ఆ సుందరాంగున్ని చూడూ మా తల్లి సీతమ్మ జోడూ
అందాలన్నీ చూడ కళ్ళు చాలా కుంటే నా మనసుతో చూడు
చూడయ్యో
ఆ రూపం అపురూపం నిలపాలోయ్ గుండె లోపలా
ఆ దైవం మనకోసం వెలిశాడోయ్ నేలపై ఇలా
కోదండ రాముణ్ణి చూడూ కోరింది ఇచ్చేటి వాడూ

శ్రీ రాముని చిరు నవ్వుగా వెలుగొందిన సీతా
ఆ దేవుని వెనకాతలే పనికెగును మాట
లంకేశుడు బెదిరించెను పలు మాయల చేతా
బెంబేలున మూర్ఛిల్లెను అయ్యో మన సీతా
ఆ బాధే నాలో పాటై పాడెను రామాయణం
కోదండ రాముణ్ణి చూడూ కోరింది ఇచ్చేటి వాడూ
ఆ సుందరాంగున్ని చూడూ మా తల్లి సీతమ్మ జోడూ
హనుమంతుడు వివరించెను సీతా సతి జాడా
శ్రీ రాముడు వదిలించెను లంకేశుని ఛీడా
పర నిందకు శీలంబును సెంకించుట చేతా
పెను మంటలలో దూకి పునీతాయే సీతా
ఆ గాదె నాలో పాటై పాడెనూ రామాయణం
కోదండ రాముణ్ణి చూడూ కోరింది ఇచ్చేటి వాడూ
ఆ సుందరాంగున్ని చూడూ మా తల్లి సీతమ్మ జోడూ
అందాలన్నీ చూడ కళ్ళు చాలా కుంటే నా మనసుతో చూడు
చూడయ్యో
ఆ రూపం అపురూపం నిలపాలోయ్ గుండె లోపలా
ఆ దైవం మనకోసం వెలిశాడోయ్ నేలపై ఇలా
కోదండ రాముణ్ణి చూడూ కోరింది ఇచ్చేటి వాడూ
ఆ సుందరాంగున్ని చూడూ మా తల్లి సీతమ్మ జోడూ
No comments:
Post a Comment