Saturday 16 December 2023

అడుగేస్తే కడాలయిన దారి ఇస్తుందిపిలిస్తే పొడి ఇసుకయినా నీరు ఇస్తుందిమానసిస్తే సిల అయినా ప్రేమిస్తుంది

అడుగేస్తే కడాలయిన దారి ఇస్తుంది
పిలిస్తే పొడి ఇసుకయినా నీరు ఇస్తుంది
మానసిస్తే సిల అయినా ప్రేమిస్తుంది

జంటను విడదేసే జగమెప్పుడు నిలిచింది

జంటను విడదేసే జగమెప్పుడు నిలిచింది
జన్మలు ముడి వేసే కథ ఎప్పుడు ముగిసింది
ప్రేమ బలం చెదరినిధి ప్రేమ రధం నిలవనిది

కత్తులు తీర్చనిది కారు చిచ్చులు మార్చనిది
గాలులు తుంచనిది జడి వానను ముంచనిది

ఆత్మ కి వున్న అన్ని లక్షణాల వున్న ప్రేమ
కృష్ణుడు అన్న గీతలో భావమే ప్రేమ

జంటను విడదేసే జగమెప్పుడు నిలిచింది
జన్మలు ముడి వేసే కథ ఎప్పుడు ముగిసింది
ప్రేమ బలం చెదరినిధి ప్రేమ రధం నిలవనిది

చితినయినా బతికించే అమృతమే కదా
ప్రేమించే మనసంటే ఓఓఓ
విధినాయిన ఎదిరించే నమ్మకమే రాధా
ఆ మనసే నీదయితే ఓ

అందుకే పద పద తెగించి ముందుకే సాగ ఎద తానుంచి
ఎందుకే కదా ఇదంతా సాగించి ఎందుకే వృధా వ్యధ భరించి

చూస్తూ కూర్చుంటే బతుకంతా బరువు కదా
బాధే బలమయితే ఎడబాటే బాట అవదా

కొండను ఎత్తు సత్తు వున్న అంత గనులు అయినా
జంట చిచ్చు అంటుకున్న మంట ఆపగలరా

జంటను విడదేసే జగమెప్పుడు నిలిచింది
జన్మలు ముడి వేసే కథ ఎప్పుడు ముగిసింది
ప్రేమ బలం చెదరినిధి ప్రేమ రధం నిలవనిది

నీకోసం జీవించే చెలిమి వెలుగవదా
నువ్వు సాగె దారుల్లో ఓఓఓ
నీ పేరే ధ్యానించే పిలుపే వినలేదా
నిను తాకే గాలులలో ఓఓఓ

ప్రాణమ నువ్వే ఎలా వేయిల్సి పోకుమా ఏటో ఆలా
జత అయినా పదమా నువ్వే ఎలా అసలయితే న్యాయ క్షణ క్షణం వినతి

ప్రేమ నావంటే కడ దాకా నీవుంటే
నిప్పే నీరవధ నిట్టూర్పే తూర్పవధ

అష్ట దిక్కులంటూ వోచి నిను ఆపగలవా
సప్త సాగరాలు ధాటి నన్ను చేరలేవా

జంటను విడదేసే జగమెప్పుడు నిలిచింది
జన్మలు ముడి వేసే కథ ఎప్పుడు ముగిసింది

ప్రేమ బలం చెదరినిధి ప్రేమ రధం ఆగనిది
ప్రేమ బలం చెదరినిధి ప్రేమ రధం నిలవనిది

జింక వేటకి సింహం ల వస్తాదాచుపెట్టిన సోత్థే కాజేస్తాదొంగ చేతికి తాళలందిస్తాతోచినట్లుగా దోచుకు పొమ్మంటా

జింక వేటకి సింహం ల వస్తా
దాచుపెట్టిన సోత్థే కాజేస్తా
దొంగ చేతికి తాళలందిస్తా
తోచినట్లుగా దోచుకు పొమ్మంటా

కోహినూర్ మని నిన్ను కోట దాటిస్తా
కాసుకో రమణి కనికట్టు చేసేస్తా
కొల్లగొట్టామని నిధులన్నీ చూపిస్త
కళ్ళు మూసుకొని వగలన్నీ వొలిచిస్తా

అడగాలా ఆగాలా

జింక వేటకి సింహం ల వస్తా
దొంగ చేతికి తాళలందిస్తా

కన్నె చెదిరేలా ఎదురైతే నీ కన్నె ఖజానా
నిన్నే వదిలేస్తే అది మగ జన్మేన
వెన్నె అదిరేలా చిటికేస్తే నే చితైపోనా
వెన్నాయి కరిగిస్తే ఒడిలో వాలన

చంద్రుడైనా చుక్కలనొదిలేసి
నాలా బందిపోటాయ్ రాడా నీకేసి
అందుకేగా బింకం వదిలేసి
నిన్నే అల్లుకున్న రాజి కోచేసి

కోహినూర్ మని నిన్ను కోట దాటిస్తా
కాసుకు రమణి కనికట్టు చేసేస్తా
కొల్లగొట్టామని నిధులన్నీ చూపిస్త
కళ్ళు మూసుకొని వగలన్నీ వొలిచిస్తా

అడగాలా ఆగాలా

జింక వేటకి సింహం ల వస్తా
దొంగ చేతికి తాళలందిస్తా

నానా హాయిరాన పడుతున్న ఈ ఏకాంతనా
నువ్వే కరుణిస్తే పరదా దాటనా
రానా దొరకూనా సుడిగాలి ఎదురేసుకుపోన
జంట కలిసొస్తే చెర విడిపించన

సాహసానికి సంతోషిస్తున్న
నీలో పౌరుషానికి పట్టం కడుతున్న
లోకమంతా ఎదురైవస్తున్న
నాతో తీసుకెళ్తా యుద్ధం చేసైనా

కొల్లగొట్టామని నిధులన్నీ చూపిస్త
కళ్ళు మూసుకొని వగలన్నీ వొలిచిస్తా
కోహినూర్ మని నిన్ను కోట దాటిస్తా
కాసుకు రమణి కనికట్టు చేసేస్తా

ఆగాలా అడగాలా

దొంగ చేతికి తాళలందిస్తా
తోచినట్లుగా దోచుకు పొమ్మంటా
జింక వేటకి సింహం ల వస్తా
దాచుపెట్టిన సోత్థే కాజేస్తా

కోహినూర్ మని నిన్ను కోట దాటిస్తా
కాసుకు రమణి కనికట్టు చేసేస్తా
కొల్లగొట్టామని నిధులన్నీ చూపిస్త
కళ్ళు మూసుకొని వగలన్నీ వొలిచిస్తా

అడగాలా ఆగాలా

జాంపండువెదోర జాంపండువెపూచెండువేమల్లె పూచెండువే



జాంపండువె
దోర జాంపండువె
పూచెండువే
మల్లె పూచెండువే

నీ పాల బుగ్గ
ఎర్రమొగ్గలేస్తే
నా మనసున తైతక్క
రవి చూడని
రవికని చూస్తే
నా వయసుకి తలతిక్క

జాంపండునే
దోర జాంపండునే
పూచెండునే
మల్లె పూచెండునే

ఊగింది ఊగింది
నా మనసు ఊగింది
నీ కంటి రెప్పల్లో
అవి ఏం చిటికెలో
అవి ఏం కిటుకులో

ఉరికింది ఉరికింది
నా వయసు ఉరికింది
నీ నడుము ఒంపుల్లో
అవి ఏం కులుకులో
అవి ఏం మెలికలో

ఇది పంచదార చిలక
అంచులని కొరక
మీదికొచ్చి వాలమాకా

ఓయ్ చందనాల చినుక
కుందనాల మొలక
కోకడాబు కొట్టమాకా

నువ్వే నేనుగా
తిరిగాం జంటగా
నిప్పే లేదుగా
రగిలాం మంటగా

జాంపండునే
దోర జాంపండునే
పూచెండువే
మల్లె పూచెండువే

వొళ్ళంత తుల్లింతై
చెమటెంత పడుతున్న
ఆ చెమట చేరనిచోటు
చూపించవే అది చూపించవే

కళ్లంత కవ్వింతై
ఓ వింత చెబుతున్న
ఆ చెమట చేరని చోటు
ఈ పెదవులే కొరికే పెదవులే

నువ్వు ఆడ సోకు చూపి
ఈడ కొంత దాచి
కుర్ర గుండె కోయమాకా

నన్ను కౌగిలింతలడగ
కచ్చికొద్దీ కోరగ
కన్నె సైగ కోరమాకా

మరుగే ఉందిగా
చొరవే చేయగా
తరుగేమ్ పోదుగా
వొడిలో చేరగా

జాంపండువె దోర
జాంపండువె
పూచెండువే
మల్లె పూచెండువే

నా పాల బుగ్గ
ఎర్రమొగ్గలేస్తే
నీ మనసున తైతక్క
రవి చూడని
రవికని చూస్తే
నీ వయసుకి తలతిక్క

జాంపండువె
దోర జాంపండువె
పూచెండువే
మల్లె పూచెండువే

గాలి చిరుగాలినిను చూసిందెవరమ్మావెళ్లే నీ దారిఅది ఎవరికి తెలుసమ్మా

గాలి చిరుగాలి
నిను చూసిందెవరమ్మా
వెళ్లే నీ దారి
అది ఎవరికి తెలుసమ్మా

రూపమే ఉండని
ఊపిరే నువ్వని
ఎన్నడూ ఆగని
పయనమే నీదని

గాలి చిరుగాలి
నిను చూసిందెవరమ్మా
వెళ్లే నీ దారి
అది ఎవరికి తెలుసమ్మా

కనురెప్ప మూసి ఉన్నా
నిదరొప్పుకోను అన్నా
నిను నిలువరించేనా
ఓ స్వప్నమా

అమవాసలెన్నైనా
గ్రహణాలు ఏవైనా
నీ కలను దోచేనా
ఓ చంద్రమా

తన ఒడిలో ఉన్నది
రాయో రత్నమో
పోల్చదు నేలమ్మా

ఉలి గాయం
చెయ్యకపోతే ఈ శిల
శిల్పం కాదమ్మా

మేలుకో మిత్రమా
గుండెలో జ్వాలలే
జ్యోతిగా మారగా
చీకటే దారిగా
వేకువే చేరదా

గాలి చిరుగాలి
నిను చూసిందెవరమ్మా
వెళ్లే నీ దారి
అది ఎవరికి తెలుసమ్మా

చలి కంచె కాపున్నా
పొగమంచు పొమ్మన్నా
నీ రాక ఆపేనా
వాసంతమా

ఏ కొండ రాళ్ళైనా
ఏ కోన ముల్లైనా
బెదిరేన నీ వానా
ఆషాడమా

మొలకెత్తే పచ్చని
ఆశే నీలో
ఉంటె చాలు సుమా

కలకాలం నిన్ను
అనచదు మన్ను
ఎదిగే విత్తనామా

సాగిపో నేస్తమా
నిత్యమూ తోడుగా
నమ్మకం ఉందిగా
ఓరిమే సాక్షిగా
ఓటమే ఓడగా

గాలి చిరుగాలి
నిను చూసిందెవరమ్మా
వెళ్లే నీ దారి
అది ఎవరికి తెలుసమ్మా

రూపమే ఉండని
ఊపిరే నువ్వని
ఎన్నడూ ఆగని
పయనమే నీదని

అమ్మో అమ్మాయేనాఎల్లోరా శిల్పమారంభ ఊర్వసికైనాఇంతందం సాధ్యమా

అమ్మో అమ్మాయేనా
ఎల్లోరా శిల్పమా
రంభ ఊర్వసికైనా
ఇంతందం సాధ్యమా

కనులారా నిన్ను చుస్తే
తెలిసిందే బ్రహ్మ కష్టం
ఇలలోనా నిన్ను మించే
సిరిలేదే నగ్న సత్యం

నాలో ఎదో సవ్వడి
ఏమో ఏమిటిది
ప్రేమో ఏమో ఏమిటో
నన్నే మార్చినది

అమ్మో అమ్మాయేనా
ఎల్లోరా శిల్పమా
రంభ ఊర్వసికైనా
ఇంతందం సాధ్యమా

నిషా కళ్ళతోటి
వలే వేయకమ్మ
అరే చిక్కుకోదా
ఎదే చేపలా

వయ్యారాల వైపు
అలా చూడకయ్యా
సిరే కందిపోదా
మరీ ఎర్రగా

నువ్వే కాని పువ్వు అయితే
నేను తుమ్మెద అవుత
నువ్వే కాలి మువ్వా అయితే
నేను రాగం అవుత

నిన్నే దాచుకుంటాలే
ప్రియా గుండె కోవెల్లోన

బాపు గీసిన బొమ్మకి
చెల్లివి నీవు చెలి
ప్రాణం పోసుకు వచ్చిన
పాటవు నీవు సఖి

అమ్మో అమ్మాయేనా
ఎల్లోరా శిల్పమా
రంభ ఊర్వసికైనా
ఇంతందం సాధ్యమా

ప్రియా నిన్ను చూసి
మదే మారిపోయే
అదేం మాయో గాని
వాన విల్లుగా

చెలి నిన్ను చేరి
ఎడారైన గాని
వసంతాలు జల్లే
పూల వెల్లువా

నువ్వే నిద్దరోతే నేను
జోల పాటనవుతా
నువ్వే దగ్గరైతే హాయి
లోన తేలిపోతా

చెలి నువ్వు అవునంటే
సరాగాల సంబరమవుతా

నువ్వు నేను ఏకమై
ఇపుడే మనమౌదాం
నింగీ నేలా సాక్షిగా
ఎపుడు ఒకటౌదాం

అమ్మో అమ్మాయేనా
ఎల్లోరా శిల్పమా
రంభ ఊర్వసికైనా
ఇంతందం సాధ్యమా

కలలోనా నిన్ను చూసి
మనసారా కోరుకున్న
ఇలలోనా ఇంతలోన
ఎదురైతే చేరుకున్నా

నాలో ఎదో సవ్వడి
ఏమో ఏమిటిది
ప్రేమో ఏమో ఏమిటో
నన్నే మార్చినది

మరమ రామ రామ రామ రామ రామ రామ అనే రాజమందిరంఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం

రామ రామ
రామ రామ
రామ రామ రామ
మరమ రామ రామ
మరమ రామ రామ రామ రామ రామ రామ అనే రాజమందిరం
ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం

రామ రామ రామ అనే రాజమందిరం
ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం
రాజమందిరం బాల రామ సుందరం
ముద్దు ముద్దు మాటలంటే ముద్దుగారి పోతాడంట
ఆపలేని అల్లరంతా తెప్ప తెప్ప తీయనంత
బలరాముని అల్లరి అంటే వశిష్టునికి ఇష్టమంటే
రామ రామ
మరమ రామ
మరమ రామ రామ అనే రాజమందిరం
ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం

బాణముతో గోడ మీద కోతి బొమ్మ గీస్తాడంట
వజ్రపుటుంగరం తీసి కాకి పైకి విసిరినంట
సిలికా ఎంగిలి జాం పండే కోరి మరి తింటాడంట
ఖర్జురాలు ద్రాక్షలు ఉడతలకే పెడతాడంట
దాక్కుంటాడంట చెట్టు సాటుకెళ్ళి
రాళ్ళేస్తాడంట సెరువులోన మల్లి
అమ్మ నాన్న అంట ఆ అల్లరి మెచ్చుకొని
బాల రాముని భలే అని ముద్దులు పెట్టారంట
రామ రామ
మరమ రామ
మరమ రామ రామ అనే రాజమందిరం
ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం

పాల బువ్వ తినమంటే మీద పైకి పరుగులంటా
పసిడి బిందెలోని పన్నీరు ఒలకబోస్తాడంట
చందమామ కావాలని సందె కదా గొడవంట
అద్దములో చూపిస్తే సంచిలోన దాసీనంట
శ్రీ రాముడయినా చినప్పుడూ ఇంతె
ఆకాశమంటే అల్లరి చేసాడంట
అమ్మ నాన్న అన్ని మాకు నువ్వే కదా అమ్మ
ఎప్పుడు ఇంకా హద్దులు మీరం
తప్పుని మన్నించమ్మ

రామ రామ రామ అనే రాజమందిరం
ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం
రాజమందిరం బాల రామ సుందరం
ముద్దు ముద్దు మాటలంటే ముద్దుగారి పోతాడంట
ఆపలేని అల్లరంతా తెప్ప తెప్ప తీయనంట
బలరాముని అల్లరి అంటే వశిష్టునికి ఇష్టమంటే
రామ రామ
మరమ రామ
మరమ రామ రామ అనే రాజమందిరం
ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం