నమశ్శివాయ మన ఛానెల్ పెట్టిన ఇన్ని సంవత్సరాల్లో చాలా మంది అడిగిన ప్రశ్నలు దశావతారాలకు సంబంధించినవి. ఎన్ని ప్రశ్నలు అడిగారు. ఈరోజు వీడియోలో మనం దశావతారాల గురించి పూర్తిగా చెప్పుకుందాం. మీకు తెలియని ఎన్నో విషయాలు ఉంటాయి. ఈ వీడియో దశావతారాలకి ఎన్సైక్లోపీడియా లాంటిది. అందుకని కొంచెం పెద్ద వీడియో ఒక 25 నిమిషాలు, అరగంట పడుతుంది. ఓపికగా చూడండి. మీరు ఒక ప్రవచనం ఎలా వింటారో అలా వింటే గనుక మీకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. సరే మొట్టమొదట జనాలు అడిగినవి బోలెడు ప్రశ్నలు ఉన్నాయి గాని మీకు ఒక నాలుగు ఐదు చెప్తాను. మీకు అర్థమవుతుంది ఎంత లాజికల్ ప్రశ్నలో. మొట్టమొదటి ప్రశ్న ఏమిటంటే కూర్మావతారంలో దేవదానవులు ఇద్దరూ కలిసి క్షీరసాగరాన్ని మదించారు కదా? అందులో రాక్షసులకి అధిపతి ఎవరు? బలిచక్రవర్తి. అంటే కూర్మావతారంలో బలిచక్రవర్తి ఉన్నాడు. బలిచక్రవర్తి ఎవరి మనవడు? ప్రహ్లాదుడి మనవడు అంతే కదా? ప్రహ్లాదుడు ఎప్పుడు వచ్చాడు? నరసింహావతారంలో వచ్చాడు. అంటే కూర్మావతారంలో మనవడు నరసింహావతారంలో తాతగారట. ఎలా సాధ్యమండీ అది?
లాజికల్‌గా ఆలోచించండి. ఇంకొక ప్రశ్న అడుగుతూ ఉంటారు అందరు. అంటే హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో పడేశాడట. పడేస్తే వరాహస్వామి రక్షించాడట. ఇది ఎంత ఇల్లాలజికల్ అండి. సముద్రం ఉన్నదే భూమి పైన కదా. భూమిని తీసుకెళ్లి సముద్రంలో ఎలా పడేస్తాడు. ఏమిటండీ ఈ పురాణ కథలని? పుక్కిట పురాణాలు అని. ఇంకో ప్రశ్న అడుగుతూ ఉంటారు. ఇవన్నీ లాజికల్ క్వశ్చన్స్. చాలా జాగ్రత్తగా వినండి. మీకు నచ్చుతాయి. ఇంక అడిగే ప్రశ్న ఏమిటంటే, క్షీరసాగర మధనంలో ఐరావతం వచ్చిందని అందరికీ తెలుసు కదా? దానికి ముందు ఒక కథ జరిగింది. దుర్వాస మహర్షి ఒక దండ తీసుకొచ్చిస్తే ఇంద్రుడు అది ఐరావతం మీద వేశాడు. దాంతో ఐరావతం తొక్కేసింది. అదేమిటండీ ముందు ఐరావతం ఉంటే క్షీరసాగరంలో నుంచి రావడం ఏమిటండి? ముందు వచ్చిందా? తర్వాత వచ్చిందా? ఏ ఆర్డర్ కరెక్ట్? భాగం వెంకటేశ్వర స్వరూపం విష్ణుమూర్తి యొక్క బెస్ట్ అవతారం. మరి ఎక్కడ దశావతారాల్లో కనిపించదే? మోహిని విష్ణుమూర్తి అవతారం. ఎక్కడ దశావతారాల్లో ఉన్నది? ఏమిటండీ ఇదంతా? బుద్ధుడు అసలు విష్ణుమూర్తి అవతారమేనా? ఇంకా బలరాముడు విష్ణుమూర్తి అవతారం అని కొంతమంది అంటారు, ఆదిశేషుడి అంశ అని కొంతమంది అంటారు. ఇలాగా ఎన్ని ప్రశ్నలు? ఇంక ఆఖరిగా అందరూ అడిగే ప్రశ్న అయితే గనుక అండి డార్విన్ థియరీ హ్యూమన్ ఎవల్యూషన్ ఉంది కదా? దానికి దశావతారాలకి నిజంగా సంబంధం ఉందా? అని ఇలాంటివి ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నారు చూడండి. మీకు కొన్ని ప్రశ్నలు చెప్తేనే ఒక రెండు నిమిషాలు పట్టింది అంతే కదా? అయితే ఈ వీడియో చూడండి మొత్తం మీకు ఫుల్ నాలెడ్జి వచ్చేస్తుంది. ఇంక ఇలాంటి ప్రశ్నలు రావు. సరే మొట్టమొదట ముఖ్యమైన విషయం ఏమిటంటే విష్ణుమూర్తివి దశావతారాలు కాదు. 24 అవతారాలు ఉన్నాయి. మరి ఈ దశావతారాలనే కాన్సెప్ట్ ఎక్కడ నుంచి వచ్చిందంటే మీకు ఆఖరిలో అర్థమయ్యేలా చెప్తా. మొట్టమొదట 24 అవతారాలు ఏమిటో చూద్దాం. అవి భాగవతంలో వర్ణించారు. అలాగనే ఇప్పుడు నేను చెప్పేది కూడా వరుసక్రమం కాదు. అవతారాలు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క కల్పంలో ఎప్పుడెప్పుడో జరిగినవి. మొట్టమొదట మీకు ఆ పట్టిక చెప్తాను. చెప్పే ముందు చాలా జాగ్రత్తగా వినండి ఒక్క పాయింట్. ఇది అర్థమైతేనే మీకు అవతారాలు అర్థమవుతాయి. ఈ అవతారాలు అంటే విష్ణుమూర్తి ఆ ఏదో స్వరూపం తీసుకొని అలా కిందకి వచ్చేసాడు అనుకుంటాం. కాదు. ప్రకృతిలో ఒక ప్రిన్సిపుల్ ఉంటుంది. ఆ ప్రిన్సిపుల్‌ని ప్రూవ్ చేయడానికో లేకపోతే మనకు అందించడానికో ఆ స్వరూపం తీసుకొచ్చింది ఆ అవతారం. అంటే ఈ ప్రిన్సిపుల్స్ అన్నీ ప్రకృతిలో ముందే ఉన్నాయి. స్వామి అవి మనకు అందించడానికి వేరే వేరే అవతారాల్లో వచ్చారు. ఈ కాన్సెప్ట్ అర్థమైతే మీకు అప్పుడు అవతారాలు ఏమిటి అనేది అర్థమవుతాయి. సరే ఇప్పుడు 24 ఇట్లల్లో అన్ని క్లుప్తంగా చెప్పుకుందాం. నేను ఈ వీడియోలో విస్తారంగా చెప్పను. అవి తర్వాత ఎప్పుడైనా చెప్తా మీకు క్లుప్తంగా చెప్పేస్తాను. మొట్టమొదటి అవతారం సనక సనందన సనత్కుమార సనత్సుజాతులు. వాళ్ళ నలుగురు రూపంలో విష్ణుమూర్తి వచ్చారు. వాళ్ళు కౌమార దశలో వచ్చారంటే యవ్వనం కన్నా ముందున్న దశ అన్నమాట. బ్రహ్మచర్యం అవలంబించారు. ఎందుకు ఆ అవతారం వచ్చిందండి దుష్ట శిక్షణ కా అంటే కాదు. ఆత్మతత్వం అనేది మరుగుబడిపోయింది. దాన్ని ఉద్దరించే కర్తవ్యం కోసం స్వామి వచ్చిన అవతారాలు అవి. అందులో అందరి పేర్లు చూడండి సనా సనా సనా అని ఉన్నాయి కదా. ఆ సనా అంటే ప్రేమ అని అర్థం. ఆ ప్రేమ తత్వాన్ని అందించడానికి భగవంతుడు ఆ స్వరూపంలో దిగి వచ్చాడు. అది మొట్టమొదటి అవతారం.
రెండో అవతారమే యజ్ఞవరాహావతారం. సామాన్యంగా అందరూ మత్స్యావతారం మొట్టమొదటిది అనుకుంటారు కాదు. మొట్టమొదట వచ్చింది మనకు తెలిసిన అవతారాల్లో వరాహావతారం వచ్చింది. ఆయన ఏం చేశాడంటే నీళ్ళల్లో పడిపోయిన పృధ్విని భూమిని ఉద్ధరించి బయటికి తీసుకొచ్చారు. ఇక్కడే మనకు ఒక సందేహం వస్తుంది. ఏమిటండీ సముద్రం ఉండేదే భూమి పైన. భూమిని తీసుకెళ్లి సముద్రంలో ఎలా పడేశాడు? ఇది కాంట్రాడిక్టరీగా లేదా అని. చాలా జాగ్రత్తగా వినండి తత్వం. వేదం ఏం చెప్తుందంటే తైత్తరీయోపనిషత్తులో మొత్తం సృష్టి గురించి చెప్పారు. చాలా అద్భుతంగా ఉంటుంది తైత్తరీయోపనిషత్తు అర్థం చేసుకుని చదివితే. అందులో అంటారు. ఆకాశాద్వాయుహు, వాయోరగ్నిహి, అగ్నేరాపహ, అభ్యఃపృధివి, పృధివ్యా ఓషధయః, ఓషధీభ్యో అన్నం అన్నాత్పురుషః అని స్టేజెస్ లో సృష్టి ఎలా జరిగింది అని చెప్తే మొట్టమొదట ఆకాశం, స్పేస్ ఉందట. దాంట్లోంచి వాయువు అనే ఎలిమెంట్ అప్పుడు పుట్టింది. ఆ తర్వాత వాయువు అనే ఎలిమెంట్‌లో నుంచి అగ్ని పుట్టింది. అగ్నిలోంచి నీరు పుట్టింది. నీరులోంచి పృధివి పుట్టింది. సృష్టి ఈ క్రమంలో జరిగింది అని వేదం చెప్పింది. అయితే పృధ్వి అనే సాలిడ్ ఫామ్ కు వచ్చేందుకు ముందున్న ఫామ్ ఏమిటి? జలం అంతే కదా? ఇప్పుడు హిరణ్యాక్షుడు చేసిన పని ఏమిటి అంటే పృధ్వి అస్తిత్వంలోకి వస్తే ఆ ముందున్న స్టేట్లోంచి నెక్స్ట్ స్టేట్ లోకి వస్తే దీన్ని మళ్ళీ బలవంతంగా వెనక్కి పంపించేశాడు. అంటే సృష్టిని రివర్స్ చేయడానికి ప్రయత్నించాడు. అప్పుడు స్వామి వాడిని సంహరించి మళ్ళీ ఆ జలం అనే ఫామ్ లో ఉన్న దాంట్లోంచి మళ్ళీ భూమి అన్న దాన్ని మెటీరియలైజ్ చేశాడు. ఇది జరిగింది. అందుకే ఇవన్నీ జరిగినవి ఇక్కడ గ్లోబ్ మీద కాదు. బియాండ్ దిస్ ఎక్కడో జరిగినవి తప్ప ఇక్కడ భూమి మీద జరిగిన విషయాలు కాదు ఇవి. సరే ఇప్పుడు మూడో అవతారం ఏమిటి అంటే నారద మహర్షి అవతారం. నారద మహర్షి కూడా విష్ణుమూర్తి యొక్క ఒక అవతారం. ఏమిటండీ ఆ అవతారం యొక్క పర్పస్ అంటే నారాయణుడి తంత్రం ఉంది కదా విష్ణుతంత్రం. తంత్రం అంటే మళ్ళీ ఏదో హాంఫట్ హ్రీంఫట్ అనుకోకండి. తంత్రం అంటే టెక్నాలజీ అని అర్థం. సామాన్యంగా ఎవరైనా తంత్రం ఏదో వారాహి తంత్రం అనగానే అయ్యబాబోయ్ ఏదో అయిపోయింది అనుకుంటారు. తంత్రం అంటే టెక్నాలజీ అని అర్థం. అలాగే విష్ణు తంత్రం ఏదైతే ఉందో విష్ణుమూర్తి యొక్క టెక్నాలజీ దాన్ని తీసుకొచ్చి భూమ్మీద జీవులకి ఇవ్వడమే నారద మహర్షి యొక్క అవతార లక్ష్యం. అంటే అబ్స్ట్రాక్ట్ విష్ణు శక్తి ఉంది కదా? దాన్ని మనందరికీ చేరవేయడం. అందుకే చూడండి సత్యనారాయణ స్వామి వ్రతం అనేది ఎవరి ద్వారా వచ్చింది అంటే నారద మహర్షి ద్వారా వచ్చింది. అలాగనే వ్యాసమహర్షి నుంచి భాగవతం ఎవరి ద్వారా వచ్చింది అంటే నారద మహర్షే వెళ్లి వ్యాసమహర్షి చేత రాయించారు కదా? ఇది నారదావతారం యొక్క పర్పస్. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోండి. అంతోటి విష్ణు అవతారమైన నారదుడిని మన తెలుగు సినిమాల్లో వెకిలి వెకిలి వేషాలకి, వెకిలి జోకులకి ఉపయోగిస్తుంటే, కొన్నిచోట్ల ఉమనేజర్ అన్నట్టు చాలా అసహ్యంగా చూపిస్తుంటే మనం అందరం పళ్ళు ఇకిలించుకొని చప్పట్లు కొట్టి ఆ సినిమాలన్నిటిని వంద రోజులు ఆడిస్తున్నాం. ప్రశ్నించలేము మనం. అది కదా హిందుత్వం అంటే? నారాయణుడి అవతారమైన నారదుడిని అంత లేకిగా చూపిస్తారా? ఎంత పొరపాటు అది? ఈసారైనా ఎవరైనా అలా చేస్తే ప్రశ్నించడం ప్రారంభించండి. ఈ పౌరాణిక క్యారెక్టర్స్ అన్నీ కూడా హాస్యం సృష్టించుకోవడానికి కాదు. హాస్యం సృష్టించుకోవాలనుకుంటే ఆ డైరెక్టర్ని ఒక వేషం వేసుకుని అక్కడే కామెడీ చేయమనండి. అంతేకాని పురాణ పాత్రలతో చేయకూడదు. మనం అది ఊరుకోకూడదు కూడా. సరేలేండి ఇంక నాలుగో అవతారమే నరనారాయణుల అవతారం. లోక కళ్యాణం కోసం తపస్సు అనేది ఎలా చేయాలో ఆ కాన్సెప్ట్ ఆ ప్రిన్సిపుల్‌ని లోకానికి ఇవ్వడానికి వచ్చిన అవతారమే నరనారాయణులు అన్నమాట. అంటే తపస్సు అనే ప్రిన్సిపుల్ నేను ఇందాక చెప్పినట్టు సృష్టిలో ఉంది. అది మనకు అందజేసిన అవతారమే నరనారాయణులు. ఇంకా వాళ్ళ గురించి చాలా చెప్పుకోవాలి గాని నేను చెప్పినట్టు ఇది డిటైల్డ్ వీడియో తర్వాత చేసుకుందాం. సరే ఐదో అవతారం ఏమిటి అంటే కపిల మహర్షి అవతారం. కర్దముడికి దేవహూతికి జన్మించిన స్వామి ఆ రూపంలో ఎందుకు వచ్చాడు నారాయణుడు అంటే సాంఖ్య శాస్త్రం అనేది సృష్టిలో తత్వాల్ని బోధించడం. సృష్టిలో ఇన్ని తత్వాలు ఉన్నాయి కదా? ఆ బోధించే సాంఖ్య శాస్త్రం లుప్తం అయిపోయింది అప్పటికి. అందుకని ఈ స్వరూపంలో వచ్చి ఆ శాస్త్రాన్ని ఆసురీ అనే ఒక బ్రాహ్మణుడికి ఉపదేశించాడు. అసలు కపిల మహర్షి బోధ వింటే భక్తి పోతుంది. మనకు జువాలజీలో ఎంబ్రియాలజీ అని ఉంటుంది కదా? అది డాక్టర్లు ఎంతో స్కానింగులు చేసి ఇవన్నీ చేసి ఆ పిండోత్పత్తి గురించి మనకు జువాలజీలో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంతే కదా? ఇప్పుడు ఈ కపిల మహర్షి అవతారం కొన్ని లక్షల సంవత్సరాల క్రితం వచ్చింది. మీరు ఒకసారి భాగవతం తీసి చదవండి ఆయన చెప్పింది. ఆ ఎంబ్రియాలజీ ఏయ్ మోడరన్ సైంటిస్టు చెప్పనంత గొప్పగా చెప్పారు. ఇంకా సైంటిస్టులు ఆ ఫామ్ ఎలా ఉందో స్కాన్ చేస్తారు. ఈయన బియాండ్ దట్ వెళ్లి ఆత్మ అనేది ఎప్పుడు వచ్చి అందులో కూర్చుంటుంది ఆ పిండంలో అవన్నీ కూడా చెప్పారు. అసలు మైండ్ బ్లోయింగ్ సైన్స్ అది. అది విష్ణు అవతారం. వస్తే ఆ స్థాయిలో ఉంటుంది. ఇంకా ఆరవ అవతారం దత్తాత్రేయ స్వామి. అత్రి మహర్షికి అనసూయాదేవికి జన్మించారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్త్యాత్మకుడైన రూపంలో వచ్చాడు స్వామి. నాబోటి వాళ్ళకి ఆరాధ్య దైవం. నా లాగా దత్తోపాసన చేసుకునే వాళ్ళకు అసలు ఆ స్వామి పటం చూస్తేనే మనస్సు పొంగిపోతుంది. అలాగనే అవధూత స్వరూపం అంటే ఏమిటి అనేది ప్రపంచానికి అందించింది దత్తాత్రేయ రూపం. స్వామి వచ్చిన ముఖ్యమైన ప్రణాళిక ఏమిటి అంటే మనలోను భగవంతుడు ఆత్మ స్వరూపంలో ఉంటాడు కదా? అది తెలుసుకోవడమే ఆత్మవిద్య అంటారు. ఆ ఆత్మవిద్యని ఉపదేశం కింద ఇచ్చాడు. అంటే ప్రకృతిలో ఆత్మవిద్య అనే సైన్స్ ఉంది. ఆ ప్రిన్సిపుల్‌ని ఉపదేశంగా మొదలుపెట్టింది దత్తాత్రేయ స్వామి. అందుకని వచ్చింది ఆ అవతారం. చూడండి మనం సామాన్యంగా అవతారాలు అంటే ఏవో రాక్షస సంహారం చేస్తారు అనుకుంటాం. వీళ్ళందరూ కూడా ప్రకృతిలో ఉన్న ప్రిన్సిపుల్స్‌ని మనకు అందివ్వడానికి వచ్చినవి రూపాలు. ఇంక ఏడో అవతారం యజ్ఞుడు అని పిలుస్తారు. ఇందులో కొన్ని అవతారాల పేర్లు కూడా తెలీవు మనకి. ఆయన రుచి ప్రజాపతికి ఆకూతికి జన్మించాడు అన్నమాట. ఆయన ఏం చేశాడంటే స్వాయంభువ మన్వంతరం ఉంది కదా? అసలు ఆ మన్వంతరాన్ని ఉద్ధరించింది, రక్షించింది ఆయన. ఆయన చేసిన మెయిన్ పని ఏమిటి అంటే ప్రకృతిలో అప్పటిదాకా డివిజన్ ఆఫ్ టైమ్ అనేది లేదు. ఆయన దగ్గర నుంచే ఆ డివిజన్ ఆఫ్ టైమ్ అంటే మన్వంతరాలు, మనువులు, కల్పాలు అలా మొదలై ఇప్పుడు మన సంవత్సరాలు, నెలలు, ఋతువులు వీటిల వరకు వచ్చింది కదా. ఆ డివిజన్ ఆఫ్ టైమ్ మొదలైంది యజ్ఞుడు అనే ఆయన దగ్గర. ఆ రూపం అందుకోసం వచ్చింది. అంటే దీనికి ముందు అవతారాలన్నీ కూడా కాలం అనేది పుట్టకముందే ఉన్నాయి. ఇక్కడ నుంచి కాలం అనేది ఫామ్ అయింది. ఆ తర్వాత ఎనిమిదో అవతారం ఋషభయోగి. ఆయన్నే ఉరుక్రముడు అని కూడా పిలుస్తారు భాగవతంలోను. ఆయన ఎందుకు వచ్చారు అంటే పరమహంసలు అనే వాళ్ళు ఎలా ఉంటారు అనేది ఆయన ఆచరించి చూపించారు. మీరు రమణ మహర్షి జీవితం గాని ఇలాంటి మహనీయుల జీవితాలు ఏవైనా చూడండి. అవన్నీ ఋషభయోగి దగ్గర నుంచి భూమి మీదకు వచ్చినవి. అచ్చం అలాగే ఉంటుంది రమణ మహర్షి జీవితం చూస్తే. ఇంక తొమ్మిదో స్వరూపం హయగ్రీవ అవతారం. ప్రకృతిలో ఉన్న జ్ఞానం అనే ప్రిన్సిపుల్‌ని మనకు అందించడానికి వచ్చింది హయగ్రీవ స్వామి. ఇంక దానిలో మీకు చాలా విస్తారంగా స్వామి గురించి చెప్పాను కాబట్టి ఇప్పుడు చెప్పట్లేదు.
పదో అవతారం ఏమిటి అంటే పృధుచక్రవర్తి అనే ఆ రూపంలో వచ్చాడు స్వామి. వచ్చి భూమిని ఒక ఆవు కింద చేసి ఓషధులన్నిటిని ఆవు నుంచి పితికాడు ఆయన. అంటే భూమిపైన ఖనిజాలు, వృక్షాలు, ఈ పరిణామం, ఇదంతా ప్రకృతిలో అక్కడి నుంచి ప్రారంభమైంది. దీనికి ముందు గ్రహశక్తులు ఉన్నాయి గాని గ్రహగోళాలు లేవు. మనం కొన్ని కొన్ని సార్లు గ్రహాలకు సంబంధించి చంద్రుడు నవ్వేడు, సూర్యుడు ఇలా చేశాడంటే ఏమిటండీ చంద్రుడు ఎక్కడ నవ్వుతాడు? మూన్ అనుకుంటాం. ఆ గోళాలవన్నీ కూడా దీని తర్వాత ఫామ్ అయ్యాయి. దీనికి ముందు గ్రహ శక్తులన్నీ శక్తుల రూపంలోనే ఉండేవి. అందుకే పృధు అంటే అర్థం వృద్ధి పొందించేవాడు అని. ఇంక 11వ అవతారం ఏమిటి అంటే మనం ఎప్పుడు మొట్టమొదటి అవతారం అనుకునేది ఏమిటది? మత్స్యావతారం. చాక్షుషీ మన్వంతరంలో చివర్లో భూమి మొత్తం జలమయం అయిపోతుంది. ఇందాక నేను చెప్పాను కదా? భూమికి ముందున్న ఫేజ్ జలం అనేది ఆ తర్వాత దాని నుంచి భూమి అనేది వస్తుంది. మళ్ళీ ప్రళయం వచ్చినప్పుడు ఆ ముందు ఫేజ్ లోకి ఇంకా ముందు ఫేజ్ లోకి అలా వెళ్ళిపోతుంది. చాక్షుషీ మన్వంతరంలో భూమి ఆ ముందు ఫేజ్ లోకి వెళ్ళిపోతూ ఉంటే ఈ భూమ్మీద సీడ్ అంతా తీసుకుని తర్వాత వైవస్వత మన్వంతరానికి అందించడానికి వచ్చిన అవతారమే మత్స్యావతారం. అక్కడే ఆయన స్వామి ఏం చేశాడంటే ఆ సీడ్ మొత్తం తీసుకున్నాడు. మనకు మత్స్యావతారం కథలో చాలా విచిత్రంగా ఒక పడవలోకి అన్నీ ఎక్కించారు అని ఉంటుంది కదా? అది ఆ సీడ్ని ప్రిజర్వ్ చేయడం. అలాగనే వేద విద్యని నాశనం చేసిన అసురుణ్ణి సంహరించాడు. అదేమిటండీ అంటే వేదం అనేది సృష్టి యొక్క మాన్యువల్. అది కూడా ఒక ఆసురీ శక్తికి చిక్కితే దాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చాడు అన్నమాట స్వామి అది. ఇది 11వ అవతారం మొదటిది కాదు. ఇంక 12వది కూర్మావతారం. దేవదానవులు క్షీరసాగరం చేశారు. చేస్తే మందరం మునిగిపోతుంటే స్వామి వీపు మీద మోశాడు. ఆ సమయంలోనే ఇంకొక రెండు అవతారాలు కూడా వచ్చాయి కూర్మావతారంతో పాటు. అవి ఏమిటో చెప్తాను మీకు. కాకపోతే అందరూ అడిగే ప్రశ్నకు ఇప్పుడు సమాధానం చెప్పుకుందాం. ఇందాక నేను చెప్పాను కదా దుర్వాస మహర్షి దండిస్తే ఇంద్రుడు ఐరావతం మీద వేస్తే తొొక్కేసిందిట. అందుకు అని క్షీరసాగర మధనం చేశారు. ఇంద్రుడి సంపద అంతా కోల్పోయాడు అని. అప్పుడు మళ్ళీ ఐరావతం వచ్చింది. ఏమిటండీ ఈ రెండిటికీ ఎక్కడైనా పొంతన ఉందా అంటే గుర్తుపెట్టుకోండి. దానికి ముందే అప్సరసలు, లక్ష్మీదేవి, చంద్రుడు, ఐరావతం అన్నీ ఉన్నాయి. కానీ ఇంద్రుడు అహంకారంతో చేసిన తప్పు వల్ల అవన్నీ అవ్యక్తంలోకి వెళ్ళిపోయాయి. లక్ష్మీదేవి కూడా కనిపించకుండా వెళ్ళిపోయింది. అప్పుడు బుద్ధుడిచ్చి మళ్ళీ క్షీరసాగర మధనం చేసి కష్టపడితే అప్పుడు అవన్నీ మళ్ళీ వ్యక్తంలోకి వచ్చాయి. అందుకే ఆ కథల్లో మీకు అలా అనిపిస్తుంది. ఇదేమిటండీ కాంట్రాడిక్టరీగా ఉంది కదా అనుకోకూడదు. అర్థం చేసుకుంటే ఆ తత్వం అప్పుడు తెలుస్తుంది. సరే ఇంక 13వ అవతారం ఈ క్షీరసాగర మధనం అప్పుడే ధన్వంతరి అనే అవతారంలో స్వామి వచ్చాడు. వచ్చి ధన్వంతరి ఎందుకు వచ్చింది అంటే ప్రిన్సిపుల్ ఒకటెమో మనం అమృత పాత్రతో వచ్చాడు స్వామి అనుకుంటాం. ఆయుర్వేదాన్ని ఇచ్చాడు అని. ప్రకృతిలో ఒక ప్రిన్సిపుల్ ఉంది. ఏమిటి అంటే ప్రాణం, దేహం అవి ప్రకృతితో ఎలా సింక్ లో ఉండాలి అనేది. ఆ నాలెడ్జి అందించడానికి వచ్చాడు స్వామి. ఈ అవతారాలన్నీ కూడా ప్రకృతిలో ఉన్న ప్రిన్సిపుల్స్‌ని మనకు అందించడానికి వచ్చాయి. దేహాన్ని ప్రాణాన్ని నిలబెట్టే ప్రిన్సిపుల్స్ అన్నీ సృష్టిలో ఉన్న వాటిని ఆయుర్వేదం అనే రూపంలో ఆయన అందించాడు. ఆ తర్వాత అవతారం ఏమిటి అంటే అమృతాన్ని పంచిన జగన్మోహిని అవతారం. శ్రీమహావిష్ణువు ఎంతో ఆకర్షణీయమైనది జగత్తు మొత్తాన్ని మోహించే స్వరూపాన్ని తీసుకొచ్చారు కదా? అది ఎందుకు ఆ స్వరూపంలో వచ్చాడు అంటే మామూలుగా మనకు తెలుసు అమృతం పంచడానికి వచ్చారు అని. అది కాకుండా సృష్టిలో స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ అనే ప్రిన్సిపుల్ ఉంది. ఆ ప్రిన్సిపుల్‌ని కిందకి తీసుకొచ్చిన స్వరూపం జగన్మోహిని అవతారం. ఇంక 15వ స్వరూపం ఏమిటంటే నరసింహ స్వరూపం. అదెందుకు వచ్చిందండి ఆ స్వరూపం అంటే సృష్టిలో ఒక బలహీనత కూడా ఉంది. ఏమిటంటే నేనే గొప్ప అందరూ నన్నే అనుసరించాలి అనే రాక్షస ప్రవృత్తి. అలాంటిది ఒక దుర్మార్గుడికి వచ్చింది. వస్తే స్వామి స్వరూపంలోంచి దాన్ని బద్దలగొట్టి అప్పుడు నరసింహ స్వామి కింద ప్రకటితం అయ్యాడు. ఆ తర్వాత 16వ అవతారం ఇది చాలా మందికి తెలియదు జాగ్రత్తగా వినండి. మూలావతారం అని పిలుస్తారు. ఏమిటండీ అది? విష్ణుమూర్తి అంటే అర్థం ఏమిటి? అంటే మనం అనుకుంటాం శంఖ చక్ర గదా పద్మాలు అని. అది మనకు కదా. భౌతికంగా కనిపించే రూపం. కానీ విష్ణుమూర్తి అనేది ప్రకృతిలో ఒక ప్రిన్సిపుల్. అదే విష్ణు సహస్రనామంలో ఫస్ట్ చెప్పేది. విశ్వం విష్ణుహు అని. అంటే విశ్వవ్యాప్తమైన కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని విష్ణువు అంటారు. ఆ ఎనర్జీ ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ నిల్చుంటే ఇక్కడ కూడా ఆ విష్ణువు అనేది ఉంటుంది. మనం తెలుసుకోవాలి అంతే. అయితే స్వామి ఏం చేశాడంటే ఆ ప్రిన్సిపుల్‌ని నిరూపించడం కోసం శ్రీహరి అని తన యధా రూపంతో ఒక అవతారం కింద దిగి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? అంటే గజేంద్రుడిని పాపం మొసలి పట్టుకుంటే గజేంద్రుడు పాహీ పాహీ అని అరిస్తే వైకుంఠం నుంచి స్వామి దిగి వచ్చాడు కదా. ఆ అవతారాన్ని మూలావతారం అని పిలుస్తారు. ఇది 16వది. ఇంక 17వ అవతారం వామనుడి అవతారం. ఇది మనందరికీ తెలుసుందే. బలిచక్రవర్తి ముల్లోకాల్ని ఆక్రమించేస్తే వామనమూర్తి ముల్లోకాల్ని మూడు పాదాలతో కొలిచాడు. అవే భూలోక, భువర్లోక, సువర్లోకాలు. అండ్ కొంచెం లాజికల్‌గా ఆలోచించండి. సైన్సు అది చదువుకుందాం మనం. ఎవరైనా ఎంత పెద్దది ఎదిగినా పాదంతో ఒక లోకం మొత్తాన్ని కొలిచేయగలరా అండి? ఏమిటి అసలు అది?
చాలా జాగ్రత్తగా వినండి. ప్రకృతిలో ఏదైనా సరే మనం అయినా, జంతువులైనా, ఏవైనా మూడింటిల సంయోగంతోనే ఉంటుంది. ఏమిటంటే మేటర్, ఎనర్జీ, కాన్షస్నెస్. మమ్మల్ని కూడా తీసుకోండి. మొట్టమొదట ఇదంతా మేటర్. ఇందులో ఉన్న ఎనర్జీ. దాంట్లో ఉన్న నేను అనే కాన్షస్నెస్ ప్రజ్ఞ. ఈ మూడు కలిస్తేనే ప్రకృతిలో ఏదైనా సృష్టించబడుతుంది. దాన్నే తెలుగులో ద్రవ్యము, శక్తి, ప్రజ్ఞ అని పిలుస్తారు ఈ మూడిటిని. ఈ మూడు నా నిర్వాకం అంటే ఇదంతా నేనే చేశాను అనుకునే జీవభావం ఉంటుంది. మనకు కూడా చాలాసార్లు వచ్చేస్తూ ఉంటుంది. ఏదో ఒక దాంట్లో మంచి మార్కులు వచ్చాయి, ఒక అవార్డు వచ్చాయి, 10 మంది పొగిడారు అనుకోండి. ఆహా నా బలిచక్రవర్తి పైకి లేస్తాడు. ఇదంతా నా నిర్వాకం అని. అప్పుడు భగవంతుడు వచ్చి ఆ జీవభావాన్ని దైవభావంతో ఆక్రమించేస్తాడు మొత్తం అంతా. అదే జ్ఞానం రావడం అంటారు. అలా చేసింది వామనావతారం. మన భూమిపైన జరిగిన మొట్టమొదటి మానవ అవతారం వామనావతారం. సరే ఇంక 18వది పరశురామ అవతారం. ఆయన ఏం చేశాడంటే 21 మార్లు దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరిని సంహరించి మళ్ళీ ధర్మసంస్థాపన చేశాడు. అంటే ప్రకృతిలో ఒక ప్రిన్సిపుల్ ఉంది. నిరంకుశత్వం ఎప్పుడైనా ప్రబలితే కనుక యుద్ధంతో దాన్ని అణచవచ్చు అని. ఆ ప్రిన్సిపుల్‌ని మొట్టమొదట భూమ్మీదకు తీసుకొచ్చి అందించింది పరశురామ అవతారం. ఆ తర్వాత ఆ సీడ్‌నే శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వాళ్ళందరూ కూడా నిరూపించారు. ఆ సీడ్ ప్రారంభించిన ఆ ప్రిన్సిపుల్‌ని పరశురామ అవతారం. ఇంకా 19వది ఏ అవతారం అంటే ఏ రూపాన్ని తలుచుకుంటే భారతీయులందరికీ ఒళ్ళు పులకించి పోతుంది? జై శ్రీరామ్ అని అరుస్తారో ఆ రామచంద్ర ప్రభు స్వరూపమే 19వ అవతారం. క్షత్రియుడిగా పుట్టాడు స్వామి. పుట్టి ఒకటి ఏమిటంటే స్వామి చేసింది రావణ వధ. ఇది మనకు విఖ్యాంతంగా తెలుసు కదా? దాని కన్నా ఇంపార్టెంట్ ఏమిటంటే ప్రకృతిలో రాజధర్మం అని ఒక ప్రిన్సిపుల్ ఉంది. అది ఎవరికీ తెలియదు. ఆ పరశురామ అవతారం వరకు కూడా దుర్మార్గులైన రాజులు అందుకే కదా స్వామి వాళ్ళందరిని తీసేశాడు. ఆ తర్వాత రాజధర్మం అనే ప్రిన్సిపుల్ ఎస్టాబ్లిష్ చేయడానికి భూమ్మీదకి దిగి వచ్చిన స్వరూపమే రామావతారం. అందుకే మీరు చూస్తే రావణ వధ ఈ కథ మొత్తం జరిగింది ఒక సంవత్సరం. దానికి ముందు ఆ వనవాసం అవన్నీను. కానీ రాముడు రాజ్యపాలన చేసింది దాదాపుగా 11,000 సంవత్సరాలు. ఎందుకు అంతకాలం చేశాడు అంటే స్వామి ఆ రాజధర్మం అంటే ఏమిటి అనేది నిరూపించడానికి వచ్చిన అవతారం. ఇంక 20వ అవతారం ఏమిటి అంటే వెంటనే కృష్ణావతారం అంటారు. కాదు ఈ రెండిటికీ మధ్యలో ఒకటి ఉంది. వ్యాస మహర్షి అవతారం. అప్పటికి వేదాలన్నీ కూడా ఎవరికీ మేనేజబుల్ కాని స్థితిలో ఉన్నాయి. అందుకని ఆ స్వామి ఆ స్వరూపంలో వచ్చి వేద విభజన చేసి పురాణ రచన కూడా చేశాడు. ఎందుకంటే వేదాలు అల్పబుద్ధులకు అర్థం కావు. వేదాన్ని నేర్చుకోవడం వేరు, వేదార్థం తెలియడం వేరు. చాలా కష్టం వేదార్థం తెలియడం అనేది. అందుకని సామాన్యులకు అర్థం అవ్వాలి అని వేద విజ్ఞానం అంతటిని పురాణాల రూపంలో ఇవ్వడానికి వచ్చిన అవతారమే వ్యాస మహర్షి. ఇంక 21, 22 అవతారాలు ఏమిటి అంటే బలరామావతారం, కృష్ణావతారం. అవి రెండు ఒకేసారి దిగివచ్చాయి. కాకపోతే శ్రీకృష్ణుడు విష్ణుమూర్తి యొక్క పరిపూర్ణమైన అవతారం. మొత్తం స్వామి కిందకి దిగివచ్చేస్తే ఏముంటుందో అదే కృష్ణావతారం. కానీ బలరాముడు ఏమిటంటే ఒక అంశావతారం విష్ణుమూర్తికి. ఆయన ఆయనలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి విష్ణుమూర్తిది ఇంకొకటేమో ఆదిశేషుడిది. ఆ రెండిటితో కలిపొచ్చాడు. వీళ్ళిద్దరూ రావడానికి ముఖ్యమైన కారణం ఏమిటంటే భూమికి పాపభారం తగ్గించే అవతారం ఈ రెండు. అందుకే చూడండి వీళ్ళు 17 సార్లు జరాసంధుడు దండయాత్ర చేస్తే దాదాపు 391 అక్షౌహిణుల దుర్మార్గులందరిని బలరామకృష్ణులు ఇద్దరూ కలిసి తుడిచిపెట్టి పాడేశారు. కురుక్షేత్ర యుద్ధం జస్ట్ 18 అక్షౌహిణులతో జరిగిన చాలా చిన్న యుద్ధం అది. దానికి ముందు వాళ్ళు చాలా పెద్ద యుద్ధాలు చేశారు. భాగవతం చదివితే తెలుస్తుంది. దుష్ట సంహారం ఆ రకంగా చేశారు. కాకపోతే నేను చెప్పాను కదా బలరాముడిలో రెండు అంశాలు ఉన్నాయని. ఆ విశ్వంశతో వచ్చి ఆయన చేసింది ఏమిటంటే ఇంతమంది దుష్టుల్ని సంహరించారు. ఆ ఆదిశేషుడి అంశతో చిన్న చిన్న పొరపాట్లు కూడా ఉన్నాయి. ఒకటి ఏమిటంటే ఆ దిక్కుమాలిన దుర్యోధనుడి మీద వాత్సల్యం. బలరాముడికి దుర్యోధనుడి అంటే అమితమైన ప్రేమ. రెండోది ఏమిటంటే సూత మహర్షి తెలుసు కదా? మనం పురాణాలు ఏది చదువుకుందా సూతుడి పేరుతోనే మొదలవుతుంది. ఆ సూత మహర్షిని బలరాముడు చాలా అన్యాయంగా చంపేశాడు. ఇవన్నీ ఏమిటి అంటే ఆ రెండో అంశ అన్నమాట. ఆ క్రోధం అనే అంశ ఒకటేమో ధర్మసంస్థాపన అనే విష్ణు అంశ ఆ రెండిటితో వచ్చారు. 23వ అవతారం ఏమిటి అంటే బుద్ధావతారం. ఇక్కడ అందరికీ ఒక సందేహం వస్తుంది. ఏవండీ చరిత్రలో ఉన్న గౌతమబుద్ధుడు ఈయనేనా అని. కాదు. పురాణంలో ఉన్న బుద్ధుడు వేరు. పౌరాణిక బుద్ధుడు వేరు. గౌతమబుద్ధుడు వేరు. మనకు రామాయణంలో కూడా పౌరాణిక బుద్ధుడి గురించి ప్రస్తావన ఉంది. అంటే శ్రీరాముడి కన్నా ముందు వచ్చిన ఆయన. ఈ చరిత్రలో ఉన్న బుద్ధుడు మనకు తెలిసిన చరిత్రలో ఈ మధ్య ఈ మధ్య వచ్చిన ఆయన. ఆ ముందు వచ్చిన బుద్ధుడిని తథాగత బుద్ధుడు అని పిలుస్తారు. ఆయన ఎందుకు వచ్చాడు అంటే మీకు గతంలో చాలా విస్తారంగా చెప్పాను. ఇక్కడ క్లుప్తంగా చెప్తా. దివోదాసు అనే రాజు ఆయన చాలా ధర్మాత్ముడే. కానీ వారణాసి క్షేత్రం మొత్తంలోకి దేవతా శక్తులు అవి రాకుండా ప్రజలకి అందకుండా చేసేసాడు. అది ఒక రకమైన తప్పు చేశాడు ఆయన తెలియనతనంలోను. అప్పుడు బుద్ధుడి అవతారంలో వచ్చి అవైదిక అని బోధించేసరికి అప్పుడు అందరూ నాస్తికుల కింద తయారయి వేదాన్ని, దైవాన్ని వదిలేసి దూషించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ఆ పని చేస్తారో ధర్మం దెబ్బతింది. వెంటనే దివోదాసు పాలన పడిపోయింది. మళ్ళీ దైవిక శక్తులన్నీ వచ్చేసాయి. అంటే కొన్ని కొన్ని సార్లు స్వామి అవసరమైతే నెగిటివ్ పని కూడా చేసి ధర్మసంస్థాపన చేస్తాడన్నమాట. డాక్టర్ చూడండి. పుండు వచ్చింది అనుకోండి డాక్టర్ సామాన్యంగా మన ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ట్రై చేస్తాడు. పుండు వస్తే నిర్దాక్షిణ్యంగా తీసేస్తాడు అంతేను సర్జరీ చేసి. అలాగ బుద్ధావతారం అది చేసింది. ఈ బుద్ధుడు వేరు. చరిత్రలో బుద్ధుడు వేరు. ఇంక 24వది కల్కి అవతారం. రాబోతూ ఉన్నది. అది ఎందుకు వస్తుంది అంటే యుగ సంధిలో పాలకులు చాలా దారుణంగా ఉంటే అప్పుడు స్వామి శంభల అనే గ్రామంలో జన్మిస్తాడు. నేను గతంలో రెండు వీడియోలలో విస్తారంగా చెప్పాను. అవి చూడండి చూడకపోతే గనుక. అర్థమైంది కదా? ఇవి 24 అవతారాలు స్వామివి. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఉన్నాయి. హంసావతారం, మను అవతారం అని కానీ విఖ్యాంతమైనవి 24 కాబట్టి ఇవి మీకు చెప్పాను.
ఇప్పుడు మీకు అర్థమైపోయే ఉంటుంది. ఏమిటండీ దశావతారాల్లో మోహిని ఎందుకు లేదు అంటే 24 అవతారాల్లో మోహిని స్వరూపం ఉంది. కానీ దశావతారాలు అని మనం క్రియేట్ చేసుకున్న ఫ్రేమ్ లో లేదు. మీకు ఈ నాలెడ్జి అంతా అర్థమైంది కదా? కొంచెం ఓపికగా వింటానంటే మీ ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు సమాధానాలు చెప్తా. మొట్టమొదటిది మరి ఈ దశావతారాలనే కాన్సెప్ట్ ఎక్కడ నుంచి వచ్చిందండీ అంటే దానికి నాలుగు కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఒక ప్రఖ్యాంతమైన శ్లోకం ఉంది. మత్స్యకూర్మవరాహశ్చ నారసింహస్య వామనః రామో రామస్య కృష్ణస్య బుద్ధ కల్కి రేవచ. ఈ శ్లోకంలో వేరియెన్స్ కూడా ఉన్నాయి అనుకోండి. ఆ శ్లోకంలో పది ఉన్నాయి కాబట్టి పది అనేది ఒక ఎస్టాబ్లిష్ చేయండి. రెండోది ఏమిటంటే లలితా సహస్రంలో కరాంగుళినఖోత్పన్న నారాయణదశాకృతిహే అని ఉంది. అంటే అమ్మవారు దుష్ట శిక్షణ చేస్తున్నప్పుడు ఆ తల్లి గోళ్ళల్లోంచి నారాయణుడి పది అవతారాలు వచ్చి అక్కడ ఉన్న దుర్మార్గుల్ని సంహరించాయి. దశావతారాలు అనే కాన్సెప్ట్ అక్కడ కూడా ఒక ఎస్టాబ్లిష్ చేయండి బాగా. ఇంక మూడోది ఏమిటంటే స్కందపురాణంలో కథ ఉంది. అంబరీషుడు, దుర్వాసుడు జరిగింది కదా ఏకాదశి కథ. అయితే అప్పుడు దుర్వాసుడు అంబరీషుడిని శపించాడు. నువ్వు నానా యోనులలో జన్మించు చేప లాగా, తాబేలు లాగా, వరాహం లాగా అని. అప్పుడు విష్ణుమూర్తి నా భక్తుడి కొద్ది శాపం నేను తీసుకుంటాను అని చెప్పి తీసుకుని పది అవతారాల కింద వచ్చాడు అని స్కందపురాణంలో ఉంది. అక్కడ నుంచి ఒకటి పది అనేది వచ్చింది. ఇంక నాలుగోది ముఖ్యంగా ఏమిటంటే రాబోయే కల్కి అవతారాన్ని పక్కన పెడితే కనుక ఆ మిగతా తొమ్మిది అవతారాలకి తొమ్మిది గ్రహాలకి సంబంధం ఉంది. అందులో ఒక్కొక్క స్వరూపాన్ని అంటే కూర్మావతారాన్ని ఆరాధిస్తే ఒక గ్రహాన్ని అనుకూలింపజేస్తుంది. నరసింహావతారం ఒక గ్రహాన్ని అనుకూలింపజేస్తుంది. అదొక కాన్సెప్ట్. మీకు ఎప్పుడైనా కావాలంటే ఇంకో షార్ట్ వీడియోలో చెప్తాను అది. అలాగా ఒక కాన్సెప్ట్ ఉంది. దాని వల్ల పది వచ్చింది. అందువల్ల ఈ పది అనే ఫామ్ వచ్చింది తప్ప విష్ణుమూర్తికి పది అవతారాలు కాదు 24 అవతారాలు. అలాగనే మనం అవతారం అంటే సామాన్యంగా అనుకునే తప్పు ఒకటి ఉంది. ఏమిటంటే అవన్నీ సీక్వెన్షియల్ ఆర్డర్ లో ఒక అవతారం వస్తుంది. ఆ అవతారం వెళ్ళిపోయాక తర్వాత ఇంకొకటి వస్తుంది. అలా అనుకుంటాం. కాదు. ఈ అవతారాలన్నీ కూడా నేను ఇందాక చెప్పినట్టు ప్రకృతిలో ఉన్న శక్తులు. అవన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఆ అవతారాలు దిగి వచ్చినప్పుడు ఉన్నాయి. ఇప్పటికీ కూడా ఉన్నాయి. అందుకే నరసింహ స్వామి, వరాహ స్వామి, కృష్ణుడు వాళ్ళందరూ ఈ రోజు తలుచుకున్నా సరే వస్తారు కిందకి. కాకపోతే రాముడు, కృష్ణుడు, కల్కి అవతారాలు ఇలాంటివి మానవ స్వరూపాల్లో కిందకు వచ్చాయి కాబట్టి దేహం విడిచినట్టుగా చూపించారు వాళ్ళు. నరసింహావతారం, వరాహావతారం అవన్నీ మానవ స్వరూపంలో రాలేదు అవి వేరే భూమికలో జరిగాయి. అందుకే వాటిలో శరీరం విడిచిపెట్టడం అనేది ఉండదు. ఆ వెలుగు మాత్రం ముందు నుంచే ఉంది. ఇప్పటికీ అలాగనే ఉంటుంది. మీకు అసలు ఈ అవతారాలు అర్థం కావాలంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి. ఏమిటంటే ఒక పెద్ద నది ఉంది. ఆ నది నిండా నీళ్ళు ఉన్నాయి. అది భగవత్ స్వరూపం అనుకోండి. భగవంతుడి యొక్క ప్రేమో ఆ శక్తో అనుకోండి. మనం పొలాల లాంటి వాళ్ళం. చిన్న చిన్న పొలాలు. మనకు ఆ నీళ్ళు అందట్లేదు. ఈ పొలం నది దగ్గరికి వెళ్ళగలదా? వెళ్ళలేదు. అప్పుడు ఏమవుతుంది? మధ్యలో ఒక కాలువ ఏర్పడుతుంది. పంటకాలవ అంటుంటారు కదా. ఆ కాలువ ద్వారా నీళ్ళు వచ్చి నది దగ్గరికి వెళ్ళలేని పొలాలన్నిటికీ నీళ్ళు సప్లై అవుతాయి అంతేనా? అలాగే శ్రీమహావిష్ణువో, పరమేశ్వరుడు ఎవరో ఒకళ్ళని తీసుకుంటే వాళ్ళు ఆ తత్వంలో ఉన్నప్పుడు మనం అక్కడికి చేరుకోలేము. ఆ తత్వాన్ని మనకు చేర్పించడానికి కాలువ లాంటివి ఈ అవతారాలు. అంటే మన మీద కారుణ్యంతో మనకు ఆ నీరు అందివ్వాలి అని భగవంతుడు మన దాకా వచ్చిందే అవతారం. ఇప్పుడు ఆలోచించండి. రెండు కాలువలు ఇలా వస్తున్నాయి నది నుంచి. ఆ రెండు కలిసే అవకాశం ఉందా? అలాగనే పరశురాముడు రాముడిని కలవడం, కృష్ణుడిని కలవడం అన్నీ అలా జరిగాయి. సీక్వెన్షియల్ కాదు ఇవన్నీను. ఇంకా మీరు అడిగే ఇంకో ప్రశ్న వెంకటేశ్వర స్వామి అవతారంలో ఎందుకు లేడు అని. గుర్తుపెట్టుకోండి. వెంకటేశ్వర స్వామి అవతారం కాదు. విష్ణుమూర్తే కిందకి దిగి వచ్చాడు. అందుకే ఆయన అవతారంలో ధర్మసంస్థాపనలో, బోధలో అలాంటివి ఏవి ఉండవు. ఆ విగ్రహ రూపంలో అర్చామూర్తి రూపంలో ఉంటూ మౌనంగా మనల్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇంకా మీకు తేలికగా అర్థం అవ్వడానికి ఒక ఉదాహరణ చెప్తా. ఇందాక విష్ణుమూర్తి తత్వం అనేది ఒక పెద్ద నది అయితే ఈ అవతారాలన్నీ కాలువలు మన దగ్గరికి రావడానికి అని చెప్పాను కదా. వెంకటేశ్వర స్వామి ఏమిటంటే ఆ నదికి తీసిన ఫోటో అంట ఆయన. అర్థమైంది కదా? అందుకని దశావతార ఈ అవతారాల్లో లేరు. ఈ ఎగ్జాంపుల్ తో మీకు తేలికగా అర్థమైపోయి ఉంటుంది. ఆయన ఆ నది ఒక్కటే. రెండు ఒకే రూపానికి రెండు కాపీస్ అంతే. ఆ ఇంక ఆఖర్లో కూర్మావతారంలో బలి చక్రవర్తి ఉన్నాడు. కానీ నరసింహావతారంలో పుట్టిన ప్రహ్లాదుడికి మనవడు. ఇవన్నీ ఏమిటండీ అంటే మీకు ఇందాక చెప్పినట్టు ఇవన్నీ ఒక మన్వంతరంలో ఒక కల్పంలో జరగలేదు. ఎప్పుడెప్పుడెప్పుడెప్పుడో జరిగాయి. ఆ సీక్వెన్స్ కూడా ఎక్కడా ఇవ్వలేదు. ఈ అవతారాలు మాత్రమే ఇచ్చారు అంతే గాని అది సీక్వెన్స్ కాదు. ప్రహ్లాదుడు ఉదాహరణకు స్వాయంభువ మన్వంతరంలో ఉంటే కూర్మావతారం చాక్షుషీ మన్వంతరంలో జరిగింది. ఇప్పుడు ఆఖరి ప్రశ్న డార్విన్ థియరీ జీవ పరిణామ క్రమం ఉంది కదా? దాని ప్రకారం మొట్టమొదట జలచరం అంటే చేప. తర్వాత ఉభయచరం అంటే తాబేలు. తర్వాత ఒక జంతువు. ఆ తర్వాత మనిషి, జంతువులా ఉన్నది నరసింహ. ఆ తర్వాత డ్వార్ఫ్ అంటే చిన్న స్వరూపంలో ఉన్నది వామనుడు. ఆ తర్వాత పరశురాముడు ఆటవికంగా అందరిని నరికేసే ఆయన. తర్వాత రాముడు అనేది పరిపూర్ణమైన మానవుడు. కృష్ణుడు అనేది ఇంకా మెచ్యూర్డ్ మానవుడు. ఇలాగ ఒక థియరీ చెప్తూ వచ్చింది. ఇది ఎక్కడ వచ్చిందండీ అంటే మనకు ఒక ప్రఖ్యాంతమైన యూనివర్సిటీ ఉంది. ఇండియాలోనే టాప్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీకి ఉన్నంత మంది విద్యార్థులు ప్రపంచంలో ఏ యూనివర్సిటీకి లేరు. ఏమిటండీ అది? వాట్సాప్ యూనివర్సిటీ. వాట్సాప్ యూనివర్సిటీలో ఏదొచ్చినా సరే అది మనకు వేదప్రమాణమే కర్మ. అలాగా ఎవడో పుట్టించాడు. వామనుడు డ్వార్ఫ్ ఏమిటండీ? ఆయనెవరో మరుగుజ్జు. ఏదో పుట్టించారంతే. వామనుడు వర్తుస్వరూపంలో వచ్చాడు ఆయన. డ్వార్ఫ్ కాదు. అలాగే పరశురాముడు ఆటవికుడు ఏం కాదు. ఆయన అప్పుడు ధర్మసంస్థాపన అవసరం కాబట్టే ఆయన చేశాడు. అందుకని ఆ థియరీ పక్కన పెట్టేయండి. అది ఎవరో సరదాగా సృష్టించారు. చదువుకోవడానికి బానే ఉంటే చదువుకోండి అంతే. ఆఖరిగా ఒక్క కాన్సెప్ట్ మాత్రం చెప్తాను మీకు. ఇది చాలా మంది అడుగుతూ ఉంటారు. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన ఇవన్నీ ఈ జీవుడు కడుపులో పడడానికి దానికి ఎన్నా సంబంధం ఉందా అంటే ఒక రకంగా ఆలోచిస్తే కనుక ఇవన్నీ సృష్టిలో జరిగిన అవతారాలైతే ఇప్పుడు మన లోపల కూడా ఒక సృష్టి ఉంది. అక్కడ కూడా ఇలాంటివే జరుగుతూ ఉంటాయి. ఒక్కసారి ఆలోచించండి. మత్స్యావతారం అంటే సన్నగా పాకుంటూ వెళ్ళే ఒక చేప. తండ్రిలో ప్రవేశించిన ప్రాణశక్తి శుక్ర కణం అనే నావ ద్వారా అలా తల్లి దగ్గరికి వచ్చి ఆ వచ్చేటప్పుడు తన పూర్వ సృష్టి యొక్క జ్ఞానాన్ని మోసుకుని జీవుడు ఇక్కడికి వస్తాడు కదా. అదే ఒక రకంగా ఆలోచిస్తే మత్స్యావతారం. ఆ కణమే లోపలికి వచ్చిన తర్వాత ఘనీభవించి ఒక చిన్న బుడగలా ఏర్పడుతుంది ఇలాగ. మీరు ఎంబ్రియాలజీ చూస్తే కనుక ఒక చిన్న బుడగ దానికి ఒక చిన్న తల, దాని తర్వాత ఒక చిన్న వెన్నుపూస, ఒక డిప్ప ఇవన్నీ మనం ఆలోచిస్తే కూర్మావతారం. ఇట్లె జగద్వ్యాపకమైన అవతారాలు అని ఎందుకు అంటారు అంటే జగత్తులో ప్రతి జీవిలోనూ ఇలాంటివే జరుగుతాయి గనుక. ఆ తర్వాత ఆ జీవుడు ప్రసవ వేదన సమయంలో ఉక్కిరిబిక్కిరి అయిపోయి దైవాన్ని స్వామి నన్ను బయటికి తీసుకురా అని వేడుకుంటాడు. మీరు పురాణంలో చాలా చోట్ల చెప్పారు. ఆ తర్వాత మావి పట్టుకుని చీల్చుకుని భూమి మీద పడి శ్వాస తీసుకుని అమ్మా అని ఊపిరి పీలుస్తాడు. ఇదంతా ఏమిటి అంటే గజేంద్ర మోక్షంలో వర్ణించింది. గజేంద్ర మోక్షం మొత్తం చూడండి. ఆ మొసలి పట్టుకుంటే ఆ ఏనుగు బయటికి లోపలికి, లోపలికి బయటికి ఇవన్నీ కూడా మనం బయటికి వచ్చేటప్పుడు జరిగే ప్రక్రియ. అదే గజేంద్ర మోక్షం. అప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలనే రెక్కలు ఉన్న గరుత్మంతుల మీద నారాయణుడు వచ్చి అనుగ్రహించాడు అని ఉంది కదా. అదేమిటంటే మనకు ఊపిరిచ్చి అనుగ్రహించడం. ఆ తర్వాత కిందకి పడి వస్తాడు కదా? అది వామనావతారం అన్నమాట. ఇవన్నీ తల్లి గర్భంలో జరుగుతాయి. అందుకే వామనావతారాన్ని భూమి మీద జరిగిన మొట్టమొదటి అవతారం అని పిలుస్తారు. ఇది దశావతారాల గురించి చాలా పెద్ద వీడియో అయింది గాని మీరందరూ ఎప్పటి నుంచో అడుగుతున్న ప్రశ్నలన్నిటికీ సమాధానం వచ్చేసి ఉంటుంది అంతేనా? ఈ పవిత్రమైన మార్గశిర మాసంలో అందరూ వినాలి, ముక్కోటి ఏకాదశి సమయంలో అని చెప్పి ఇంతసేపు ఓపికగా చేసిన వీడియో. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. మన ఆధ్యాత్మిక వీడియోని.
No comments:
Post a Comment