Sunday, 3 December 2023

గోపాలా.. ఆ.. నందగోపాలా.. ఆ.. ఆ..

గోపాలా.. ఆ.. నందగోపాలా.. ఆ.. ఆ..

ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ
యెదురు చూతురా గోపాలా
ఎంత పిలచినా... ఎంత వేడినా..యీ నాటికి దయరాదేల
ఎంత పిలచినా... ఎంత వేడినా..యీ నాటికి దయరాదేల
గోపాలా.. నంద గోపాలా..
గోపాలా.. నంద గోపాలా.. 

చరణం 1 :

వీనుల విందుగ వేణుగానము.. విని తరింపగా వేచితిరా
ఆ.. ఆ.. ఆ.. ఆ..
వీనుల విందుగ వేణుగానము.. విని తరింపగా వేచితిరా
వేచి వేచి యీ వెన్నముద్దవలె కరగిపోయెరా.. నా బ్రతుకు
కరగిపోయెరా.. నా బ్రతుకు

ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ.. యెదురు చూతురా గోపాలా
ఎంత పిలచినా... ఎంత వేడినా.. యీ నాటికి దయరాదేల
గోపాలా.. నంద గోపాలా..
గోపాలా.. నంద గోపాలా.. 

చరణం 2 :

వెన్న మీగడలు జున్ను పాలకు.. యేమి కొరతరా.. మన యింట..
ఆ.. ఆ.. ఆ.. ఆ...
వెన్న మీగడలు జున్ను పాలకు.. యేమి కొరతరా.. మన యింట

పాలను ముచ్చలి పరుల చేతిలో.. దెబ్బలు తినకురా.. కన్నయ్యా
పాలను ముచ్చలి పరుల చేతిలో.. దెబ్బలు తినకురా.. కన్నయ్యా
యీ తల్లి హృదయము ఓర్వలేదయా..

ఎన్నాళ్ళని నా కన్నులు కాయగ.. యెదురు చూతురా గోపాలా
ఎంత పిలచినా... ఎంత వేడినా.. యీ నాటికి దయరాదేల
గోపాలా.. నంద గోపాలా..
గోపాలా.. నంద గోపాలా..
గోపాలా.. నంద గోపాలా..
గోపాలా.. నంద గోపాలా..

దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమోదైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో

దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో
దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో

పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమోనమో
పాలితకింకర భవనా శంకర శంకర పురహర నమోనమో
హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమో నమో
హాలాహలధర శూలాయుధకరా శైలసుతావర నమో నమో
దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో

దురిత విమోచనా ఆఅ ఆఅ ఆఆఅ ఆఅ అ అ
దురిత విమోచన ఫాలవిలోచన పరమదయాకర నమో నమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో
కరిచర్మాంబర చంద్రకళాధర సాంబ దిగంబర నమో నమో
దేవ దేవ ధవళాచల మందిర గంగాధరా హర నమోనమో
దైవత లోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమోనమో
నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో నమో

నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో
నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో
నారద హృదయ విహారి నమో నమో
నారద హృదయ విహారి నమో నమో
నారాయణ హరి నమో నమో నారాయణ హరి నమో నమో
పంకజ నయనా పన్నగ శయనా ఆ ఆ ఆఆఆఅ
పంకజనయనా పన్నగ శయనా
పంకజనయనా పన్నగ శయనా
శంకర వినుతా నమో నమో
శంకర వినుతా నమో నమో
నారాయణ హరి నమో నమో
నారాయణ హరి నారాయణ హరి నారాయణ హరి నమో నమో

జయ జయ మహాదేవ శంభో సదాశివా...ఆశ్రితమందారా శృతిశిఖర సంచారా...

జయ జయ మహాదేవ శంభో సదాశివా...
ఆశ్రితమందారా శృతిశిఖర సంచారా...

పల్లవి :

నీలకంధరా దేవా దీనబాంధవా రావా నన్నుగావరా 
నీలకంధరా దేవా దీనబాంధవా రావా నన్నుగావరా|
సత్యసుందరా స్వామీ నిత్యనిర్మలా పాహీ 
సత్యసుందరా స్వామీ నిత్యనిర్మలా పాహీ 
నీలకంధరా దేవా దీనబాంధవా రావా నన్నుగావరా 

చరణం 1

అన్యదైవము గొలువా...అఅఅఅఅఅ
అన్యదైవము గొలువా.. నీదుపాదము విడువా 
అన్యదైవము గొలువా.. నీదుపాదము విడువా
దర్శనమ్మునీరా మంగళాంగ గంగాధరా 
దర్శనమ్మునీరా మంగళాంగ గంగాధరా 
నీలకంధరా దేవా దీనబాంధవా రావా నన్నుగావరా 

చరణం 2

దేహియన వరములిడు దానగుణసీమా
పాహియన్నను ముక్తినిడు పరంధామా
నీయమమున నీ దివ్యనామ సంస్మరణా
ఏమారక చేయుదును భవతాపహరణా
నీ దయామయ దృష్టి దురితమ్ములార
వరసుధావృష్టి నా వాంఛలీడేరా
కరుణించు పరమేశ దరహాసభాసా
హరహర మహాదేవ కైలాసవాసా...
కైలాసవాసా

ఫాలలోచన నాదు మొరవిని
జాలిని పూనవయా
నాగభూషణ నన్ను కావగ
జాగును సేయకయా
ఫాలలోచన నాదు మొరవిని
జాలిని పూనవయా
నాగభూషణ నన్ను కావగ
జాగును సేయకయా
జాగును సేయకయా 
కన్నులనిండుగ భక్తవత్సల కావగ రావయ్యా 
కన్నులనిండుగ భక్తవత్సల కావగ రావయ్యా 
ప్రేమమీర నీదు భక్తుని మాటను నిల్పవయా 
ప్రేమమీర నీదు భక్తుని మాటను నిల్పవయా
శంకరా శివశంకరా అభయంకరా విజయంకరా 

ఫాలలోచన నాదు మొరవిని
జాలిని పూనవయా
నాగభూషణ నన్ను కావగ
జాగును సేయకయా
శంకరా శివశంకరా అభయంకరా విజయంకరా 
శంకరా శివశంకరా అభయంకరా విజయంకరా 
శంకరా శివశంకరా అభయంకరా విజయంకరా

కొలిచినందుకు నిన్ను కోదండరామాకొలిచినందుకు నిన్ను కోదండరామాకోటిదివ్వెల పాటి కొడుకువైనావా

పల్లవి:

అయ్యా... రావయ్యా...

కొలిచినందుకు నిన్ను కోదండరామా

కొలిచినందుకు నిన్ను కోదండరామా

కోటిదివ్వెల పాటి కొడుకువైనావా

తలచినందుకు నిన్ను దశరథ రామా

వెండికొండలసాటి తండ్రివైనావా

జయ రామా.. జగదభి రామా

పరంధామా.. పావన నామా

జయ రామా.. జగదభి రామా

పరంధామా.. పావన నామా

చరణం: 1

బుడిబుడి నడకల బుడతడవై.. ఒడిలో ఒదిగిన ఓ రయ్యా

బుడిబుడి నడకల బుడతడవై.. ఒడిలో ఒదిగిన ఓ రయ్యా

కలల పంటగా... బతుకు పండగా

కలల పంటగా... బతుకు పండగా

కల్యాణ రాముడిలా కదలి వచ్చావా

జయ రామా.. జగదభి రామా

పరంధామా.. పావన నామా

జయ రామా.. జగదభి రామా

పరంధామా.. పావన నామా

చరణం: 2

నడిచే నడవడి ఒరవడిగా... నలుగురు పొగడగా ఓరయ్యా

నడిచే నడవడి ఒరవడిగా... నలుగురు పొగడగా ఓరయ్యా

నీతికి పేరుగా... ఖ్యాతికి మారుగా

నీతికి పేరుగా... ఖ్యాతికి మారుగా

సాకేతరాముడిలా సాగిపోవయ్యా

జయ రామా.. జగదభి రామా

పరంధామా.. పావన నామా

జయ రామా.. జగదభి రామా

పరంధామా.. పావన నామా

చరణం: 3

ఎంతటి వాడోయ్... రామ చంద్రుడు

ఎంతటి వాడోయ్... రామ చంద్రుడు

ఆ తాటకిని చెండాడినాడోయ్... యాగమును కాపాడినా

డెంతటి వాడోయ్ రామ చంద్రుడు

ఓహో డెంతటి వాడోయ్ రామ చంద్రుడు

హొయ్ మిధిలకు వచ్చీ... రామయ్య రాముడు

శివునిల్లు విరిచీ.. రామయ్య రాముడు

ఓహో సీతను చేపట్టి.. రామయ్య రాముడు

హొయ్ హొయ్ సీతను చేపట్టి.. రామయ్య రాముడు

సీతారాముడు అయ్యేదెపుడు

జయ రామా.. జగదభి రామా

పరంధామా.. పావన నామా

జయ రామా.. జగదభి రామా

పరంధామా.. పావన నామా

వేయి శుభములు కలుగు నీకు పోయి రావే మరదలాప్రాణపదముగ పెంచుకొంటిమి నిను మరవగలేములే...వేయి శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా...

వేయి శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా
ప్రాణపదముగ పెంచుకొంటిమి నిను మరవగలేములే...
వేయి శుభములు కలుగు నీకు పోయి రావే మరదలా....

వాసుదేవుని చెల్లెలా... నీ ఆశయే ఫలియించెలే...
వాసుదేవుని చెల్లెలా... నీ ఆశయే ఫలియించెలే...
దేవదేవుల గెలువజాలిన బావయే పతి ఆయెలే...
వేయి శుభములు కలుగు నీకు... పోయి రావే మరదలా

భరతవంశము నేలవలసిన వీరపత్నివి నీవెలే
భరతవంశము నేలవలసిన వీరపత్నివి నీవెలే
వీరధీరకుమారమణితో మరల వత్తువుగానిలే...

వేయి శుభములు కలుగు నీకు... పోయి రావే మరదలా
ప్రాణపదముగ పెంచుకొంటిమి నిను మరవగలేములే...
వేయి శుభములు కలుగు నీకు... పోయి రావే మరదలా

బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే

బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే

బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే
ఎందుకే రాధా ఈశునసూయలు అందములందరి ఆనందములే
ఎందుకే రాధా ఈశునసూయలు అందములందరి ఆనందములే
బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే

పిల్లన గ్రోవిని పిలుపులు వింటే ఉల్లము ఝల్లున పొంగదటే
పిల్లన గ్రోవిని పిలుపులు వింటే ఉల్లము ఝల్లున పొంగదటే
రాగములో అనురాగము చిందిన జగమే ఊయల ఊగదటే
రాగములో అనురాగము చిందిన జగమే ఊయల ఊగదటే

బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే

రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే
రాసక్రీడల రమణుని గాంచిన ఆశలు మోశులు వేయవటే
ఎందుకే రాధా ఈశునసూయలు అందములందరి ఆనందములే

బృందావనమది అందరిదీ గోవిందుడు అందరి వాడేలే
గోవిందుడు అందరి వాడేలే

ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి

ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
ఇటుగా సాగాలి అని యేరు ఎవరినడగాలి 
కో అంటూ కబురు పెడితే రగిలే కొండ గాలి
వు అంటూ తరలి రాదా నింగే పొంగి పొరలి . 

ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
ఇటుగా సాగాలి అని యేరు ఎవరినడగాలి

హో హో…

తనలో చినుకే బరువై కారి మబ్బే వదిలిన
చెరలో కునుకు కరువై కల వారమే తరిమిన 
వనమే నన్ను తన వొడిలో అమ్మాయి పొదువుకున్నదని
పసిపాపల్లె కొమ్మలలో ఉయ్యాలూపుతున్నాడని
నెమ్మదిగా నా మది కి నమ్మకమందించేదెవరో. 

ఎవరో చూడాలి అని నాట్యమాడదే నెమలి
ఇటుగా సాగాలి అని యేరు ఎవరినడగాలి 

హోం వరసే కలిపే చాణువై నను తడిమే పూలతో
కనులే తుడిచే చెలిమై తల నిమిరి జాలితో
ఎపుడో కన్నా తీపి కల ఎదురవుతుంటే దీపికాలు 
శిలలో వున్నా శిల్ప కళా నడకే నేర్చుకున్నదిలా
దుందుడుకు ముందడుగు సంగతి అడిగే వారెవరో