Wednesday, 2 October 2024

ఈ పాదం పుణ్యపాదంఈ పాదం దివ్యపాదంఈ పాదం పుణ్యపాదంఈ పాదం దివ్యపాదం

ఈ పాదం పుణ్యపాదం
ఈ పాదం దివ్యపాదం
ఈ పాదం పుణ్యపాదం
ఈ పాదం దివ్యపాదం

ప్రణవమూలనాదం
ప్రధమలోక పాదం
ప్రణతులే చేయలేని ఈ ఈ
కరమేల ఈ కరమేల

ఈ పాదం పుణ్యపాదం
ధరణేళ్ళే ధర్మపాదం

మార్కండేయ రక్షపాదం
మహాపాదం ఆ ఆ
మార్కండేయ రక్షపాదం
మహాపాదం
భక్త కన్నప్ప కన్నా
పరమపాదం భాగ్యపాదం
భక్తకన్నప్ప కన్నా
పరమపాదం భాగ్యపాదం

ఆత్మలింగ స్వయంపూర్ణ ఆ
ఆత్మలింగ స్వయం పూర్ణుడే
సాక్షాత్కరించిన
చేయూతనీడిన అయ్యోఓ
అందని అనాథనైతి
మంజునాథ

ఈ పాదం పుణ్యపాదం
ధరనేలే ధర్మపాదం

ప్రణయమూలపాదం
ప్రణయ నాట్య పాదం
ప్రణతులే చేయలేని
ఈ ఈ శిరమెలా ఈ బ్రతుకెలా
ఈ పాదం పుణ్యపాదం
ధారణేళ్ళే ధర్మపాదం

భక్త సిరియాలు నేలిన
ప్రేమపాదం ఆ ఆహ్
భక్త సిరియాలు నేలిన
ప్రేమపాదం
బ్రహ్మవిష్ణులే
భజించే ఆది పాదం
అనాది పాదం
భ్రహ్మవిష్ణులే
భజించే ఆది పాదం
అనాది పాదం

అన్నదాత విశ్వనాధ
అన్నదాత విశ్వనాధుడే
లీలావినోదిగా నన్నెలాగా
దిగిరాగా అయ్యో
ఛీ పొమ్మంటినే
పాపినైతినే

ఈ పాదం పుణ్యపాదం
ఈ పాదం ధన్యపాదం

సకల ప్రాణ పాదం
సర్వమోక్ష పాదం
తెలుసుకోలేని నాయ్యీ
తెలివేల ఈ తనువేల

ఈ పాదం పుణ్యపాదం
ఈ పాదం దివ్య పాదం

ఆఆనందపరమానంద పరమానందఆఆనందపరమానంద పరమానంద

ఆఆనంద
పరమానంద పరమానంద
ఆఆనంద
పరమానంద పరమానంద

జగతి నీదే జన్మ నీదే
జగదానంద
ఆట నీదే పాట నీదే
ఆత్మానంద
నిసరి సరిగా మామరిస
నిసరిస దానిపమ గామారిసా

ఆనంద పరమానంద
పరమానంద

మాయల వలలోన
జీవుల బంధించి
మురియుట ఒక ఆట ధర్మనంద
ఎదలో గరళాన్ని మధురసుధగా
మార్చి నవ్వించుటొక
ఆట మోహనంద
పసి గణపతి ప్రాణం
తీయుట ఒక ఆట
పసి గణపతి ప్రాణం
తీయుట ఒక ఆట

ప్రాణదాత బ్రహ్మరథం
నీ మాయేరా
ఆది నీదే అంతూ నీదే
అమరానంద
నిసరి సరిగా మామరిస
నిసరిస దానిపమ గామారిసా

ఆనంద పరమానంద
పరమానంద

గంగను తలగాంచి
ధరణికి మళ్లించి
స్వర్గంగా మార్చావు మధురానంద
పుత్రుడ్ని కరుణించి
పున్నామ నరకాన్ని లేకుండా
చేస్తావు స్వర్గానంద

దాన ధర్మాల
ఫలితాలే పసివాళ్లు
దాన ధర్మాల
ఫలితాలే పసివాళ్లు
కన్నవాళ్ళ కర్మలేరా
పుణ్యనంద
కర్త నువ్వే
కర్మ నువ్వే కరుణానంద

నిసరి సరిగా మామరిస
నిసరిస దానిపమ గామారిసా

ఆనంద పరమానంద
పరమానంద పరమానంద పరమానంద

ఆ హ హ రుద్రా వీరభద్రకైలాసనా నీకుసుభిక్షం సుభిక్షంనిన్ను నమ్మిన భక్తులకిదుర్భిక్షం దుర్భిక్షం





ఆ హ హ రుద్రా వీరభద్ర
కైలాసనా నీకు
సుభిక్షం సుభిక్షం
నిన్ను నమ్మిన భక్తులకి
దుర్భిక్షం దుర్భిక్షం

రుద్రా ఏయ్ వీరభద్ర
ఈ నమ్మనివాడ
చేతచిక్కితే

నిన్ను
చిత్తూ చిత్తూ
చిత్తూ రుద్రా చిత్తూ
చిత్తూ చిత్తూ చిత్ర

ఓహో గరళకంఠా
నీ మాటంటే ఒళ్ళు మంటా
కన్నోళ్లే లేరంట
ఎట్టా పుట్టావో చెప్పమంటా
ఓహో గరళకంఠా
నీ మాటంటే ఒళ్ళు మంటా
కన్నోళ్లే లేరంట
ఎట్టా పుట్టావో చెప్పమంటా

దొంగ శివ భంగ శివ
దుష్ట శివ భ్రష్ట శివ
దొంగ శివ దొంగ శివ
భంగ శివ భంగ శివ
దుష్ట శివ దుష్ట శివ
భ్రష్ట శివ

హే ఈశ్వర సర్వ లోకేశ్వరా
గంగాధరా గౌరిధరా
శ్రీ మంజునాథ నమో

ఓహో గరళకంఠా
నీ మాటంటే ఒళ్ళు మంటా
కన్నోళ్లే లేరంటా
ఎట్టా పుట్టావో చెప్పమంట

ఓహో నుదుటే ఉన్నదంట
ధగ ధగ మండే ఒక కన్ను
ఈడ మగువ బతుకవుతుంది మన్ను

హే హే లయకార
జననం మరణం నీకొక
ఆట లీల డోలా లోల

ఓహో భూతనాథ నీ చేత
ఎందుకంత ఇంత బారు తిరుసులం
నిన్ను నమ్మినోడికి పోగాలం

హే హే త్రిగుణేశ త్రికాల
కారకమే ఆ సూలం
చుస్తే ధన్యం ధన్యం

బిల్వపత్రమంటే మోజా నీకు
రుద్రా అందులోనే పెట్టి
ముంచుతాను రారా రుద్రా
తిరుపమెత్తి తిరిగేతోడ
కాటి రుద్రా నీది
యోగం అసలు కానే కాదు
దొంగ నిద్ర

యోగేశ్వర సర్వలోకేశ్వర
సాకారుడా నిరాకారుడా
శ్రీ మంజునాథ నమో

ఓహో గరళకంఠా
నీ మాటంటే ఒళ్ళు మంటా
కన్నోళ్లే లేరంట
ఎట్టా పుట్టావో చెప్పమంటా

సకలం స్వాహా చేస్తావు
గుఱ్ఱకొట్టి కాట్లో
తొంగుతావు నువ్వు నిద్ర లేచేదేనాడు

హే చిత్రుపా
నువ్వే నిద్దుర లేచిన వేళా
అంతమే అనంతం

శవాగానా భూతగానా
వాసనలతో కులికేతోడ
నీతో పర్వతేట్ట ఉంటాడో
గంగ ఎంత మొత్తుకుంటా తెర్లుతుందో

హే నీలకాంత
హాలాహలమును బ్రోవెధవయ్య
తీయగా అమృతం

సూచి రుచి ఉన్న చోట ఉండవంటా
నీకు పచ్చిమద్య
మాంసాలంటే ఇష్టమంట
గణ గణ ఘంటా
కొడితే వాస్తవంట
ఇటు రా నిన్ను
విరిచి నంచుకుంటా

ఓహో గరళకంఠా
నీ మాటంటే ఒళ్ళు మంటా
కన్నోళ్లే లేరంట
ఎట్టా పుట్టావో చెప్పమంటా

దొంగ శివ భంగ శివ
దుష్ట శివ భ్రష్ట శివ
దొంగ శివ దొంగ శివ
భంగ శివ భంగ శివ
దుష్ట శివ దుష్ట శివ
భ్రష్ట శివ

ఓహో గరళకంఠా
నీ మాటంటే ఒళ్ళు మంటా
కన్నోళ్లే లేరంట
ఎట్టా పుట్టావో చెప్పమంట

హే ఈశ్వర సర్వ లోకేశ్వర
గంగాధర గౌరిధర
శ్రీ మంజునాథ నమో

ఒక్కడే ఒక్కడే మంజునాథుడు ఒక్కడేఒక్కడే ఒక్కడే మంజునాథుడు ఒక్కడేఒక్కడే ఒక్కడే మంజునాథుడు ఒక్కడే

ఒక్కడే ఒక్కడే మంజునాథుడు ఒక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాథుడు ఒక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాథుడు ఒక్కడే

శక్తికి రక్తికి ఒక్కడే
భక్తికి ముక్తికి ఒక్కడే
దిక్కోక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాథుడు ఒక్కడే

నువ్వు రాయివన్నాను లేనే లేవన్నాను
మంజునాథ మంజునాథ
గరిసించే మనసు ఉంటె నీలోనే ఉన్నానన్నావు
లోకాల దొర కాదు దొంగవని చాటాను
మంజునాథ మంజునాథ
నా పాపా రాసులన్నీ దొంగల్లె దోచుకు పోయావు

శిక్షకు రక్షకు ఒక్కడే
కర్తకు కర్మకు ఒక్కడే దిక్కోక్కడే
ఒక్కడే ఒక్కడే మంజునాథుడు ఒక్కడే

శంకర శంకర హర హర శంకర
మురహర భావహార శశిధర శుభకర
జయ జయ శంభో జయ జయ చంద్రధార
జయ జయ శంభో జయ జయ గంగాధర

నా ఆర్తి తీర్చావు నా దారి మార్చావు
మంజునాథ మంజునాథ
నా అహంకారాన్ని కాల్చి భస్మం చేసావు
నా కంటి దీపమల్లె కనిపించి వెళ్ళావు
మంజునాథ మంజునాథ
సుజ్ఞాన జ్యోతులను వెలిగించి కరుణించావు

దేవుడు జీవుడు ఒక్కడే
ధర్మమూ మర్మము ఒక్కడే హరుడొక్కడే

శంకర శంకర హర హర శంకర
మురహర భావహార శశిధర శుభకర
జయ జయ శంభో జయ జయ చంద్రధార
జయ జయ శంభో జయ జయ గంగాధర

మంజునాథ మంజునాథ మంజునాథ మంజునాథ
మంజునాథ మంజునాథ మంజునాథ మంజునా

ఓం మహాప్రాణ దీపం శివమ్ శివమ్మఃఓంకార రూపం శివమ్ శివమ్మహాసూర్య చంద్రాది నేత్రం పవిత్రంమహా ఘాడ తిమిరాంతకంసౌరగాత్రం

ఓం మహాప్రాణ దీపం శివమ్ శివమ్
మఃఓంకార రూపం శివమ్ శివమ్
మహాసూర్య చంద్రాది నేత్రం పవిత్రం
మహా ఘాడ తిమిరాంతకంసౌరగాత్రం

మహా కాంతి బీజం మహా దివ్య తేజం
భవాని సమేతం భజే మంజునాథమ్
ఓం ఓం ఓం
నమః శంకరాయచ మయస్కరాయచ
నమశ్శివాయచ శివతరాయచ
బావహారయాచా

మహాప్రాణ దీపం శివమ్ శివమ్
భజే మంజునాథమ్ శివమ్ శివమ్

అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం
హృదశహృదయంగమం
చతురుధాది సంగమం
పంచభూతాత్మకం శతశత్రునాశకం
సప్తాశ్వరేశ్వరం అష్టసిద్ధిశ్వరం
నవరసమానోహరం దశదిశసువిమలామ్

ఏకాదశోజ్వలం ఎకనాథేశ్వరం
ప్రస్తుతివ శంకరం
ప్రణత జన కింకరం
దుర్జనభయంకరం సజ్జనశుభంకరం
ప్రాణి భవతారకం ప్రకృతి హిత కరకం
భువన భవ్య భావదాయకం
భాగ్యాత్మకం రక్షకమ్

ఈశం సురేశం ఋషేశం పారేశేమ్
నటేశం గౌరీశం గణేశం భూతేశం
మహామధుర పంచాక్షరీ మంత్రం మార్షన్
మహా హర్ష వర్ష ప్రవర్షం సుశీర్షం

ఓం నమోహరాయచ స్వరాహారయాచా
పురహరాయచ రుద్రయచ భద్రయచ
ఇంద్రయచ నిత్యాయచ నిర్నిత్యయచ

మహాప్రాణ దీపం శివమ్ శివమ్
భజే మంజునాథమ్ శివమ్ శివమ్

దండండ దండండ
దండండ దండండ
దాన్కదినదా నవ
తాండవ డంబరం
తతిమ్మి తకధిమ్మీ దిధిమ్మీ
ధిమిధిమ్మీ సంగీత సాహిత్య
శుభ కమల భంభారం

ఓంకార ఘ్రిన్కర శృంగారా ఐనకర
మంత్ర బీజాక్షరం మంజునాథేశ్వరం
ఋగ్వేద మాంద్యం యజుర్వేద వైద్యం
సమ ప్రగీతమ్ అడ్తార్వప్రభాతం
పురాణేతిహాశం ప్రసిద్ధం విశుద్ధం
ప్రపంచాయికసూత్రం విరుద్ధం సుసిధం

నాకారం మకరం శిఖరం వికారం
ఎకరం నిరాకరసకరసరం
మహాకాలాకాలం మహా నీలకంఠం
మహానందనందం మహత్తట్టహాసం
ఝాటాఝటా రంగైక గంగ సుచిత్రం
జ్వాలాద్రుద్రనేత్రం సుమిత్రమ్ సుగోత్రం

మహాకాశంబ్యాసం మహాభానులింగం
మహాభర్త్రువర్ణం సువర్ణం ప్రవర్ణం

సౌరాష్ట్ర సుందరం సోమనాదీశ్వరం
శ్రీశైల మందిరం శ్రీ మల్లికార్జునం
ఉజ్జయిని పుర మహా కాలేశ్వరం
వైద్యనాథేశ్వరం మహా భీమేశ్వరం
అమర లింగేశ్వరం వామలిగేశ్వరం
కాశి విశ్వేశ్వరం పరం గ్రీష్మేశ్వరం
త్రయంబకదీశ్వరం నాగలింగేశ్వరం
శ్రీ కేదార లింగేశ్వరం

అగ్ని లింగాత్మకం జ్యోతి లింగాత్మకం
వాయు లింగాత్మకం ఆత్మ లింగాత్మకం
అఖిల లింగాత్మకం అగ్ని సోమాత్మకం

అనధిమ్ అమేయం అజేయం అచింత్యం
అమోఘం అపూర్వం అనంతం అఖండం
అనధిమ్ అమేయం అజేయం అచింత్యం
అమోఘం అపూర్వం అనంతం అఖండం

ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిమ్
ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిమ్
ధర్మస్థలక్షేత్ర వరపరంజ్యోతిమ్

ఓం నమః
సోమయాచ సౌమ్యయాచ
భవ్యయచ భాగ్యాయాచ
శాంతాయచ శౌర్యాయచ
యోగయచ భోగాయచ
కలయచ కాంతాయచ
రమ్యయచ గమ్యాయచ
ఈశాయచ శ్రీశాయచ
శర్వాయచ సర్వయచా

బ్రహ్మమురారి సురార్చిత లింగంనిర్మల భాసిత శోభిత లింగంజన్మజ దుఃఖ వినాశక లింగంతత్ప్రనమామి సదాశివ లింగం




బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మల భాసిత శోభిత లింగం
జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్ప్రనమామి సదాశివ లింగం

దేవా ముని ప్రవరార్చిత లింగం
కామ దహన కరుణాకర లింగం
రావణ దర్ప వినాశక లింగం
తత్ప్రనమామి సదాశివ లింగం

సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్దన కారన లింగం
సిద్ద సురాసుర వందిత లింగం
తత్ప్రనమామి సదాశివ లింగం

కనక మహామణి భూషిత లింగం
ఫణిపటివేష్టిత శోభిత లింగం
దక్షసు యజ్ఞ వినాశన లింగం
తత్ప్రనమామి సదాశివ లింగం

కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగం
సంచిత పాప వినాశన లింగం
తత్ప్రనమామి సదాశివ లింగం

దేవా గణార్చిత సేవిత లింగం
భావైర్భక్తిభి రేవచ లింగం
దినకర కోటి ప్రభాకర లింగం
తత్ప్రనమామి సదాశివ లింగం

అష్ట దళోపరివేష్టిత లింగం
సర్వ సముద్భవ కారణం లింగం
అష్ట దారిద్ర వినాశన లింగం
తత్ప్రనమామి సదాశివ లింగం

సుర గురు సుర వార పూజిత లింగం
సుర వాన పుష్ప సదార్చిత లింగం
పరమపదం పరమాత్మకు లింగం
తత్ప్రనమామి సదాశివ లింగం

లింగాష్టకమిదం పుణ్యం
యః పాతేచ్సివ సన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే

Tuesday, 1 October 2024

భగవద్గీత (18:66)లో శ్రీకృష్ణుడు అర్జునకు ఇచ్చిన ఉపదేశం అత్యంత గాఢమైనది మరియు పూర్తి సమర్పణను సూచిస్తుంది:

భగవద్గీత (18:66)లో శ్రీకృష్ణుడు అర్జునకు ఇచ్చిన ఉపదేశం అత్యంత గాఢమైనది మరియు పూర్తి సమర్పణను సూచిస్తుంది:

"సర్వ ధర్మాలను విడిచి నన్ను మాత్రమే శరణు పొందుము. నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తి చేస్తాను. భయపడవద్దు."

వాక్యం యొక్క విశ్లేషణ:

1. "సర్వ ధర్మాలను విడిచి": శ్రీకృష్ణుడు ఇక్కడ ధర్మాలను వదిలేయమని అంటున్నారు, కానీ దీని అర్థం సమాజంలో ఉన్న ఇతర విధి, కర్మలను పూర్తిగా వదలడం కాదు. ఇక్కడ "ధర్మ" అంటే బాహ్య కర్మ, శాస్త్రపరమైన విధులు, మరియు మనసు, మూర్ఖత్వానికి సంబంధించిన ఆచారాలను సూచిస్తుంది. ఇవన్నీ వదిలి, ఒక్క దైవంపైనే ఆధారపడమని చెప్పారు.


2. "నన్ను మాత్రమే శరణు పొందుము": ఇది భగవంతుని పైన పూర్తిగా విశ్వాసం పెట్టమని మరియు ఆయన శరణాగతుడిగా మారమని సూచిస్తుంది. భక్తుడు తమకున్న అన్ని బాధలు, కష్టాలు, కర్మ బంధాలు వదిలి, భగవంతుడి పైనే పూర్తి విశ్వాసంతో ఆధారపడాలి.


3. "నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తి చేస్తాను": భగవంతుని పట్ల పూర్తి భక్తితో శరణాగతి పొందినప్పుడు, మనం చేసిన అన్ని పాపాలు క్షమింపబడతాయి. ఇక్కడ శ్రీకృష్ణుడు భక్తులకు వాగ్దానం చేస్తున్నారు, "నేను నిన్ను అన్ని దోషాల నుండి విముక్తి చేస్తాను" అని.


4. "భయపడవద్దు": భక్తుడు భగవంతుడి పట్ల పూర్తి విశ్వాసం పెట్టినప్పుడు, భయం, సందేహం, లేదా అనిశ్చితి అనేవి ఉండవు. భగవంతుని దివ్య కృప నమ్మితే భక్తుడికి భయం నుండి విముక్తి లభిస్తుంది.



ప్రస్తుత కాలానికి అన్వయము:

ఈ శ్లోకాన్ని ప్రస్తుత కాలానికి అన్వయిస్తే, మన రోజువారీ జీవితంలో అనేక బాధలు, అనిశ్చితి, మరియు భయాలతో పోరాడుతున్నప్పుడు, దైవం పట్ల పూర్తి విశ్వాసంతో శరణాగతి పొందటం ద్వారా మనం ఆంతరంగిక శాంతిని పొందవచ్చు. మనలోని అహంకారం, స్వార్థం, మరియు ఇతర భౌతిక విషయాల పట్ల అతి ఆశలు వదిలి, భగవంతుడి పైనే ఆధారపడటం మనకు నిజమైన విముక్తిని మరియు శాంతిని ఇస్తుంది.