సబ్ క మాలిక్ ఏక్ హాయ్
ఒక్కడే సూర్యుడు ఒక్కడే చంద్రుడు
ఒక్కడే ఆ దేవుడు
రాముడే దేవుడని కొలిచింది మీరు
యేసు నే దైవం అని తలచింది మీరు
అల్లాహ్ అని ఎలుగెత్తి పిలిచింది మీరు
ఏ పేరు తో ఎవరు పిలుచుకున్న
ఏ తీరుగ ఎవరు పూజించిన
ఈ చరా చెర జగతి సృష్టించి నడిపించు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
భాషాయ ధ్వజమునెత్తి ప్రణవగంగా కలగలాలను
హిందూ మతమన్నావు నీవు
ఆకు పచ్చ కేతనం చంద్రవంక కళకళలను
ఇస్లాం అన్నావు నీవు
సిలువ పైన యేసు రఖ్త కన్నీళ్లతో ఎదలు తడిసి
క్రైస్తవమని అన్నావు నీవు
బౌద్ధం అని జైనం అని సిఖ్ అని
మొక్కుకునే పలు గుండెల పలు పెదాల పలుకేదైనా
ఈ చరా చెర జగతి సృష్టించి నడిపించు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
రాజు పేద భేదం ఎపుడు చూపబోదు గాలి
అది దేవా దేవుని జాలి
పసిడి మెడని పూరి గుడిసేని
భేదమెఱిగి కురియబోదు వాన
అది లోకేశవరేశ్వరుని కరుణ
సాటి మానవాళి హృదయ ఆలయాల కొలువుదీరి
ఉన్నాడు ఆ స్వయంభువుడు
కులం అని మతం అని జాతులని
బ్రాంతి వీడు
ప్రతి అడుగున తన రూపమే ప్రతిబింబముగ
ప్రతి జీవిని పరమాత్మకు ప్రతిరూపముగ
ఈ చరా చెర జగతి సృష్టించి నడిపించు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
ఒక్కడే దేవుడు ఒక్కడే దేవుడు
ఒక్కడే ఆ దేవదేవుడు
No comments:
Post a Comment