి మిర్చి మిర్చి
మిర్చి మిర్చి మిర్చి

పండగలా దిగివచ్చావుప్రాణాలకు వెలుగిచ్చావురక్త్తాన్నె ఎరుపెక్కించావుఓ మా తోడుకు తోడయ్యావుమా నీడకు నీడయ్యావుమా అయ్యకు అండై నిలిచావుపండగలా దిగివచ్చావుప్రాణాలకు వెలుగిచ్చావురక్త్తాన్నె ఎరుపెక్కించావుఓ మా తోడుకు తోడయ్యావుమా నీడకు నీడయ్యావుమా అయ్యకు అండై నిలిచావుఅయ్యంటే ఆనందం అయ్యంటె సంతోషంమా అయ్యకు అయ్యై నువుకలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసంఇట్టాగె పదికాలలు ఉండనివ్వుపండగలా దిగివచ్చావుప్రాణాలకు వెలుగిచ్చావురక్త్తాన్నె ఎరుపెక్కించావుఓ మా తోడుకు తోడయ్యావుమా నీడకు నీడయ్యావుమా అయ్యకు అండై నిలిచావుచరణం 1:ఓ జోలాలి అనలేదె చిననాడు నిన్నెప్పుడు ఈ ఊరి ఉయ్యాలఓ నీ పాదం ముద్దాడి పులకించి పోయిందే ఈ నేల ఇయ్యాలమా పల్లే బతుకుల్లో మా తిండి మెతుకుల్లో నీ ప్రేమె నిండాలఓ మా పిల్లా పాపల్లో మా ఇంటి దీపాల్లో నీ నవ్వె చూడాలాగుండె కలిగిన గునము కలిగిన అయ్య కొడుకువుగావేరు మూలము వెతికి మా జత చేరినావు ఇలాపండగలా దిగివచ్చావుప్రాణాలకు వెలుగిచ్చావురక్త్తాన్నె ఎరుపెక్కించావుఓ మా తోడుకు తోడయ్యావుమా నీడకు నీడయ్యావుమా అయ్యకు అండై నిలిచావుచరణం 2:ఓ పెదవుల్లో వెన్నెల్లూ గుండెల్లో కన్నీల్లు ఇన్నాళ్ళు ఇన్నేళ్ళుఓ అచ్చంగా నీవల్లే మా సామి కల్లల్లో చూసామీ తిరనాల్లుఎ దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో మురిసాయి ముంగిల్లుమా పుణ్యం పండేలా ఈ పైన మెమంతా మీ వాల్లు ఐనొల్లూఅడుగు మోపిన నిన్ను చూసి అదిరె పలనాడుఇక కలుగు దాటి బయట పదగ బెదరడ పగవాడుపండగలా దిగివచ్చావుప్రాణాలకు వెలుగిచ్చావురక్త్తాన్నె ఎరుపెక్కించావుఓ మా తోడుకు తోడయ్యావుమా నీడకు నీడయ్యావుమా అయ్యకు అండై నిలిచావు

పండగలా దిగివచ్చావు
ప్రాణాలకు వెలుగిచ్చావు
రక్త్తాన్నె ఎరుపెక్కించావు
ఓ మా తోడుకు తోడయ్యావు
మా నీడకు నీడయ్యావు
మా అయ్యకు అండై నిలిచావు

పండగలా దిగివచ్చావు
ప్రాణాలకు వెలుగిచ్చావు
రక్త్తాన్నె ఎరుపెక్కించావు
ఓ మా తోడుకు తోడయ్యావు
మా నీడకు నీడయ్యావు
మా అయ్యకు అండై నిలిచావు

అయ్యంటే ఆనందం అయ్యంటె సంతోషం
మా అయ్యకు అయ్యై నువు
కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం
ఇట్టాగె పదికాలలు ఉండనివ్వు

పండగలా దిగివచ్చావు
ప్రాణాలకు వెలుగిచ్చావు
రక్త్తాన్నె ఎరుపెక్కించావు
ఓ మా తోడుకు తోడయ్యావు
మా నీడకు నీడయ్యావు
మా అయ్యకు అండై నిలిచావు

చరణం 1:
ఓ జోలాలి అనలేదె చిననాడు నిన్నెప్పుడు ఈ ఊరి ఉయ్యాల
ఓ నీ పాదం ముద్దాడి పులకించి పోయిందే ఈ నేల ఇయ్యాల
మా పల్లే బతుకుల్లో మా తిండి మెతుకుల్లో నీ ప్రేమె నిండాల
ఓ మా పిల్లా పాపల్లో మా ఇంటి దీపాల్లో నీ నవ్వె చూడాలా
గుండె కలిగిన గునము కలిగిన అయ్య కొడుకువుగా
వేరు మూలము వెతికి మా జత చేరినావు ఇలా

పండగలా దిగివచ్చావు
ప్రాణాలకు వెలుగిచ్చావు
రక్త్తాన్నె ఎరుపెక్కించావు
ఓ మా తోడుకు తోడయ్యావు
మా నీడకు నీడయ్యావు
మా అయ్యకు అండై నిలిచావు

చరణం 2:
ఓ పెదవుల్లో వెన్నెల్లూ గుండెల్లో కన్నీల్లు ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు
ఓ అచ్చంగా నీవల్లే మా సామి కల్లల్లో చూసామీ తిరనాల్లు
ఎ దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో మురిసాయి ముంగిల్లు
మా పుణ్యం పండేలా ఈ పైన మెమంతా మీ వాల్లు ఐనొల్లూ
అడుగు మోపిన నిన్ను చూసి అదిరె పలనాడు
ఇక కలుగు దాటి బయట పదగ బెదరడ పగవాడు

పండగలా దిగివచ్చావు
ప్రాణాలకు వెలుగిచ్చావు
రక్త్తాన్నె ఎరుపెక్కించావు
ఓ మా తోడుకు తోడయ్యావు
మా నీడకు నీడయ్యావు
మా అయ్యకు అండై నిలిచావు

యెకువలోన గోదారి ఎరుపెక్కిందిఆ ఎరుపెమొ గోరింట పంటయ్యిందియెకువలోన గోదారి ఎరుపెక్కిందిఆ ఎరుపెమొ గోరింట పంటయ్యిందిపండిన చేతికెన్నో సిగ్గులొచ్చిఅహ సిగ్గంత చీర చుట్టిందిచీరలో చందమామ ఎవ్వరమ్మఆ గుమ్మ సీతమ్మచరణం 1:సీతమ్మ వాకిట్లొ సిరిమల్లె చెట్టుసిరిమల్లె చెట్టెమొ విరగ బూసిందికొమ్మ తరలకుండ కొయ్యండి పూలుకోసినవన్నీ సీత కొప్పు చుట్టండికొప్పున పూలు గుప్పెడంతెందుకండికొదండ రామయ్య వస్తున్నాడండిరానె వచ్చాడు ఓయమ్మ ఆ రామయ్యవస్తు చెసాడోయమ్మ ఎదొ మాయరానె వచ్చాడు ఓయమ్మ ఆ రామయ్యవస్తు చెసాడోయమ్మ ఎదొ మాయసీతకి రాముడె సొంతమాయ్యె చోటిదినేలతొ ఆకశం వియ్యమొందె వేలిదిమూడు ముళ్ళు వేస్తె మూడు లోకాలకిముచ్చటొచ్చెనమ్మ ఓఏడు అంగలెస్తె ఏడు జన్మలకివీనడి సీతమ్మ ఓచరణం 2:సీతమ్మ వాకిట్లొ సిరిమల్లె చెట్టుసిరిమల్లె చెట్టుపై చిలక వాలిందిచిలకమ్మ ముద్దుగ చెప్పిందో మాటఆ మాట విన్నావా రామ అంటుంది రామ రామ అన్నది ఆ సీత గుండెఅన్ననాడె ఆమెకి మొగుడయ్యాడెచేతిలో చేతులె చేరుకుంటె సంబరంచూపులో చూపులె లీనమైతె సుందరం జంట బాగుందంటు గొంతు విప్పాయంట చుట్టు చెట్టు చేమా ఓపంట పండిందంటు పొంగిపోయిందమ్మ ఇదిగొ ఈ సీతమ్మా ఓ

చిన్నగ చిన్నగ చిన్నగ 
మది కన్నులు విప్పిన కన్నెగా 
నీ మగసిరికే వేస్తా నా వోటు 
నా సొగసిరితొ వెస్తా ఆ వోటు 

మెల్లగ మెల్లగ మెల్లగ 
మరు మల్లెలు మబ్బులు జల్లుగా 
ముని మాపులలో వేసేయ్ నీ వోటు 
మసి నవ్వులతో వేసేయ్ ఆ వోటు 

నా ప్రేమదేశాన్ని ప్రతి రోజు పాలించే 
నా రాణి వాసాన్ని రేపగలు రక్షించే 
నీ గుండెలకే వేస్తా నా వోటు 
గుడి హారతినై వేస్తా ఆ వోటు 

చిన్నగ చిన్నగ చిన్నగ 
మది కన్నులు విప్పిన కన్నెగా 

నీ మగసిరికే వేస్తా నా వోటు 
నా సొగసిరితొ వెస్తా ఆ వోటు 

చరణం 1: 

అనుకోకుండా వచ్చి తనిఖి చేయాలి 
అందాలలో నువ్వే మునకే వేయ్యాలి 

అధికారాన్నే ఇచ్చి కునుకే మారాలి 
అవకాశాన్నే చూసి ఇరుకై పోవాలి 

యెద సభలో ఎన్నో ఎన్నో ఊసులు చెప్పాలి 
రసమయసభలో చెప్పినవన్ని చేసుకుపోవాలి 

ప్రతి పక్షం నువ్వై ఉండి హద్దులు పెట్టాలి 
ఆ రతి పక్షం నేనై ఉండి యుద్దం చేయాలి 

నా వలపు కిరీటం తలపైనే ధరించు 
నీ చిలిపి ప్రతాపం నిలువెల్లా చూపించు 
నీ చినుకులకే వేస్తా నా వోటు 
నా చెమటలతో వేస్తా ఆ వోటు 

చరణం 2: 

నా సుకుమారం నీకో సింహాసనం గా 
నా కౌగిళ్ళే నీకు కార్యలయం గా 

నీ నయగారం నాకో ధనాగారం గా 
ఈ సరసాలే ఇంకో సామ్రాజ్యమవగా 

సమయానికి కళ్ళెం వేసే కాలం వచ్చింది 
ఆ స్వర్గానికి గొళ్ళెం తీసే మార్గం తెలిసింది 

కాముడికే మైకం కమ్మేయాగం జరిగింది 
ఓ బాలుడికే పాఠం చెప్పే యొగం దక్కింది 

ఆ పాల పుంతని వలవేసీ వరించే 
ఈ పూల పుంతలో పులకింతలు పుట్టించే 
నీ రసికతకే వేస్తా నా వోటు 
నా అలసటతో వేస్తా ఆ వోటు

ఆరడుగులుంటాడ ఏడడుగులెస్తడాఎమడిగినా ఇచ్చె వాడాఆశ పెడుతుంటాడా ఆటపడుతుంటాదాఅందరికి నచ్చెసే వాడాసరిగ్గ సరిగ్గ సరిగ్గ నిలవవెందుకెబెరుగ్గ బెరుగ్గ అయిపొకేబదులేది ఇవ్వకుండ వెల్లిపోకేఆరడుగులుంటాడ ఏడడుగులెస్తడాఎమడిగినా ఇచ్చె వాడాఆశ పెడుతుంటాడా ఆటపడుతుంటాదాఅందరికి నచ్చెసే వాడాచరణం 1:మాటల ఇటుకలతొ గుండెల్లో కోటె కట్టెరకబురల చినుకులతొ పొడి కలలన్నీ తడిపెయ్యరఊసుల ఉరుకులతొ ఊహలకె ఊపిరి ఊదెయ్యరపరుగుల అలికిడితొ మమతలకె ఆయువు పూయరమౌనమై వాడు ఉంటె ప్రాణం ఎమవ్వునోనువ్వెనా ప్రపంచం అనేస్తు వెనక తిరుగుతునువ్వెనా సమస్తం అంటాడెకలలోన కూడ కాలుకందనీడెఆరడుగులుంటాడ ఏడడుగులెస్తడాఎమడిగినా ఇచ్చె వాడాఆశ పెడుతుంటాడా ఆటపడుతుంటాదాఅందరికి నచ్చెసే వాడాచరణం 2:అడిగిన సమయంలొ తను అలవోకగనను మోయాలిసొగసుని పొగడడము తనకలవాటై పొవాలిపనులను పంచుకునే మనసుంటె ఇంకెం కావాలిఅలకని పెంచుకుని అందంగా బతిమాలాలికొర్కేదైన గాని తీర్చి తీరలనిఅతన్ని అతన్ని అతన్ని చుడడానికివయస్సె తపిస్తు ఉంటుందె అపుడింక వాడు నన్ను చెరుతాడె

ఆరడుగులుంటాడ ఏడడుగులెస్తడా
ఎమడిగినా ఇచ్చె వాడా
ఆశ పెడుతుంటాడా ఆటపడుతుంటాదా
అందరికి నచ్చెసే వాడా
సరిగ్గ సరిగ్గ సరిగ్గ నిలవవెందుకె
బెరుగ్గ బెరుగ్గ అయిపొకే
బదులేది ఇవ్వకుండ వెల్లిపోకే
ఆరడుగులుంటాడ ఏడడుగులెస్తడా
ఎమడిగినా ఇచ్చె వాడా
ఆశ పెడుతుంటాడా ఆటపడుతుంటాదా
అందరికి నచ్చెసే వాడా

చరణం 1:

మాటల ఇటుకలతొ గుండెల్లో కోటె కట్టెర
కబురల చినుకులతొ పొడి కలలన్నీ తడిపెయ్యర
ఊసుల ఉరుకులతొ ఊహలకె ఊపిరి ఊదెయ్యర
పరుగుల అలికిడితొ మమతలకె ఆయువు పూయర
మౌనమై వాడు ఉంటె ప్రాణం ఎమవ్వునో
నువ్వెనా ప్రపంచం అనేస్తు వెనక తిరుగుతు
నువ్వెనా సమస్తం అంటాడె
కలలోన కూడ కాలుకందనీడె
ఆరడుగులుంటాడ ఏడడుగులెస్తడా
ఎమడిగినా ఇచ్చె వాడా
ఆశ పెడుతుంటాడా ఆటపడుతుంటాదా
అందరికి నచ్చెసే వాడా

చరణం 2:

అడిగిన సమయంలొ తను అలవోకగనను మోయాలి
సొగసుని పొగడడము తనకలవాటై పొవాలి
పనులను పంచుకునే మనసుంటె ఇంకెం కావాలి
అలకని పెంచుకుని అందంగా బతిమాలాలి
కొర్కేదైన గాని తీర్చి తీరలని
అతన్ని అతన్ని అతన్ని చుడడానికి
వయస్సె తపిస్తు ఉంటుందె అపుడింక వాడు నన్ను చెరుతాడె

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మాఎవరి కనుల చిలిపి కలవునువ్వమ్మా మువ్వలే మనసు పడు పాదమాఊహలే ఉలికి పడు ప్రాయమాహిందోళంలా సాగే అందాల సెలయేరమ్మాఆమని మధువనమా..ఆ ఆమని మధువనమాచినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మాఎవరి కనుల చిలిపి కలవునువ్వమ్మా సరిగసా సరిగసా రిగమదని సరిగసా సరిగసా నిదమ దనిసాస నిని దాద మామ గమదనిరిస గానినిదగ నినిదగ నినిదగ నినిదగ సగమగ సనిదని మద నిస నిస గసగాచరణం 1:పసిడి వేకువలు పండు వెన్నెలలు పసితనాలు పరువాల వెల్లువలుకలిపి నిన్ను మలిచాడో ఏమో బ్రహ్మ పచ్చనైన వరిచేల సంపదలు అచ్చ తెలుగు మురిపాల సంగతులు కళ్ళముందు నిలిపావే ముద్దుగుమ్మాపాల కడలి కెరటాల వంటి నీ లేత అడుగు తన ఎదను మీటి నేలమ్మ పొంగెనమ్మాఆ.. ఆగని సంబరమా ఆ ఆగని సంబరమాసగమగా రిస సనిదమగ సగ సగమగా రిస సనిదమగ సగసగస మగస గమద నిదమ గమదనిసాసనిస సనిస నిస నిస నిస గమ రిససనిస సనిస నిస నిస నిస గమ రిసగాగ నీని గగ నీని దగ నిగ సపాచరణం 2:వరములన్నీ నిను వెంట బెట్టుకొని ఎవరి ఇంట దీపాలు పెట్టమనిఅడుగుతునవే కుందనాల బొమ్మసిరుల రాణి నీ చేయి పట్టి శ్రీహరిగా మారునని రాసిపెట్టిఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మాఅన్నమయ్య శృంగార కీర్తనల వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మాఆ..రాముని సుమ శరమా ఆ..రాముని సుమ శరమాచినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మాఎవరి కనుల చిలిపి కలవునువ్వమ్మా మువ్వలే మనసు పడు పాదమాఊహలే ఉలికి పడు ప్రాయమాహిందోళంలా సాగే అందాల సెలయేరమ్మాఆమని మధువనమా..ఆ ఆమని మధువనమాచినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మాఎవరి కనుల చిలిపి కలవమ్మా

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవునువ్వమ్మా 
మువ్వలే మనసు పడు పాదమా
ఊహలే ఉలికి పడు ప్రాయమా
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
ఆమని మధువనమా..ఆ ఆమని మధువనమా
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవునువ్వమ్మా 

సరిగసా సరిగసా రిగమదని సరిగసా సరిగసా నిదమ దని
సాస నిని దాద మామ గమదనిరిస గా
నినిదగ నినిదగ నినిదగ నినిదగ 
సగమగ సనిదని మద నిస నిస గసగా

చరణం 1:

పసిడి వేకువలు పండు వెన్నెలలు పసితనాలు పరువాల వెల్లువలు
కలిపి నిన్ను మలిచాడో ఏమో బ్రహ్మ 
పచ్చనైన వరిచేల సంపదలు అచ్చ తెలుగు మురిపాల సంగతులు 
కళ్ళముందు నిలిపావే ముద్దుగుమ్మా
పాల కడలి కెరటాల వంటి నీ లేత అడుగు తన ఎదను మీటి నేలమ్మ పొంగెనమ్మా
ఆ.. ఆగని సంబరమా ఆ ఆగని సంబరమా

సగమగా రిస సనిదమగ సగ సగమగా రిస సనిదమగ సగ
సగస మగస గమద నిదమ గమదనిసా
సనిస సనిస నిస నిస నిస గమ రిస
సనిస సనిస నిస నిస నిస గమ రిస
గాగ నీని గగ నీని దగ నిగ సపా

చరణం 2:

వరములన్నీ నిను వెంట బెట్టుకొని ఎవరి ఇంట దీపాలు పెట్టమని
అడుగుతునవే కుందనాల బొమ్మ
సిరుల రాణి నీ చేయి పట్టి శ్రీహరిగా మారునని రాసిపెట్టి
ఏ వరుని జాతకం వేచి ఉన్నదమ్మా
అన్నమయ్య శృంగార కీర్తనల వర్ణనలకు ఆకారమైన బంగారు చిలకవమ్మా
ఆ..రాముని సుమ శరమా ఆ..రాముని సుమ శరమా

చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవునువ్వమ్మా 
మువ్వలే మనసు పడు పాదమా
ఊహలే ఉలికి పడు ప్రాయమా
హిందోళంలా సాగే అందాల సెలయేరమ్మా
ఆమని మధువనమా..ఆ ఆమని మధువనమా
చినుకు తడికి చిగురు తొడుగు పువ్వమ్మా
ఎవరి కనుల చిలిపి కలవమ్మా