Wednesday, 25 December 2024

శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి గారు, భారత రాజకీయాలలో ఒక అద్భుతమైన అధ్యాయం. వారి జీవితమంతా నీతి, నిజాయితీ, నిరాడంబరత వంటి విలువలతో నిండి ఉండి, భారత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి గారు, భారత రాజకీయాలలో ఒక అద్భుతమైన అధ్యాయం. వారి జీవితమంతా నీతి, నిజాయితీ, నిరాడంబరత వంటి విలువలతో నిండి ఉండి, భారత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది.

పోఖ్రాన్ అణు పరీక్షలు ద్వారా ప్రపంచానికి భారత శక్తిని చాటించారు. కార్గిల్ యుద్ధం సమయంలో తీసుకున్న ధైర్యవంతమైన నిర్ణయాలు, దేశ రక్షణలో వారి అంకితభావాన్ని ప్రతిబింబించాయి. స్వర్ణ చతుర్భుజ ప్రణాళిక ద్వారా దేశ ఆర్థిక మరియు రవాణా వ్యవస్థను ప్రగతిపథంలో నడిపించారు. సర్వశిక్షా అభియాన్ ద్వారా విద్యను ప్రతి భారతీయుడికి అందుబాటులోకి తీసుకువచ్చి, సమాజ ప్రగతికి ఊతమిచ్చారు.

వారు మాటలతోనే కాదు, ఆచరణతో కూడా స్ఫూర్తిగా నిలిచిన ధీరోదాత్తుడు. వారి దార్శనికత భారత రాజకీయాల్లో ఒక మార్గదర్శకంగా నిలిచింది. భారతరత్న బిరుదుతో సత్కరించబడిన ఆయన, పార్లమెంట్‌లో అత్యున్నత ప్రమాణాలను స్థాపించి ఉత్తమ పార్లమెంటేరియన్గా ప్రశంసలందుకున్నారు.

నేడు, ఆ మహానేత శత జయంతి సందర్భంగా, దేశ ప్రజలందరం ఒక గొప్ప నాయకుడిని, ఆయన సేవలను గౌరవప్రదంగా స్మరించుకుంటూ, ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. జయహో అటల్ జీ!

No comments:

Post a Comment