బివి పట్టాభిరామ్...పరిచయం అక్కర్లేని పేరు.కృషి
వుంటే మనుషులు పట్టాభిరామ్ లవుతారు.ఆయ
న్ను దగ్గరగా చూసిన వాళ్ళకు ఈ విషయం అర్థమ
వుతుంది. ఐంద్రజాలికుడిగా వినోదాన్నిపంచిన పట్టా
భి..చూస్తూ చూస్తూ వుండగానే మానవ మనస్తత్వ శాస్త్రవేత్త అయ్యారు.వ్యక్తిత్వ వికాసం నిపుణుడి గా
ఎంతోమంది మానసిక చికాకుల్ని దూరం చేశారు.
విద్యార్థుల్లో ఆత్మన్యూనతా భావాన్ని పారదోలి విజ
యం మెట్లు ఎక్కించడం నేర్పించారు.కౌన్సిలింగ్ ద్వారా ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపా
రు.వ్యక్తిత్వ.
‘వ్యక్తిత్వ’ వికాసంపై ఓ పెద్ద బీరువాకు సరిపడా
పుస్తకాలు రాశారు.రోల్ మోడల్అనిపించుకున్నారు.
*కష్టపడి చదవొద్దు..
.ఇష్టపడి చదవండి
*మాటే మంత్రం …
*మాస్టర్ మైండ్…
*నో ప్రాబ్లం..
*మీరు మార్గాలను కుంటున్నారా?
*లీడర్ షిప్
*కష్టపడి పనిచెయ్యొద్దు..ఇష్టపడి చేయండి
*నేను సైతం…
*సూత్రధారులు..
*జీనియస్…
*స్ఫూర్తి ప్రదాత లు
*అద్భుత ప్రపంచం..అతీంద్రియ శక్తులు.
*జాతి నేతలు..
*మనసు భాష..మైండ్ మేజిక్
*గుడ్ స్టూడెంట్…
*విజయం మీదే…
ఎన్నిపుస్తకాలో…వ్యక్తిత్వ వికాసంలో మరువలేని
అక్షరం సరస్వతి డాక్టర్ పట్టాభి రామ్ గారు…
నాకు మంచి మిత్రులు..మా పిల్లల్ని కూడా ఆయన
క్లాసులకు పంపాను.ఎందుకో చాలా కాలమైంది ….
ఆయన్ను కలిసి..మనుషులు బతికుండగానే తరు
చూ కలుస్తుండాలి.. లేకుంటే ఇలాగే బాధపడాలి.
ఈ గొప్ప “ వికాసకుడు” లేని లోటు తీర్చలేనిది!!.
*మిత్రులు పట్టాభిరామ్ గారికి కన్నీటి నివాళులు..
*ఎ.రజాహుస్సేన్..!!
No comments:
Post a Comment